మొదటి ముఆవియా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మొదటి ముఆవియా
ఖలీఫా
ఉమయ్యద్ రాజవంశపు తొలి ఖలీఫా
Reign661–680
Predecessorరాజవంశ స్థాపకుడు
హసన్ ఇబ్న్ అలీ (ఉమయ్యద్ పూర్వపు ఖలీఫాగా)
Successorమొదటి యాజిద్
సిరియా గవర్నర్
పరిపాలన కాలం639–661
Predecessorయాజిద్ ఇబ్న్ అబీ సూఫ్యాన్
Successorపదవి లేదు
జననంసుమారు 597–605
మక్కా
మరణంఏప్రిల్ 680
డెమాస్కస్
Issueమొదటి యాజిద్
అబ్ద్ అల్లా
రామ్లా (కుమార్తె)
Names
ముఆవియా ఇబ్న్ అబీ సూఫ్యాన్
(معاوية ابن أبي سفيان)
Houseసూఫ్యానిద్
రాజవంశంఉమయ్యద్
తండ్రిఅబు సూఫ్యాన్ ఇబ్న్ హర్బ్
తల్లిహింద్ బింత్ ఉబ్తా
మతంఇస్లాం

మొదటి ముఆవియా (సా.శ.. 597 లేదా 603 లేదా 605[1] - 680 ఏప్రిల్; పూర్తిపేరు: ముఆవియా ఇబ్న్ అబీ సుఫ్యాన్) ఉమ్మయ్యద్ ఖలీఫత్ వ్యవస్థాపకుడు, తొలి ఉమ్మయ్యద్ ఖలీఫా. 661 నుంచి 680లో అతను మరణించేవరకూ ఖలీఫాగా కొనసాగాడు. ఇతను ఇస్లామిక్ ప్రవక్త ముహమ్మద్ మరణం తరువాత 30 ఏళ్ళు గడవకుండానే నలుగురు "సరైన మార్గనిర్దేశం గల" (రషీదున్) ఖలీఫాల పాలన తదుపరి ఖలీఫా అయ్యాడు. రషీదున్ ఖలీఫాలకున్న న్యాయం, ధార్మిక ప్రవర్తనలతో సరితూగడని భావించినప్పటికీ ముఆవియా తన పేరు నవీనమైన ఇస్లామిక్ సామ్రాజ్యపు నాణేలు, శాసనాలు, పత్రాల్లో కనిపించిన మొదటి ఖలీఫాగా గుర్తింపు పొందాడు.[2]

