యవనిక (తెర)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఆస్ట్రేలియాలోని రంగస్థల యవనిక (పైకి కిందికి కదిలేది)

యవనిక అనగా రంగస్థలం యొక్క ముందరి తెర.[1] రంగస్థలాన్ని, ప్రేక్షకాగారాన్ని వేరుపరచడానికి ఇది ఉపయోగపడుతుంది. దీనిని జవనిక (జనులు దీనిలో కలవడం), తిరస్కరణి (నటులను కనపడకుండా చేసేది), ప్రతీసీర (అడ్డంగా కట్టింది) అని కూడా పిలుస్తారు.[2]

ఓలియో యవనిక (పైకి కిందికి కదిలేది)

నేపథ్యం[మార్చు]

ప్రాచీన గ్రీకు నాటకరంగం మరియు ప్రాచీన రోమన్ నాటకరంగంలో యవనిక లేదు. క్రీ.పూ. పాంపె అనే వ్యక్తి మార్షియన్ రాతితో నాటకశాలను కట్టించి దానికి యవనికను పెట్టాడు. దానిని చట్రంలో బిగించి, నాటక ప్రారంభంలో ఆ చట్రం భూమిలోపలికి పోయి, నాటకం పూర్తయ్యాక పైకి వచ్చేలా ఏర్పాటుచేశాడు. 1660లో ఇంగ్లాండులో వాడుకలోకి వచ్చిన ఈ యవనిక, అటుతర్వాత ఇతర దేశాలకు వ్యాపించింది.[3]

రకాలు[మార్చు]

పక్కకు తప్పుకునే యవనిక

యవనిక మూడు రకాలుగా ఉంటుంది.

  1. పైకి కిందికి కదిలేది
  2. పక్కకు తప్పుకునేది
  3. అప్పటికప్పుడు కప్పేది

ఇవి కూడా చూడండి[మార్చు]

  1. గగనిక (సైక్లోరమ)

మూలాలు[మార్చు]

  1. నాటక విజ్ఞాన సర్వస్వం, తెలుగు విశ్వవిద్యాలయం కొమర్రాజు వెంకట లక్ష్మణరావు విజ్ఞాన సర్వస్వం కేంద్ర ప్రచురణ, హైదరాబాదు, 2008, పుట.471.
  2. నాటక విజ్ఞాన సర్వస్వం, తెలుగు విశ్వవిద్యాలయం కొమర్రాజు వెంకట లక్ష్మణరావు విజ్ఞాన సర్వస్వం కేంద్ర ప్రచురణ, హైదరాబాదు, 2008, పుట.333.
  3. నాటక విజ్ఞాన సర్వస్వం, తెలుగు విశ్వవిద్యాలయం కొమర్రాజు వెంకట లక్ష్మణరావు విజ్ఞాన సర్వస్వం కేంద్ర ప్రచురణ, హైదరాబాదు, 2008, పుట.334.