గగనిక (సైక్లోరమ)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

గగనిక (సైక్లోరమ) అనగా రంగస్థలంకు వెనక భాగాన నిర్మించిన తెల్లని వక్రరూప గోడ లేదా తెర. వెలుతురు (లైటింగ్) సహాయంతో గగనాన్ని (ఆకాశాన్ని) రూపొందిస్తారు కాబట్టి దీనికీ పేరు గగనిక అని పేరు వచ్చింది.[1] 19వ శతాబ్దంలో జర్మన్ నాటకరంగం ద్వారా ప్రాచుర్యంలోకి వచ్చిన ఈ గగనిక, ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అన్ని నాటకరంగాలలో ఉపయోగించబడుతుంది.

గగనిక (సైక్లోరమ) రంగస్థలం

గగనిక నిర్మాణం[మార్చు]

గగనిక అనేది వంపు తిరిగిన గోడతోగానీ, వంపు తెరతోగానీ ఏర్పాటుచేయవచ్చు. తెరను గగనికగా అమర్చినపుడు ముడతలు లేకుండా గట్టిగా బిగించివుంచాలి. ఇది కదల్చడానికి వీలులేని ఏర్పాటు కావున, మూలాలనుండి ప్రవేశ నిష్ర్కమణలకు అడ్డంకిగా ఉంటుంది. కొన్నిచోట్ల అటుఇటు జరుపుకునే గగనికలు అందుబాటులోకి వచ్చాయికానీ, అవి ఎక్కువగా ప్రాచూర్యం పొందలేదు.

గగనిక ఉపయోగం[మార్చు]

అధోదీపాలు (ఫుట్ లైట్స్) సహాయంతో ఈ గగనిక మీద బ్లూ రంగు లైట్స్ ను వేసి, నీలాకాశాన్ని సృష్టించడమేకాకుండా కదిలే, స్థిరంగా ఉండే మబ్బులను చూపించవచ్చు. ప్రతీక చిహ్నాలను, నీడలను ప్రసరింపచేయవచ్చు. రంగస్థలం మీద దృశ్యసామగ్రిని ఉపయోగించి చూపలేని ప్రదేశాలను, చూపడానికి వీలుకాని దృశ్యాలను గగనిక సహాయంతో, రంగోద్దీపనం ద్వారా సూచనాప్రాయంగా వివరంగా తెలియజేయడానికి గగనికను వాడుతారు.

ఇవి కూడా చూడండి[మార్చు]

  1. యవనిక (తెర)

మూలాలు[మార్చు]

  1. నాటక విజ్ఞాన సర్వస్వం, తెలుగు విశ్వవిద్యాలయం కొమర్రాజు వెంకట లక్ష్మణరావు విజ్ఞాన సర్వస్వం కేంద్ర ప్రచురణ, హైదరాబాదు, 2008, పుట.279.