ముఆవియా అతని, తండ్రి అబూ సుఫ్యాన్ తమ ఖురేషీ తెగచెందినవాడూ, దూరపు బంధువు[3][3] అయిన ముహమ్మద్‌ను 630లో అతను మక్కాను జయించేవరకు వ్యతిరేకించారు.[1] ఆ తరువాత మువావియా ముహమ్మద్ లేఖకులలో ఒకడు అయ్యాడు.[1] ముహమ్మద్ మరణానంతరం అబూ బక్ర్ (పరిపానా కాలం 632-634) ఖలీఫా అయ్యాకా ముఆవియా అన్న యాజిద్ ఇబ్న్ అబి సూఫ్యాన్‌ని సిరియా ఆక్రమణకు సైన్య నాయకుల్లో ఒకడిగా పంపాడు. యాజిద్ సైన్యంలో ముందుండే దళానికి నాయకునిగా ముఆవియాను అబూ బక్ర్ నియమించాడు.[1] ఇతను సిరియా ఆక్రమణ తర్వాత పరిపాలనలో పదవి తర్వాత పెద్ద పదవి సంపాదిస్తూ క్రమేపీ ఖలీఫా ఉస్మాన్ పరిపాలనా కాలం (పరిపాలన. 644-656)లో సిరియా ప్రావిన్స్ పరిపాలకుడు (గవర్నర్) అయ్యాడు.[1] ప్రావిన్సులోని శక్తివంతమైన బాను కల్బ్ తెగతో రాజకీయంగా మిత్రత్వం సంపాదించి,[4] తీరప్రాంత నగరాలకు రక్షణ వ్యవస్థ అభివృద్ధి చేసి,[5] బైజాంటైన్ సామ్రాజ్యంపై యుద్ధ ప్రయత్నాలు సాగించాడు.[1] ఈ దాడులు ముస్లిం సామ్రాజ్యపు మొట్టమొదటి నౌకా యుద్ధాలుగా పేరుపడ్డాయి.[6] 656లో ఉస్మాన్ హత్య తర్వాత, ముఆవియా ఖలీఫా మరణానికి ప్రతీకారం తీర్చుకోవాలని నిశ్చయించుకున్నాడు, అతని తర్వాత ఖలీఫా అయిన అలీని వ్యతిరేకించాడు.[7] మొదటి ముస్లిం అంతర్యుద్ధంలో అలీ, ముఆవియాల సైన్యాలు తలపడినా సిఫిన్ యుద్ధంలో విజయం ఎవరికీ దక్కక ప్రతిష్టంభన ఏర్పడింది.[8] తర్వాత ఈ ప్రతిష్టంభనను పరిష్కరించడానికి పలు మధ్యవర్తిత్వాలు, చర్చలు జరిగినా అన్నీ నిష్ఫలమయ్యాయి.[9] ముఆవియా సిరియన్ మద్దతుదారుల్లోనూ, అతని మద్దతుతో అలీ నియమించిన ఈజిప్ట్ గవర్నర్‌ని జయించి ఈజిప్ట్ కైవసం చేసుకున్న ముఆవియా మిత్రుడు అమర్ ఇబ్న్ అల్-అస్ వంటి వారిలో ఖలీఫాగా గుర్తింపు పొందాడు. 661లో అలీ హత్య తరువాత,[10] అలీ కుమారుడు, వారసుడు అయిన హసన్‌ను ఖలీఫా పోటీ నుంచి విరమించుకొమ్మని కుఫా నగరంలో ముఆవియా లేఖల ద్వారానూ, తర్వాత సైనికాధిక్యత ద్వారానూ బలవంతపెట్టి ఆ ప్రయత్నంలో విజయం సాధించి శాంతి ఒప్పందాన్ని పొందాడు.[11][12][13] ఆపైన ముఆవియా ఆధిక్యత ఖలీఫత్ అంతటా అంగీకారం పొందింది.[12]

అంతర్గత వ్యవహారాల్లో, ముఆవియా నమ్మకస్తులైన సిరియన్ తెగలపైన,[14] సిరియన్ క్రిస్టియన్లు అధికంగా ఉన్న ప్రభుత్వ యంత్రాంగంపైన ఆధారపడ్డాడు.[15][16][16] పరిపాలన రంగంలో తపాలా మార్గానికి, ఉత్తరప్రత్యుత్తరాలకు, అధికార వ్యవహారాల నిర్వహణకు ప్రభుత్వ విభాగాలు తొలిసారి ఏర్పరిచిన పేరు ముఆవియాకి దక్కింది. విస్తరణ ప్రయత్నాల్లో చూస్తే, బైజాంటైన్లపై భూమార్గంలోనూ, సముద్రమార్గంలోనూ ప్రతీ సంవత్సరమూ దాడులు క్రమం తప్పకుండా చేయడంలో నిమగ్నమయ్యాడు.[17]

