యారాడ సముద్రతీరం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
యారాడ సముద్ర తీరం

యారాడ సముద్రతీరం విశాఖపట్నం సమీపంలోని యారాడ వద్ద ఉన్న ఒక పర్యాటక ప్రదేశం. నగరం నుంచి సుమారు 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ తీరం డాల్ఫిన్ నోస్ కొండలకు సమీపంలో ఉంది.[1] ఈ తీరానికి మూడు వైపులా కొండలు, నాలుగో వైపు బంగాళాఖాతం ఉన్నాయి. ఇక్కడ సౌకర్యాలు కల్పించడానికి ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ చర్యలు తీసుకుంటోంది. ఇక్కడ అరటి తోటలు, కొబ్బరి చెట్లు ఎక్కువగా ఉంటాయి. ఇక్కడ కొన్ని సినిమాలు కూడా చిత్రీకరణ జరుపుకున్నాయి. ఇది గంగవరం పోర్టు కు దగ్గరగా ఉండటంతో కొన్ని పారిశ్రామిక వ్యర్థాలు కలవడం వలన నీరు కొంత కలుషితమవుతోంది.

చేరుకోవడం[మార్చు]

ఈ బీచ్‌కు చేరుకోవాలంటే రోడ్డు మార్గంలో పోర్టు ఫ్లైఓవర్‌పైనుంచి సింధియా చేరుకొని వెళ్లాల్సివుంటుంది. ఇంకా బోట్‌పై ఫిషింగ్‌ హార్బర్‌ నుంచి హార్బర్‌ చానల్‌ను చేరుకొని, సాగరమాత దేవాలయం మీదుగా యారాడ చేరుకోవచ్చు. అయితే అన్ని సమయాల్లో వెళ్లే వీలుండదు. రోడ్డుమార్గం ఎక్కువ ఏటవాలుగా ఉండటం వల్ల యారాడకు కొద్ది బస్సులు మాత్రమే అందుబాటులో ఉంటాయి.[2]

శాస్త్ర పరిశోధన[మార్చు]

ఈ తీరంలో పేరుకున్న అవక్షేపాల గురించి 2009 నుంచి 2010 మధ్యలో కొన్ని పరిశోధనలు జరిగాయి.[3]

మూలాలు[మార్చు]

  1. Staff Reporter. "Yarada Beach to be revamped". timesofindia.indiatimes.com. TNN. Retrieved 20 October 2016.
  2. "యారాడ, రేవుపోలవరం బీచ్‌లు ఇకపై కళకళ". kostalife.com. కోస్తా లైఫ్. Retrieved 20 October 2016.
  3. E.M. Yadhunath; et al. (July 2014). "Sediment characteristics at intertidal regions across Yarada Beach, East coast of India" (pdf). Indian Journal of Marine Sciences. National Institute of Science Communication and Information Resources. 43 (7). Retrieved 30 June 2014.