యాస కవితా సంకలనం
యాస కవితా సంకలనం | |
దస్త్రం: | |
యాస కవితా సంకలనం | |
కృతికర్త: | {{{author}}} |
---|---|
సంపాదకులు: | శీలం భద్రయ్య |
దేశం: | భారతదేశం |
భాష: | తెలుగు |
విభాగం (కళా ప్రక్రియ): | కవిత్వం |
ప్రచురణ: | వందనా పబ్లికేషన్స్, నల్లగొండ |
విడుదల: | సెప్టెంబరు 2020 |
పేజీలు: | 96 |
ఐ.ఎస్.బి.ఎన్(ISBN): | 978-93-5416-794-2 |
యాస కవితా సంకలనం 2020, సెప్టెంబరు నెలలో జాతీయ స్థాయిలో వచ్చిన తెలంగాణ కవిత్వ సంకలన పుస్తకం. తెలంగాణ భాషను, యాసను ప్రేమించిన ప్రజాకవి కాళోజి నారాయణరావు 106 వ జయంతిని పురస్కరించుకొని తీసుకువచ్చారు. తెలంగాణ ప్రాంతీయ భాషా చైతన్యాన్ని,సామాన్య జన భాష గొప్పదనాన్ని ఆవిష్కరించే బృహత్తర లక్ష్యంతో నల్లగొండ జిల్లా, నుండి శీలం భద్రయ్య ప్రధాన సంపాదకులుగా వందనా పబ్లికేషన్స్ ప్రచురించిన ఈ కవితా సంకలనంలో 84 మంది యాసకవులు రాసిన కవిత్వాలు ఉన్నాయి. ఇది జాతీయ కవితా సంకలనం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్నాటక, డిల్లీ రాష్ట్రాల నుండి తెలుగు కవులు పాల్గొని తమ భాషలోని యాస మాధుర్యాన్ని తెలియజేశారు.[1]
వివరాలు
[మార్చు]తెలంగాణ చారిత్రక కథారచయిత కవి శీలం భద్రయ్య సంపాదకత్వంలో వెలువడిన ఈ పుస్తకానికి చిట్టిప్రోలు శ్రీనివాస్ ముఖచిత్రం అందించగా, తెలంగాణ సాహిత్య అకాడమి తొలి అధ్యక్షులు నందిని సిధారెడ్డి 'కవుల సహజ శ్వాస యాస' అని తెలంగాణ భాష యాస ప్రత్యేకతల్ని వివరిస్తూ ముందుమాట రాశాడు. యాస కవితా సంకలనంలో తెలంగాణ సాంస్కృతిక చైతన్యాన్ని తెలియజెప్పే కవితలు, తెలుగు యాస, భాష గొప్పదనాన్ని వర్ణించే కవితలు, కాళోజి ప్రత్యేకతను చాటిచెప్పే కవితలు, తెలంగాణ సహజ స్వేచ్చా రమణీయతను పరిమళిస్తున్నాయి. మరో ముందుమాటలో 'తెలంగాణ భాషను ఊరేగించిన మనీషి కాళోజి' అని డాక్టర్ ఏనుగు నరసింహరెడ్డి చెప్పారు. ప్రముఖ తెలుగు దళిత కవి వేముల ఎల్లయ్య నవ తెలంగాణ దిన పత్రికకు రాసిన వ్యాసంలో 'తెలంగాణ ఆత్మగౌరవ పతాక, యాస కవిత్వం' అని అభిప్రాయపడ్డారు. అంతేకాకుండా యాస పేరుతో 84 మంది యాస కవులు ఈ కవితా సంకలనంలో రాయడం తెలంగాణ సాహిత్యచరిత్రలో ఇదే తొలిసారి అని చెప్పారు.[2][3]
కవులు-కవితలు
[మార్చు]తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత మొట్టమొదటిసారిగా తెలంగాణ ప్రాంతీయ భాషా చైతన్యాన్ని, తెలంగాణ జీవద్భాష యాస గొప్పదనాన్ని ఈ కవితా సంకలనం ఆవిష్కరించిందని విమర్శకులు అభిప్రాయపడ్డారు.
