యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో హిందూమతం
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో హిందువులు గణనీయమైన మైనారిటీగా ఉన్నారు. 2020 నాటికి దేశంలో 6,60,000 పైచిలుకు హిందువులు నివసిస్తున్నారు [1] యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో ఉన్న భారతీయుల్లో ప్రధానంగా ఉన్నది హిందువులే.
నేపథ్యం
[మార్చు]UAE లో ముడి చమురు వెలికితీత, పెద్ద ఎత్తున పారిశ్రామికీకరణ, పట్టణీకరణ తర్వాత అనేక మంది కార్మికులు, ఉద్యోగులూ ఉపాధి కోసం UAEకి వచ్చారు. [2] చాలా మంది దక్షిణాసియా వాసులు పని కోసం అక్కడికి వలస వచ్చి, ఉపాధి పొందారు. 2000 తర్వాత, దుబాయ్ ప్రధానంగా దక్షిణ ఆసియన్లకు గ్లోబల్ హాట్‌స్పాట్‌గా మారింది. వారిలో చాలామంది హిందువులు. [3]
జనాభా వివరాలు
[మార్చు]UAE లోని హిందూ డయాస్పోరాలో ఎక్కువ మంది భారతీయులు. వీరిలో ముఖ్యంగా కేరళ, తమిళనాడు, మహారాష్ట్ర, పంజాబ్ నుండి వచ్చినవారు ఉన్నారు. [4] ఇతర హిందువులు నేపాల్, పాకిస్తాన్, బంగ్లాదేశ్, శ్రీలంక, భూటాన్ నుండి వచ్చారు . [5] [6] [7]
దేవాలయాలు
[మార్చు]రెండు అతిపెద్ద షేక్‌డమ్‌లలో ప్రస్తుతం ఒక హిందూ దేవాలయం ఉంది. దుబాయ్ హిందూ దేవాలయం (స్థానికంగా "శివ, కృష్ణ ఆలయం" అని పిలుస్తారు) అద్దెకు తీసుకున్న వాణిజ్య భవనంలోని పై అంతస్తులో రెండు విగ్రహాలతో ఉన్న ఒక చిన్న ప్రార్థనా మందిరం. [8]
2013 జూలైలో ఒక ముస్లిం వ్యాపారవేత్త, అబు ధాబి నగరం వెలుపల, దుబాయ్ వైపు వెళ్లే హైవేకి దూరంగా స్వామినారాయణ ఆలయాన్ని ఏర్పాటు చేయడానికి, అక్కడి మసీదుకు ఆనుకుని ఉన్న 27 ఎకరాల స్థలాన్ని విరాళంగా ఇచ్చాడు. [9] 2015 ఆగస్టులో, UAE ప్రభుత్వం దానిపై హిందూ దేవాలయాన్ని నిర్మించడానికి అనుమతి ఇచ్చింది. భారత ప్రధాని నరేంద్ర మోదీ, తన యూఏఈ పర్యటన సందర్భంగా ఈ ప్రకటన చేశాడు.అబుదాబిలో నిర్మించిన స్వామి నారాయణ్ మందిరాన్ని నిర్మించారు . [10] [11] [12] అబుదాబిలో ఈ మొదటి హిందూ దేవాలయం స్వామి నారాయణ్ మందిరం - (అబుదాబి ) నిర్మాణం 14 ఫిబ్రవరి 2024 లో ప్రారంభించారు.[13] 2019 ఏప్రిల్‌లో కొత్త ఆలయం శంకుస్థాపన జరిగింది. [14] [15]హిందూ సమాజం కోసం రెండు దహన సంస్కార శ్మశానాలు - ఒకటి అబుదాబిలో, ఒకటి దుబాయ్‌లో- ఉన్నాయి. [16]
ఇవి కూడా చూడండి
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ "United Arab Emirates". U.S. Department of State. Retrieved 2021-05-24.
{{cite web}}
: CS1 maint: url-status (link) - ↑ Marsh 2015e, p. 67.
- ↑ Marsh 2015e, p. 71.
- ↑ Said, Luxrai27; October 29, on; Pm, 2015 at 6:18 (2009-03-22). "The Hindu Diaspora In The Middle East". Kashmir Blogs (in ఇంగ్లీష్). Retrieved 2021-05-24.
{{cite web}}
: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: url-status (link) - ↑ "Centre's intervention sought to help Indians stranded in Nepal". The Hindu (in Indian English). Special Correspondent. 2021-04-28. ISSN 0971-751X. Retrieved 2021-07-12.
{{cite news}}
: CS1 maint: others (link) - ↑ "Did you know 250,000 Sri Lankans live in the UAE?". gulfnews.com (in ఇంగ్లీష్). Retrieved 2021-07-12.
- ↑ "Hindu temples in the UAE: A symbol of tolerance". Maktoob Yahoo. Retrieved 12 July 2021.
- ↑ "First Hindu temple in Abu Dhabi: 8 things you may want to know" (in Indian English). Condé Nast Traveller India. 2019-04-03. Retrieved 2021-05-24.
- ↑ "Arab donates land for Swaminarayan temple in UAE".
- ↑ "UAE takes a 'landmark' decision, allots land for building first temple in Abu Dhabi".
- ↑ "UAE allots land for temple on Modi visit".
- ↑ "UAE decides to allot land for temple in Abu Dhabi".
- ↑ Bhattacherjee, Kallol (2018-02-06). "PM to lay foundation stone of temple in UAE". The Hindu (in Indian English). ISSN 0971-751X. Retrieved 2021-05-24.
- ↑ "First Hindu Mandir In Abu Dhabi, UAE, To Be Built By BAPS Swaminarayan Sanstha". Indo American News. Retrieved 2021-05-24.
- ↑ Ahmad, Anwar f. "Video: First Hindu temple's foundation stone laying ceremony in Abu Dhabi". Gulf News (in ఇంగ్లీష్). Dubai. Retrieved 2021-05-24.
{{cite web}}
: CS1 maint: url-status (link) - ↑ Kumar, Ashwani. "Look: Abu Dhabi Hindu temple rising 'at great pace'". Khaleej Times (in ఇంగ్లీష్). Retrieved 2021-05-24.