యస్వీకృష్ణ
యస్వీకృష్ణ | |
---|---|
జననం | యస్వీకృష్ణ హైదరాబాదు |
వృత్తి | ఫ్రీలాన్స్ రచయిత, ప్రచురణకర్త |
ఉద్యోగం | జయంతి పబ్లికేషన్స్ హైదరాబాద్ |
ప్రసిద్ధి | కథా రచయిత, నవలా రచయిత, ప్రచురణకర్త, కార్టూనిస్టు |
మతం | హిందూ |
భార్య / భర్త | ఎస్.వి.కృష్ణజయంతి |
పిల్లలు | కృష్ణసంహిత,కృష్ణ అద్వైత |
యస్వీకృష్ణ[1] హైదరాబాదుకు చెందిన సుప్రసిద్ధ రచయిత, ప్రచురణకర్త.
విశేషాలు
యస్వీకృష్ణ బహుముఖ ప్రజ్ఞాశాలి. ఎమ్మెస్సీ చదివాడు. న్యాయశాస్త్రంలో పట్టా పొందాడు. ఫైన్‌ఆర్ట్స్‌లో డిగ్రీ సంపాదించాడు. మ్యూజిక్‌లో బి.ఏ.చేశాడు. ఇతడు కవి, కథారచయిత, నవలారచయిత, విమర్శకుడు, ప్రచురణకర్త. జయంతి పబ్లికేషన్స్ అనే ప్రచురణ సంస్థ ద్వారా 300 పైగా పుస్తకాలను ప్రచురించాడు. ఈయన భార్య ఎస్వీ.కృష్ణజయంతి కూడా పేరుపొందిన రచయిత్రి. ఇతడు ఇండియన్ సొసైటీ ఆఫ్ ఆథర్స్, వరల్డ్ తెలుగు ఫెడరేషన్, ఆల్ ఇండియా పొయెట్స్ కాన్ఫరెన్స్ మొదలైన సంస్థలలో జీవిత సభ్యుడిగా ఉన్నాడు. పలు జాతీయ అంతర్జాతీయ సదస్సులలో పాల్గొన్నాడు.
రచనలు
- కథాకమామీషు (విమర్శ)
- హలో మిసెస్ చక్రపాణి స్పీకింగ్ (కథాసంపుటి)
- మహాత్మాగాంధీ ఆటోబయోగ్రఫీ (నవల)
- ఉపాసన (దీర్ఘకవిత)
- కడలి కెరటం (కథ)
- దహనమ్ (నవల) (అముద్రితం)
యస్వీకృష్ణ కథలు వివిధ పత్రికలలో సుమారు 90కి పైగా ప్రచురింపబడ్డాయి. కొన్ని కథలు కన్నడ భాషలోనికి అనువదించబడ్డాయి. ఉపాసన దీర్ఘకవితను అదే పేరుతో గోవిందరాజు రామకృష్ణారావు ఆంగ్లంలోనికి అనువదించాడు.
మూలాలు
- ↑ కథ కమామీషూ - యస్వీకృష్ణ - జయంతి పబ్లికేషన్స్, హైదరాబాదు