క్ర.సం. | కవి | కవిత శీర్షిక |
1. | డా.తండు కృష్ణ కౌండిన్య | యాస |
2. | చిట్ల ప్రేమ్ కుమార్ | ఇత్తనం గంప |
3. | వేముల ఎల్లయ్య | తెల్గం తెలంగ |
4. | వేణుసంకోజు | ఈనేలే మహాబలి |
5. | సాగర్ల సత్తయ్య | నెనరు |
6. | చిత్తలూరి సత్యనారాయణ | యాడుంది నా యాస |
7. | డా.మదిరె సిద్దన్న | యాస-గోస |
8. | పున్న దామోదర్ | చైతన్య జ్వాల |
9. | ఏబూషినర్సింహ్మా | కధనజీవి |
10. | మండల స్వామి | నిప్పుకణిక |
11. | సోన్నాయిల కృష్ణవేణి | ఒక ముచ్చట జెప్పుండ్రి |
12. | డా. పాoడాల మహేశ్వర్ | వేగుచుక్క |
13. | డా.గోగు వెంకటేశ్వర్లు | నవతెలంగాణ |
14. | యం.జానకిరామ్ | అవ్వ |
15. | మడిపెల్లి భద్రయ్య | ఇగ మీ అష్టం |
16. | శీలం భద్రయ్య | యాది |
17. | ఆచార్య యం.రామనాధం నాయుడు | తెలంగాణ ఉద్యమం-భాష |
18. | పెరుమాళ్ళ ఆనంద్ | బతుకంతా దేశానిదే |
19. | ఉప్పలపద్మ | సజీవస్వరం |
20. | వడ్డేపల్లి మల్లేశం | నీ జీవితమే ఒక కాలేజీ |
21. | మధుమోహన్ ఉదయగిరి | కాళోజి స్వరం గరం గరం |
22. | యేలిశాల నాగమోహన్ | ఇంపైన బాల్యపు యాస |
23. | మాదారపు వాణిశ్రీ | పల్లె సిత్రాలు |
24. | వకుళవాసు | ఎన్కటి రాకపోకలు |
25. | డా.లింగనబోయిన లేఖానంద స్వామి | తరగని భాష |
26. | డా.బోడ జగన్నాద్ | భాష తెలంగాణ |
27. | ఓర్సు రాజ మానస | తెలంగాణ సవ్వడులు |
28. | డా.వై.వి.సి.హెచ్.లైలా పద్మజ | ముద్దబంతి పువ్వు |
29. | గోగుల శ్రీనివాస్ | పల్లె బతుకు |
30. | కె.శైలజా శ్రీనివాస్ | ధన్యజీవి |
31. | కేతేపల్లి శ్రీను | నా బాస |
32. | కోమటిరెడ్డి బుచ్చిరెడ్డి | మేల్కొలిపిన రవి |
33. | చౌకి రాజేంద్ర | ప్రభారవి |
34. | డా.రామక కృష్ణమూర్తి | తెలంగాణ వాయి |
35. | పగిడిపాటి నరసింహ | ప్రజాకీయాలు |
36. | యం.భీక్య | నా తెలంగాణ |
37. | ఈర్ల సమ్మయ్య | ముద్దుబిడ్డ |
38. | అక్షర వెంకట్ | జీవనాడి |
39. | శేఖర్ నీలం | కారణజన్ముడు |
40. | ఆచార్య గిడ్డి వెంకట రమణ | సూరీడు |
41. | విటి.అర్.మోహన్ రావు | వైతాళికుడు |
42. | నాగిరెడ్డి అరుణ జ్యోతి | ఆరాధ్యుడు |
43. | తాటిపాముల రమేష్ | ఊట చెలిమె |
44. | గంజి కళావతి శ్రీనివాస్ | ప్రతిధ్వని |
