యడ్లపల్లి మోహనరావు
యడ్లపల్లి మోహనరావు (జననం 1950 జూలై 10) ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణుడు, రచయిత. స్వార్థభారతి స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకుడు.[1] ప్రభుత్వోద్యోగిగా, పారిశ్రామికవేత్తగా 35 సంవత్సరాల పాటు పనిచేసిన మోహనరావు, తర్వాతి దశలో వ్యక్తిత్వ వికాస శిక్షకుడయ్యాడు. పలు విద్యాలయాలు, ఉద్యోగ శిక్షణా కార్యక్రమాల్లో వేలాది వ్యక్తిత్వ వికాస తరగతులు నిర్వహించాడు. పారిశ్రామికవేత్తగానూ, తర్వాతికాలంలో వ్యక్తిత్వ వికాసరంగంలో చేస్తున్న సేవలకు గాను రాష్ట్రపతి పురస్కారంతో సహా పలు పురస్కారాలు, గౌరవ డాక్టరేట్లు అందుకున్నాడు.
జననం - విద్యాభ్యాసం
[మార్చు]మోహనరావు 1950, జూలై 10న నాగయ్య, ఆదేమ్మ దంపతులకు గుంటూరు జిల్లా, చెమళ్ల మూడి గ్రామంలో జన్మించాడు. స్వగ్రామంలోనే ప్రాథమిక విద్యను చదివిన మోహనరావు పచ్చలతాడిపర్రు లోని ఎస్.కె.జెడ్.పి. హైస్కూలులో, గుంటూరులోని మాజేటి గురువయ్య హైస్కూలులో ఉన్నత విద్యను పూర్తిచేశాడు. ఆ తరువాత విజయవాడ లోని ఆంధ్ర లయోలా కళాశాలలో పియూసీ (1966-67), కాకినాడ లోని గవర్నమెంట్ ఇంజనీరింగ్ కాలేజి (1967-72) ఇంజనీరింగ్ విద్యను పూర్తిచేశాడు.
ఉద్యోగం
[మార్చు]1972-81 మధ్యకాలంలో హైదరాబాదు ఈసీఐఎల్ ఆర్ & డి ఇంజనీరింగ్ శాఖలో పనిచేశాడు. 1981లో రాజీనామా చేసి సొంతంగా సిర్వీన్ కంట్రోల్ సిస్టమ్ అనే ఎలక్ట్రానిక్ కంపనీని ప్రారంభించాడు.
వ్యక్తిత్వవికాస పాఠాలు
[మార్చు]పారిశ్రామిక రంగంలో ఉన్నతి సాధించిన మోహనరావు 1995లో సిద్ధసమాధి యోగ తరగతులకు హాజరయ్యాడు. ఆ యోగవిధానం అమితంగా ఆకర్షించడంతో 2007లో స్వార్థభారతి పేరిట స్వచ్ఛంద సంస్థను స్థాపించి, దాని ద్వారా వ్యక్తిత్వ వికాస తరగతులు నిర్వహిస్తున్నాడు. స్వార్థ భారతి ట్రస్ట్ ద్వారా ఉపాధ్యాయులకు, విద్యార్థులకు అత్యున్నతమైన వ్యక్తిత్వ వికాస జ్ఞానం అందించటం కోసం నాలుగు లక్షల కిలోమీటర్లకు పైగా పూర్తిగా సొంత ఖర్చులతో తిరిగి, ఇప్పటివరకు మూడు వేలకు పైగా సత్యశోధన - శక్తిసాధన శిక్షణా తరగతులను నిర్వహించాడు. అందించారు. దీనితో పాటుగా సంస్కృత విధ్యాపీఠం, తిరుమల తో పాటు అనేక వేదపాఠశాలలకు, గురుకుల పాఠశాలలకు, కాలేజీలకు వెళ్లి వ్యక్తివ్వ పాఠాలను బోధించాడు. అటవీ శాఖ అధికారులకు, పోలీసులకు, డాక్టర్ రెడ్డీస్ ఫౌండేషన్, రాజీవ్ యువ కిరణాలు, ఏపీ రెసిడెన్షియల్ స్కూళ్లలో ఇప్పటి వరకు 15 వందలకు పైగా సత్సంగాలు నిర్వహించాడు.[1]
రచనలు
[మార్చు]- సత్యశోధన - శక్తి సాధన (వ్యక్తిత్వ వికాసం)
అవార్టులు
[మార్చు]- 1989లో భారతదేశ రాష్టపతి చేతుల మీదుగా ఉత్తమ పారిశ్రామికవేత్తగా అవార్డు
- 1990-91 లో నకోసి ఆటోలెక్ అవార్డు (భారతదేశ చిన్న తరహ పరిశ్రమల నిర్వహాణలో ఉత్తమ ప్రతిభ కనబరిచినందుకు ఎగ్జిబిషన్ సోసైటి నాంపల్లి వారి నుండి)
- 1987లో బెస్ట్ ఎంటర్ప్రేన్యూర్ అవార్డు (అప్పటి రాష్ట్రగవర్నర్ కుముద్‌భీన్ జోషి గారి ద్వారా)
- 2017 ఇండిహుడ్ ఎడ్యూకేషనల్ ఎక్సెలెన్స్ అవార్డు
పురస్కారాలు
[మార్చు]- ఐ.వి యూనివర్శిటి బెంగళూరు వారిచే డాక్టరేట్ అండ్ లైఫ్‌టైమ్ అఛీవ్ మెంట్ అవార్డు (2016)
- సివి రామన్ ఆకాడమీ వారిచే ఆత్మజ్ఞాన ప్రధాత పురస్కారం (2016)
- తెలుగు బుక్ ఆఫ్ రికార్డు అండ్ లైఫ్ టైమ్ అఛీవ్‌మెంట్ అవార్డు (2017)
- సివి రామన్ ఆకాడమీ వారిచే గీతాచార్య టైటిల్ (2017)
- క్రీస్తు న్యూ టెస్ట్‌మెంట్ డీమ్డ్ యూనివర్శిటి చే గోల్డ్ మెడల్ ఇన్ భగవద్గీత
మూలాలు
[మార్చు]- ↑ 1.0 1.1 నమస్తే తెలంగాణ, జిందగీ న్యూస్ (11 March 2016). "సత్యశోధన ఆయుధంగా." అజహర్ షేక్, సాయిలు. Retrieved 14 February 2018.