ముఆవియా పరిపాలనా కాలంలో అతను చేపట్టిన అరబ్-బైజాంటియా యుద్ధాలు సాగిన ప్రాంతపు పటం

వీటిలో 674-678 మధ్య జరిగిన విఫలమైన కాన్‌స్టాంటినోపుల్ ముట్టడి కూడా ఉంది. తన పరిపాలన ఆఖరి దశలో పరిస్థితి తిరగబడి అరబ్బులకే ఎదురుతిరిగి తానే సంధి కోసం అభ్యర్థించి వార్షిక పన్ను కట్టవలసిన పరిస్థితి కూడా ఏర్పడింది.[18][19] తన పాలనా కాలంలో ముఆవియా బైజాంటైన్లపై ఎన్ని దాడులు చేసినా అంటాలియా (ప్రస్తుతం టర్కీలో భాగం) ప్రాంతంలో భూభాగాన్ని దేన్నీ ముస్లిం సామ్రాజ్యం చేజిక్కించుకోలేక పోయినా, తరచుగా దాడులు చేయడం ముఆవియా సిరియన్ సైన్యాలకు యుద్ధఫలితంగా దోపిడీ సొమ్ము, కప్పాలు దక్కడమే కాక వారి యుద్ధ నైపుణ్యాలు ఎంతగానో అభివృద్ధి చెందాయి. తన ప్రతిష్ఠ అంతర్గతంగానూ, బయటా పెరగడమూ, బైజాంటియన్లు తమ పూర్వపు సిరియన్ ప్రావిన్సు కోసం దాడులు తలపెట్టకపోవడం కూడా దీని వల్ల ముఆవియాకు లాభించాయి.[20][21]

ఇరాక్, తూర్పు ఖలీఫత్ ప్రావిన్సులలో అతను శక్తివంతమైన గవర్నర్లు అల్-ముఘీరా, జియాద్ ఇబ్న్ అబీ సుఫ్యాన్లకు అధికారాన్ని అప్పగించాడు.[22][23] జియాద్‌ను ఇతను సోదరునిగా దత్తత స్వీకరించడం వివాదాస్పదమైంది. జియాద్ తూర్పు ప్రాంతాలకు సామ్రాజ్యాన్ని విస్తరించేందుకు ఖురాసన్, సిజిస్తాన్ ప్రాంతాలకు అరబ్ దండయాత్రలను పునఃప్రారంభించాడు.[24][23] ఇరాకీ సైన్యాన్ని, పన్నుల వ్యవస్థను సంస్కరించాడు. 670లో ముఆవియా మార్గనిర్దేశంలో ఇఖ్బా ఇబ్న్ నఫి సైన్య నాయకత్వంలో ఇఫ్రిఖియా (మధ్య ఉత్తర ఆఫ్రికా)పై అరబ్బులు దండయాత్రలు చేసి జయించారు.[25] ముఆవియా తన స్వంత ఉమయ్యద్ వంశపు ప్రభావాన్ని మదీనా పరిపాలనకు పరిమితం చేసినప్పటికీ, అతను తన సొంత కుమారుడు మొదటి యాజిద్‌ను తన వారసుడిగా ప్రతిపాదించాడు.[21] ఇది ఇస్లామిక్ రాజకీయాల్లో అంతకు మునుపు ఎన్నడూ జరగని చర్య.[26] అలీ కుమారుడు హుస్సేన్, అబ్దుల్లాహ్ ఇబ్న్ అల్-జుబైర్‌లతో సహా ప్రముఖ ముస్లిం నాయకులు దీన్ని వ్యతిరేకించారు.[27] ఈ వ్యతిరేకత ముఆవియా మరణం తరువాత కూడా కొనసాగి, రెండవ ముస్లిం అంతర్యుద్ధానికి దారితీసి, దాని తర్వాత గాని ముగియలేదు.

ప్రస్తావనలు[మార్చు]

