మొలత్రాడు
This article needs more links to other articles to help integrate it into the encyclopedia. (అక్టోబరు 2016) |
హిందూ సాంప్రదాయం ప్రకారం అన్ని వయసుల మగవారు నడుము భాగంలో ఈ మొలతాడు (మొలత్రాడు) ను ధరిస్తారు. మొలతాడును దారంతో తయారు చేస్తారు. కొందరు వెండి తోను, బంగారంతోను, ప్లాటినమ్ తోను ఈ మొలతాడును తయారు చేయించుకుని ధరిస్తారు. మొలతాడు మార్చవలసినప్పుడు కొత్త దానిని ధరించిన తరువాత పాతదానిని తొలగిస్తారు.
మొలత్రాడు, పురుషుల నడుం చుట్టూ కట్టే ఒక దారం లేదా దారం రూపంలో ఉన్న అలంకార లోహం . ఇది హిందూ సాంప్రదాయంలో ఒక భాగం. యావత్ భారతదేశంలో ఈ సాంప్రదాయం ఉంది. చిన్నతనంలో బాలబాలికలిరువురికీ కట్టిననూ, పెద్దవారైన తర్వాత స్త్రీలు మొలత్రాడు వాడరు. పురుషులు మాత్రం తప్పక వాడవలసిందే. పురుషుడి భార్య కాలం చేస్తే గానీ మొలత్రాడు తీయకూడదు అన్న (మూఢ) నమ్మకం ఇప్పటికీ ఉంది.
మొలత్రాడులు ప్రాథమికంగా ఎరుపు/నలుపు లలో లభిస్తుంది. నలుపు మంచిది కాదని కొందరి అనుమానం. లుంగీ, పంచె, వదులుగా ఉన్న నిక్కర్లు, ప్యాంటులు, పైజామా, లంగోటి లని (బెల్టు ఉపయోగించకుండా) బిగుతు చేసుకోవటానికి వాటిని మొలత్రాడు క్రిందకు (అంటే నడుము కు, మొలత్రాడుకి మధ్య వస్త్రం వచ్చేలా) కట్టుకొనే సౌలభ్య్ం ఉంది.
స్నానాల వలన నీళ్ళని పీల్చటం వలన మొలత్రాడు మెత్తబడి, లేక ఉదరభాగం పెరిగి మరీ బిగుతుగా ఉండటం మూలాన కొంత కాలానికి అది తెగిపోతుంది. అప్పుడు మరల క్రొత్తది కొనాలి.
సంపన్నులు వెండి/బంగారు మొలత్రాడులని వాడటం కూడా ఉంది. చిన్ని కృష్ణుడిని వివరించే ఒక పద్యంలో బంగారు మొలత్రాడు అనే పదాలు వస్తాయి.