యువజన ఒలింపిక్ క్రీడా పోటీలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

యూత్ ఒలింపిక్ గేమ్స్ అనగా అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ ఏర్పాటు చేసిన అంతర్జాతీయ బహుళ క్రీడా కార్యక్రమం. ఈ క్రీడా కార్యక్రమాలు ప్రస్తుత ఒలింపిక్ గేమ్స్ ఫార్మాట్‌కు అనుగుణంగా వేసవి, శీతాకాల ఈవెంట్స్ లాగా ప్రతి నాలుగు సంవత్సరాలకు వేరువేరు నగరాలలో జరుగుతాయి. ఈ క్రీడలు 14 నుంచి 18 సంవత్సరాల మధ్య వయసున్న క్రీడాకారులకు జరుగుతాయి. మొదటి యూత్ ఒలింపిక్ గేమ్స్ యొక్క వేసవి గేమ్స్ సింగపూర్ దేశంలో 14-08-2010 నుంచి 26-08-2010 వరకు జరిగాయి, అయితే మొదటి శీతాకాల గేమ్స్ ఇన్న్స్బ్రక్, ఆస్ట్రియా లో 13-01-2012 నుండి 22-01-2012 వరకు జరిగాయి.

యువజన ఒలింపిక్ పోటీల్లో భారత ప్రతిభ[మార్చు]

  • రాగాల వెంకట రాహుల్ - 2014 ఆగస్టులో చైనాలోని నాన్‌జింగ్‌లో జరిగిన యువజన ఒలింపిక్స్‌లో వెయిట్ లిఫ్టింగ్ 77 కిలోల విభాగంలో రజత పతకం సాధించాడు
  • అతుల్ వర్మ -2014 ఆగస్టులో చైనాలో జరిగిన యువజన ఒలింపిక్స్‌లో వ్యక్తిగత రికర్వ్ ఆర్చరీ ఈవెంట్‌లో కాంస్య పతకం సాధించాడు.