  1. 1.0 1.1 1.2 1.3 1.4 1.5 Hinds 1993, p. 264.
  2. Hoyland, In God's Path, 2015: p.98
  3. 3.0 3.1 Hawting 2000, pp. 21–22.
  4. Dixon 1978, p. 493.
  5. Jandora 1986, p. 111.
  6. Lynch 2016, p. 539.
  7. Madelung 1997, pp. 196–197.
  8. Madelung 1997, p. 238.
  9. Madelung 1997, p. 257.
  10. Wellhausen 1927, pp. 102–103.
  11. Wellhausen 1927, p. 104.
  12. 12.0 12.1 Hinds 1993, p. 265.
  13. Marsham 2013, p. 93.
  14. Wellhausen 1927, p. 131.
  15. Kennedy 2004, p. 87.
  16. 16.0 16.1 Wellhausen 1927, p. 134.
  17. Jankowiak 2013, pp. 304, 316.
  18. Stratos 1978, p. 46.
  19. Lilie 1976, pp. 81–82.
  20. Kaegi 1992, pp. 247–248.
  21. 21.0 21.1 Kennedy 2004, p. 88.
  22. Kennedy 2004, p. 84.
  23. 23.0 23.1 Kennedy 2004, p. 85.
  24. Hinds 1993, p. 266.
  25. Christides 2000, p. 789.
  26. Wellhausen 1927, p. 146.
  27. Wellhausen 1927, pp. 142, 144–145.

గ్రంథ పట్టిక[మార్చు]