45. | వేమూరి కమలాకర్ సుజాత | మహనీయుడు |
46. | చిలివేరు నాగమణి | ధీరవనిత |
47. | ఎనుపోతుల వెంకటేశ్ | అక్షర జ్యోతి |
48. | పచ్చిమట్ల రాజశేఖర్ | చైతన్య దీపిక |
49. | యం.యన్.విజయ్ కుమార్ | వందనం |
50. | గాజుల భారతీ శ్రీనివాస్ | ఉద్యమ ఊపిరి |
51. | నల్లి సాయిబాబు | ప్రజావాది |
52. | ముడుంబై ఆచార్య పద్మశ్రీ | జీవన వేదం |
53. | తుమ్మ జనార్ధన్ | కాళోజి శ్వాస |
54. | మ్యాడం అభిలాష్ | అన్వేషణ |
55. | డా.దీపక్ న్యాతి | గంధం |
56. | బల్లం వెంకటరమాదేవి | మస్తు సంగతుంది లే |
57. | చాపల భాస్కర్ | యోధుడు |
58. | పసుపునూరి భుజేందర్ | వెలుగు |
59. | సింగీతం సంతోష్ కుమార్ | ప్రజాకవి |
60. | తునికి వెంకటేశం | రారాజు |
61. | మిర్యాల ప్రకాశ్ | గురువుకు వందనం |
62. | సయ్యద్ జహీర్ అహ్మద్ | మానవతావాది |
63. | ప్రవీణ్ శర్మ | తొలిపొద్దు |
64. | డా.ఆలూరి విల్సన్ | స్పూర్తి |
65. | ఇమ్మడి రాంబాబు | కవితాంజలి |
66. | డా.పూసల లింగాగౌడ్ | హృదయవిజేత |
67. | లోకనాధం సత్యానందం | పూజ్యకవి |
68. | ఆరెకటికె నాగేశ్వరరావు | ఉద్యమకవి |
69. | బలిజేపల్లి కిషన్ | జీవధాతువు |
70. | పి. వేణుగోపాలరావు | దృశ్యం |
71. | మిద్దె మురళీకృష్ణ | అక్షరతూటా |
72. | డా.బండారి సుజాత | ఆరుట్ల కమలమ్మ |
73. | ఆయిత అనిత | బడి బెంగటిల్లింది |
74. | గిరియప్పగారి నాగలక్ష్మి | గౌరవం |
75. | చేవ్రాలు. ఎ. రాజ్యలక్ష్మి | గుండె చప్పుడు |
76. | అనుమాల వాణి | పంతులమ్మ |
77. | శిరమశెట్టి ఆనందరావు | అయ్యో బిడ్డా |
78. | సాకివార్ ప్రశాంత్ కుమార్ | అభ్యుదయ కవి |
79. | పి.హజరతయ్య | సమరశీలి |
80. | ఎస్.కె.రజియా | పరిమళం |
81. | బీరపోల్ల అనంతయ్య | మహనీయుడు |
82. | రాచమల్ల రేవతి | జ్వాల |
83. | తుమ్మరాజా | క్రాంతదర్శి |
84. | ఆకుల వెంకటరమణ | సుమాంజలి |
మూలాలు
[మార్చు]- ↑ ఈనాడు వార్తా పత్రిక (2020-09-13), యస ఆవిష్కరణ, retrieved 2022-10-16
- ↑ సాక్షి వార్తా పత్రిక, yasa kavitha sankalanam, retrieved 2022-10-16
- ↑ ఆంద్రజ్యోతి వార్తాపత్రిక (2020-09-13), తెలంగాణ యాస కవితా సంకలనం ఆవిష్కరణ, retrieved 2022-10-16