యార్లగడ్డ నాయుడమ్మ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
యార్లగడ్డ నాయుడమ్మ
Nayudamma.jpg
ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం కాన్వొకేషన్ లో నాయుడమ్మ. ఆయనకు మార్చి 2008 న డాక్టర్ ఆఫ్ సైన్స్ ప్రదానం చేయబడినది.
జననం
యార్లగడ్డ నాయుడమ్మ

(1947-06-01)1947 జూన్ 1
వృత్తిపిల్లలవైద్య నిపుణులు
జీవిత భాగస్వాములుకృష్ణభరతి
పురస్కారాలుపద్మశ్రీ
వెబ్‌సైటుhttp://www.drynayudamma.org

యార్లగడ్డ నాయుడమ్మ ప్రఖ్యాతి గాంచిన శిశు వైద్యుడు.ప్రకాశం జిల్లా, కారంచేడు గ్రామములో జన్మించాడు. గుంటూరు వైద్యశాలలో పనిచేస్తున్నాడు. అతి కష్టమైన శస్త్ర చికిత్సలు చేయుటలో నిష్ణాతుడు. జన్మతోనే వివిధ రీతులలో అతుక్కుని పుట్టిన మూడు అవిభక్త కవలల విజయవంతముగా శస్త్ర చికిత్స చేసి వేరు చేశాడు[1][2][3]. 2016లో వైద్యరంగంలో ఆయన చేసిన సేవలకుగాను పద్మశ్రీ పురస్కారం లభించింది.

చదువు[మార్చు]

నాయుడమ్మ యార్లగడ్డ సుబ్బారావు, రంగమ్మ దంపతులకు 1947 జూన్ 1న జన్మించాడు. 1970లో గుంటూరు వైద్య కళాశాల నుండి వైద్యశాస్త్రములో పట్టా పొందాడు. 1974 లో రోహతక్ వైద్య కళాశాల నుండి శస్త్రచికిత్సా శాస్త్రములో యం.యస్ పట్టా పొందాడు. పిమ్మట ఢిల్లీ లోని అఖిల భారత వైద్యవిజ్ఞాన సంస్థ నుండి బాల్యశస్త్రచికిత్సలో యం.సి.హెచ్ పట్టభద్రుడయ్యాడు. గుంటూరు వైద్య కళాశాలలో ఉప ప్రిన్సిపాల్ గా పనిచేశాడు[4][5].

పురస్కారాలు[మార్చు]

 • డా. తుమ్మల రామబ్రహ్మం పురస్కారము-2002- గుంటూరు వైద్య కళాశాల పాత విద్యార్థుల సంఘం-అమెరికా
 • డా. వుళ్ళక్కి స్వర్ణ పురస్కారము-2003
 • డా. డి. జె. రెడ్డి పురస్కారము-2003
 • ప్రభావతి-వై.యస్. ప్రసాద్ స్మారక పురస్కారము- 2003
 • విశిష్ట పురస్కారము- రామినేని సంస్థానము, అమెరికా - 2004
 • చోడవరపు ధర్మ సంస్థ పురస్కారము - 2004
 • విశిష్ట వ్యక్తి పురస్కారము - 2005- సిద్ధార్ఠ కళాపీఠము, విజయవాడ.
 • విశ్వ తెలుగు సంఘటన పురస్కారము- 2005
 • రోటరీ వృత్తి నిష్ణాత పురస్కారము - 2006[6]
 • ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయము - గౌరవ డాక్టరేట్ పురస్కారము - 2008
 • పద్మశ్రీ పురస్కారం - భారత ప్రభుత్వం - 2016

ఉపన్యాసములు[మార్చు]

 • అతిథి ఉపన్యాసము - గుంటూరు వైద్య కళాశాల పాత విద్యార్థుల సంఘం, అమెరికా - స్వర్ణోత్సవ వేడుకలు - 1996
 • అతిథి ఉపన్యాసము - భారత బాల్యశస్త్ర చికిత్సా విజ్ఞాన సంఘం, హైదరాబాదు - 2003
 • రన్బాక్సీ ఉపన్యాసము - భారత వైద్య సంఘం - 78వ అఖిల భారత సమావేశము- 2003
 • షణ్ముఖేశ్వరరావు స్మారక ఉపన్యాసము- భారత శస్రవైద్యుల సంఘము - 27వ వార్షిక సమావేశము
 • డా. ఇ.యన్.బి. శర్మ స్మారక ఉపన్యాసము - ఆంధ్ర వైద్య కళాశాల - విశాఖపట్నం - 2004
 • డా. బి. ధర్మారావు స్మారక ఉపన్యాస పురస్కారము - 2005 - భారత వైద్య సంఘము - విజయవాడ.
 • డా. యస్.యస్. రావు స్మారక ఉపన్యాసము - 2005 - భారత వైద్య సంఘము - చీరాల.

మూలాలు[మార్చు]

 1. "Siamese surgery not costly". Archived from the original on 2006-03-17. Retrieved 2010-10-14.
 2. "Conjoined Twins - 1990-1994".[permanent dead link]
 3. "A worldwide fund raising campaign to save Indian conjoined twins". Archived from the original on 2007-09-29. Retrieved 2010-10-14.
 4. "Our experiences with surgeries on Conjoined twins (Siamese twins)" (PDF). Archived from the original (PDF) on 2007-09-27. Retrieved 2010-10-14.
 5. "Award to Dr. Nayudamma".
 6. "Rotary Club awards - 2006".