యురేక

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
యురేక
దర్శకత్వంకార్తీక్‌ ఆనంద్‌
రచనకార్తీక్‌ ఆనంద్‌
నిర్మాతప్రశాంత్‌ తాత
లలిత కుమారి (సహనిర్మాత)
తారాగణంస‌య్యద్ సోహైల్
కార్తీక్‌ ఆనంద్
డింపుల్‌ హయతి
షాలిని
సమీక్ష
ఛాయాగ్రహణంఎన్.బి.విశ్వకాంత్
కూర్పుగ్యారీ బిహెచ్
సంగీతంనరేష్ కుమారన్
నిర్మాణ
సంస్థ
లక్ష్మి ప్రసాద్‌ ప్రొడక్షన్స్‌
దేశంభారతదేశం
భాషతెలుగు

యురేక 2020లో విడుదలైన తెలుగు సినిమా. లక్ష్మి ప్రసాద్‌ ప్రొడక్షన్స్‌ పతాకంపై ప్రశాంత్‌ తాతా నిర్మించిన ఈ సినిమాలో కార్తీక్‌, షాలినీ, మున్నా, డింపుల్ హయాతి ప్రధాన పాత్రల్లో నటించారు. కార్తీక్‌ ఆనంద్‌ దర్శకత్వం వహించాడు.[1]ఈ సినిమా 2020 మార్చి 13న విడుదలైంది.[2]

కథ[మార్చు]

ఓ ఇంజనీరింగ్ కాలేజీ. అందులో మెకానికల్ బ్రాంచ్ కు చెందిన సీనియర్ స్టూడెంటు యువ (కార్తీక్ ఆనంద్). అతడికీ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ బ్రాంచికి చెందిన సీనియర్ స్టూడెంటు రేవంత్ (మున్నా) కూ అస్సలు పడదు. అలాగే ఈ రెండు బ్రాంచ్ ల స్టూడెంట్స్ మధ్య కూడా గొడవలు చోటు చేసుకుంటూనే ఉంటాయి. ఈ రెండు బ్రాంచిల విద్యార్థులు ఎప్పుడూ గొడవ పడుతుండడంతో కాలేజీ యాజమాన్యం 'కాలేజీ ఫెస్ట్' ను జరపడానికి అడ్డంకులు వేస్తుంది. కానీ ఎటువంటి గొడవలు జరుగకుండా.. 'నేను జరిపిస్తాను' అని రేవంత్ ముందుకు వస్తాడు. అయితే ఫెస్ట్ జరగనివ్వను అంటూ యువ అతనితో ఛాలెంజ్ చేసి, అడుగడుగునా అడ్డుపడుతుంటాడు. కానీ ఇంతలో ఓ కంప్యూటర్ సైన్స్ బ్రాంచ్ అమ్మాయి శోభిత (డింపుల్ హయతి) తో ప్రేమలో పడతాడు యువ. ఆమె ప్రేమ వల్ల మనసు మార్చుకుని, కాలేజీ ఫెస్ట్ కు ఎటువంటి ఆటంకాలు కల్పించనని ఆమెకి మాట ఇచ్చి ఆ పనుల్లో తాను కూడా తోడ్పడతాడు. ఈ క్రమంలో ఆఫీస్ రూముకు వెళ్ళి 'ప్రైజ్ మెడల్స్' తీసుకురమ్మని లెక్చరర్ చెబితే ఆ పని మీద వెళ్తాడు. అలా వెళ్లిన యువకి అక్కడ ఓ శవం కనిపిస్తుంది. ఎవరికైనా చెప్తే ఆ హత్య తానే చేసానని నిందిస్తారేమోనని భయపడతాడు. ఇంతకీ ఆ శవం ఎవరిది. యువ దీని నుండి ఎలా బయట పడ్డాడు అనేది సినిమా కథ.[3]

నటీనటులు \ సినిమాలోని పాత్ర పేరు[మార్చు]

సాంకేతిక వర్గం[మార్చు]

  • నిర్మాత : ప్రశాంత్‌ తాత
  • బ్యానర్ : లక్ష్మీ ప్రసాద్ ప్రొడక్షన్స్
  • దర్శకత్వం: కార్తీక్‌ ఆనంద్‌
  • సహ నిర్మాత: లలిత కుమారి బొడ్డుచర్ల
  • సంగీతం: నరేష్‌ కుమరన్
  • కెమెరా: ఎన్‌.బి. విశ్వకాంత్
  • లైన్‌ ప్రొడ్యూసర్‌: బి.ఆర్‌.ఎస్‌.టి.సాయి
  • ఎడిటింగ్ : గ్యారీ బిహెచ్
  • ఆర్ట్ : అవినాష్ కొల్లా

మూలాలు[మార్చు]

  1. సాక్షి, సినిమా (13 May 2019). "ఇంజినీరింగ్‌ నేపథ్యంలో..." Archived from the original on 30 April 2021. Retrieved 30 April 2021. {{cite news}}: |archive-date= / |archive-url= timestamp mismatch; 28 మే 2019 suggested (help)
  2. Andhrajyothy (7 March 2020). "ఇంజనీరింగ్ కాలేజీ ఫెస్ట్ నేపథ్యంలో యురేక". Archived from the original on 30 ఏప్రిల్ 2021. Retrieved 30 April 2021.
  3. Times of India (30 April 2021). "Eureka Movie Review: A fresh college drama with minor flaws!". Archived from the original on 30 ఏప్రిల్ 2021. Retrieved 30 April 2021.
  4. Sakshi (12 March 2020). "చాలామంది గెటౌట్‌ అన్నారు". Archived from the original on 30 ఏప్రిల్ 2021. Retrieved 30 April 2021.
  5. AndhraBhoomi (11 March 2020). "నాలో కాన్ఫిడెన్స్ పెంచిన యురేక". Archived from the original on 12 జనవరి 2022. Retrieved 12 January 2022.
"https://te.wikipedia.org/w/index.php?title=యురేక&oldid=4053019" నుండి వెలికితీశారు