  • Athamina, Khalil (July 1994). "The Appointment and Dismissal of Khalid ibn al-Walid from the Supreme Command: A Study of the Political Strategy of the Early Muslim Caliphs in Syria". Arabica. Brill. 41 (2): 253–272. doi:10.1163/157005894X00191. JSTOR 4057449.
  • Bosworth, C.E. (1991). "Marwān I b. al-Ḥakam". In Bosworth, C. E.; van Donzel, E. & Pellat, Ch. (eds.). The Encyclopaedia of Islam, New Edition, Volume VI: Mahk–Mid. Leiden: E. J. Brill. pp. 621–623. ISBN 978-90-04-08112-3.
  • Bosworth, C. Edmund (July 1996). "Arab Attacks on Rhodes in the Pre-Ottoman Period". Journal of the Royal Asiatic Society. 6 (2): 157–164. doi:10.1017/S1356186300007161. JSTOR 25183178.
  • Christides, Vassilios (2000). "ʿUkba b. Nāfiʿ". In Bearman, P. J.; Bianquis, Th.; Bosworth, C. E.; van Donzel, E. & Heinrichs, W. P. (eds.). The Encyclopaedia of Islam, New Edition, Volume X: T–U. Leiden: E. J. Brill. pp. 789–790. ISBN 978-90-04-11211-7.
  • Crone, Patricia (1994). "Were the Qays and Yemen of the Umayyad Period Political Parties?". Der Islam. Berlin: Walter de Gruyter & Co. 71 (1): 1–57. doi:10.1515/islm.1994.71.1.1. ISSN 0021-1818.
  • De Goeje, M. J. (1910). "Caliphate". The Encyclopaedia Britannica: A Dictionary of Arts, Sciences, Literature and General Information, Volume V: Calhoun to Chatelaine (11th ed.). New York. pp. 35–54. OCLC 62674231.CS1 maint: ref=harv (link)
  • Dixon, 'Abd al-Ameer (August 1969), The Umayyad Caliphate 65–86/684–705: A Political Study, London: University of London SOAS
  • Dixon, A. A. (1978). "Kalb b. Wabara—Islamic Period". In van Donzel, E.; Lewis, B.; Pellat, Ch. & Bosworth, C. E. (eds.). The Encyclopaedia of Islam, New Edition, Volume IV: Iran–Kha. Leiden: E. J. Brill. pp. 493–494. OCLC 758278456.
  • Donner, Fred M. (1981). The Early Islamic Conquests. Princeton: Princeton University Press. ISBN 0-691-05327-8.
  • Elad, Amikam (1999). Medieval Jerusalem and Islamic Worship: Holy Places, Ceremonies, Pilgrimage (2nd ed.). Leiden: Brill. ISBN 90-04-10010-5.
  • Grabar, Oleg (1966). "The Earliest Islamic Commemorative Structures, Notes and Documents". Ars Orientalis. 6: 7–46. JSTOR 4629220.
  • Foss, Clive (2010). "Muʿāwiya's State". In Haldon, John (ed.). Money, Power and Politics in Early Islamic Syria: A Review of Current Debates. Farnham, Surrey: Ashgate. ISBN 978-0-7546-6849-7.
  • Foss, Clive (2009). "Egypt under Muʿāwiya Part II: Middle Egypt, Fusṭāṭ and Alexandria". Bulletin of the School of Oriental and African Studies. 72 (2): 259–278. doi:10.1017/S0041977X09000512. JSTOR 40379004.
  • Gibb, H. A. R. (1960). "ʿAbd al-Raḥmān b. Khālid b. al-Walīd". In Gibb, H. A. R.; Kramers, J. H.; Lévi-Provençal, E.; Schacht, J.; Lewis, B. & Pellat, Ch. (eds.). The Encyclopaedia of Islam, New Edition, Volume I: A–B. Leiden: E. J. Brill. p. 85. OCLC 495469456.
  • Hasson, Isaac (1982). "Remarques sur l'inscription de l'époque de Mu'āwiya à Ḥammat Gader". Israel Exploration Journal (in French). 32 (2/3): 97–102. JSTOR 27925830.{{cite journal}}: CS1 maint: unrecognized language (link)
  • Hasson, I. (2002). "Ziyād b. Abīhi". In Bearman, P. J.; Bianquis, Th.; Bosworth, C. E.; van Donzel, E. & Heinrichs, W. P. (eds.). The Encyclopaedia of Islam, New Edition, Volume XI: W–Z. Leiden: E. J. Brill. pp. 519–522. ISBN 978-90-04-12756-2.
  • Hawting, G.R., ed. (1996). The History of al-Ṭabarī, Volume XVII: The First Civil War: From the Battle of Siffīn to the Death of ʿAlī, A.D. 656–661/A.H. 36–40. SUNY Series in Near Eastern Studies. Albany, New York: State University of New York Press. ISBN 978-0-7914-2393-6.
  • Hawting, Gerald R. (2000). The First Dynasty of Islam: The Umayyad Caliphate AD 661–750 (Second ed.). London and New York: Routledge. ISBN 0-415-24072-7.
  • Hawting, G. R. (2002). "Yazīd (I) b. Muʿāwiya". In Bearman, P. J.; Bianquis, Th.; Bosworth, C. E.; van Donzel, E. & Heinrichs, W. P. (eds.). The Encyclopaedia of Islam, New Edition, Volume XI: W–Z. Leiden: E. J. Brill. pp. 309–311. ISBN 978-90-04-12756-2.
