Jump to content

మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది

వికీపీడియా నుండి

మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది పాట నా ఆటోగ్రాఫ్ (2004) సినిమా కోసం చంద్రబోస్ రచించారు. ఈ గీతాన్ని కె.ఎస్.చిత్ర గానం చేయగా ఎం.ఎం.కీరవాణి సంగీతాన్ని సమకూర్చారు.

పల్లవి :

మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది ఎదిగిన కొద్దీ ఒదగమని అర్థమందులో ఉంది అపజయాలు కలిగిన చోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది ఆకులన్ని రాలిన చోటే కొత్త చిగురు కనిపిస్తుంది మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది ఎదిగిన కొద్దీ ఒదగమని అర్థమందులో ఉంది అపజయాలు కలిగిన చోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది ఆకులన్ని రాలిన చోటే కొత్త చిగురు కనిపిస్తుంది

చరణం1:

దూరమెంతో ఉందని దిగులు పడకు నేస్తమా దరికి చేర్చు దారులు కూడా ఉన్నాయిగా భారమెంతో ఉందని బాధపడకు నేస్తమా బాధ వెంట నవ్వుల పంట ఉంటుందిగా సాగర మథనం మొదలవగానే విషమే వచ్చింది విసుగే చెందక కృషి చేస్తేనే అమృత మిచ్చింది అవరోధాల దీవుల్లో ఆనంద నిధి ఉన్నది కష్టాల వారధి దాటిన వారికి సొంతమౌతుంది తెలుసుకుంటే సత్యమిది తలచుకుంటే సాధ్యమిది

మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది ఎదిగిన కొద్దీ ఒదగమని అర్థమందులో ఉంది

చరణం2:

చెమటనీరు చిందగా నుదుటి రాత మార్చుకో మార్చలేనిదేదీ లేదని గుర్తుంచుకో పిడికిలే బిగించగా చేతిగీత మార్చుకో మారిపోని కథలే లేవని గమనించుకో తోచినట్టుగా అందరి రాతలు బ్రహ్మే రాస్తాడు నచ్చినట్టుగా నీ తలరాతను నువ్వే రాయాలి నీ ధైర్యాన్ని దర్శించే దైవాలే తలదించగా నీ అడుగుల్లో గుడికట్టి స్వర్గాలే తరియించగా నీ సంకల్పానికి ఆ విధి సైతం చేతులెత్తాలి అంతులేని చరితలకి ఆది నువ్వు కావాలి

మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది ఎదిగిన కొద్దీ ఒదగమని అర్థమందులో ఉంది అపజయాలు కలిగిన చోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది ఆకులన్ని రాలిన చోటే కొత్త చిగురు కనిపిస్తుంది

బయటి లింకులు

[మార్చు]