మొలకల పున్నమి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మొలకల పున్నమి
కృతికర్త: వేంపల్లి గంగాధర్
దేశం: భారతదేశం
భాష: తెలుగు
ప్రక్రియ: కథాసంకలనం
ప్రచురణ: విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్
విడుదల: 2012

మొలకల పున్నమి పుస్తకాన్ని డాక్టర్ వేంపల్లి గంగాధర్ రచించారు. ఈ కథాసంకలనానికి కేంద్ర సాహిత్య అకాడెమీ యువ పురస్కారం లభించింది.

రచన నేపథ్యం[మార్చు]

మొలకల పున్నమి కథలను విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్ ద్వారా ఏప్రిల్, 2012లో మొదటి ముద్రణ పొందింది. విశాలాంధ్ర బుక్ హౌస్ విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాద్, అనంతపురం, కరీంనగర్, తిరుపతి, గుంటూరు, హనుమకొండ, కాకినాడ, ఒంగోలు, శ్రీకాకుళం బ్రాంచిల్లో లభిస్తుంది. నేలతల్లిని నమ్ముకున్న నాగలి యోధులకు... (రైతులకు) ఈ పుస్తకాన్ని రచయిత అంకితమిచ్చారు.[1]

రచయిత గురించి[మార్చు]

డా.వేంపల్లి గంగధర్ సమకాలీన తెలుగు సాహిత్యంలో కథకునిగా పేరుపొందిన రచయిత. కథలతో పాటుగా చారిత్రికాంశాలపై వ్యాసాలు కూడా రచించారు. మొలకల పున్నమి కథా సంపుటానికి గాను 2012లో కేంద్ర సాహిత్య అకాడెమీ యువ పురస్కారాన్ని పొందారు. రాష్టపతి భవన్ 'ఇన్ రెసిడెన్సి ప్రోగ్రాం' కు ఎంపికయిన మొదటి భారతీయ సాహిత్యవేత్త . రాష్ట పతి భవన్ లో 2014 సెప్టెంబర్ 8 వ తేది నుంచి 26 వరకు విశిష్ట అతిధిగా వీరు విడిది చేశారు.

కథల జాబితా[మార్చు]

మొలకల పున్నమి కథాసంకలనంలోని కథలు ఇవి:[2]

  1. యామయ్య సామి గుర్రం
  2. శిలబండి
  3. మూడు పదున్ల వాన
  4. మొలకల పున్నమి
  5. మాండవ్యం
  6. డేగల రాజ్యం
  7. ఏడులాంతర్ల సెంటరు
  8. దీపమాను
  9. పూలచేతులు
  10. దింపుడు కల్లం ఆశ
  11. మైనం బొమ్మలు
  12. శ్రీమాన్ దొరవారికి
  13. మంత్రసాని వైద్యం

ప్రాచుర్యం[మార్చు]

మొలకల పున్నమి కథలు 1998 నుంచి 2006 వరకు వివిధ వార పత్రికల్లో, మాస పత్రికల్లో ప్రచురితమైన ప్రాచుర్యం పొందాయి. సంపుటిగా ప్రచురితమైనప్పుడు విమర్శకుల ప్రశంసలు, ప్రతిష్ఠాత్మక పురస్కారాలు సాధించాయి.

మూలాలు[మార్చు]

  1. మొలకల పున్నమి:డా.వేంపల్లి గంగాధర్:విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్:2012 ముద్రణ
  2. మొలకల పున్నమి కథాసంపుటంలో విషయ సూచిక