  • Hinds, M. (1991). "Makhzūm". In Bosworth, C. E.; van Donzel, E. & Pellat, Ch. (eds.). The Encyclopaedia of Islam, New Edition, Volume VI: Mahk–Mid. Leiden: E. J. Brill. pp. 137–140. ISBN 978-90-04-08112-3.
  • Hinds, M. (1993). "Muʿāwiya I b. Abī Sufyān". In Bosworth, C. E.; van Donzel, E.; Heinrichs, W. P. & Pellat, Ch. (eds.). The Encyclopaedia of Islam, New Edition, Volume VII: Mif–Naz. Leiden: E. J. Brill. pp. 263–268. ISBN 978-90-04-09419-2.
  • Hirschfeld, Yizhar (1987). "The History and Town-Plan of Ancient Ḥammat Gādẹ̄r". Zeitschrift des Deutschen Palästina-Vereins. 103: 101–116. JSTOR 27931308.
  • Holland, Tom (2012). In the Shadow of the Sword. UK: Doubleday. ISBN 978-0-385-53135-1. Retrieved 29 August 2019.
  • Kennedy, Hugh (2001). The Armies of the Caliphs: Military and Society in the Early Islamic State. London and New York: Routledge. ISBN 0-415-25093-5.
  • Kennedy, Hugh (2007). The Great Arab Conquests: How the Spread of Islam Changed the World We Live In. Philadelphia, Pennsylvania: Da Capo Press. ISBN 978-0-306-81740-3.
  • Kennedy, Hugh (2004). The Prophet and the Age of the Caliphates: The Islamic Near East from the 6th to the 11th Century (Second ed.). Harlow: Longman. ISBN 978-0-582-40525-7.
  • Lammens, Henri (1960). "Baḥdal". In Gibb, H. A. R.; Kramers, J. H.; Lévi-Provençal, E.; Schacht, J.; Lewis, B. & Pellat, Ch. (eds.). The Encyclopaedia of Islam, New Edition, Volume I: A–B. Leiden: E. J. Brill. pp. 919–920. OCLC 495469456.
  • Lecker, M. (1997). "Ṣiffīn". In Bosworth, C. E.; van Donzel, E.; Heinrichs, W. P. & Lecomte, G. (eds.). The Encyclopaedia of Islam, New Edition, Volume IX: San–Sze. Leiden: E. J. Brill. pp. 552–556. ISBN 978-90-04-10422-8.
  • Morony, Michael G., ed. (1987). The History of al-Ṭabarī, Volume XVIII: Between Civil Wars: The Caliphate of Muʿāwiyah, 661–680 A.D./A.H. 40–60. SUNY Series in Near Eastern Studies. Albany, New York: State University of New York Press. ISBN 978-0-87395-933-9.
  • Shahid, I. (2000). "Tanūkh". In Bearman, P. J.; Bianquis, Th.; Bosworth, C. E.; van Donzel, E. & Heinrichs, W. P. (eds.). The Encyclopaedia of Islam, New Edition, Volume X: T–U. Leiden: E. J. Brill. pp. 190–192. ISBN 978-90-04-11211-7.
  • Shahid, I. (2000). "Ṭayyīʾ". In Bearman, P. J.; Bianquis, Th.; Bosworth, C. E.; van Donzel, E. & Heinrichs, W. P. (eds.). The Encyclopaedia of Islam, New Edition, Volume X: T–U. Leiden: E. J. Brill. pp. 402–403. ISBN 978-90-04-11211-7.
  • Sourdel, D. (1965). "Filasṭīn – I. Palestine under Islamic Rule". In Lewis, B.; Pellat, Ch. & Schacht, J. (eds.). The Encyclopaedia of Islam, New Edition, Volume II: C–G. Leiden: E. J. Brill. pp. 910–913. OCLC 495469475.
  • Watt, W. Montgomery (1960). "Abū Sufyān". In Gibb, H. A. R.; Kramers, J. H.; Lévi-Provençal, E.; Schacht, J.; Lewis, B. & Pellat, Ch. (eds.). The Encyclopaedia of Islam, New Edition, Volume I: A–B. Leiden: E. J. Brill. p. 151. OCLC 495469456.
  • Watt, W. Montgomery (1960). "Badr". In Gibb, H. A. R.; Kramers, J. H.; Lévi-Provençal, E.; Schacht, J.; Lewis, B. & Pellat, Ch. (eds.). The Encyclopaedia of Islam, New Edition, Volume I: A–B. Leiden: E. J. Brill. pp. 866–867. OCLC 495469456.
  • Wellhausen, Julius (1927). The Arab Kingdom and its Fall. Translated by Margaret Graham Weir. Calcutta: University of Calcutta. OCLC 752790641.

ఆధారాలు[మార్చు]

  • Bewley, Aisha Abdurrahman (2002). Mu'awiya: Restorer of the Muslim Faith. Dar Al Taqwa. ISBN 978-1-870582-56-8.
  • El-Cheikh, Nadia Maria, Nadia Maria (2004). Byzantium viewed (2004 ed.). Harvard CMES. ISBN 978-0-932885-30-2.
  • Ismā'īl ibn 'Umar Ibn Kathīr (2012). The Caliphate of Banu Umayyah The First Phase Taken from Al-Bidayah Wan-nihayah. ISBN 9786035000802.
  • Doi, A.R. (1981). Non-Muslims Under Shari'Ah. Kazi Publications. ISBN 978-1-56744-170-3.