రాగాల వెంకట రాహుల్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
రాగాల వెంకట రాహుల్
వ్యక్తిగత సమాచారం
జాతీయతభారతీయుడు
జననం (1997-03-16) 1997 మార్చి 16 (వయసు 26)
నివాసంగుంటూరు, ఆంధ్రప్రదేశ్
ఎత్తు1.75 m (5 ft 9 in) (2018)
బరువు84 kg (185 lb) (2018)
క్రీడ
దేశం భారతదేశం
క్రీడవెయిట్ లిఫ్టింగ్
పోటీ(లు)85 kg
Updated on 7 April 2018.

ఆంధ్ర ప్రదేశ్ కు చెందిన యువ వెయిట్ లిఫ్టర్ రాగాల వెంకట రాహుల్. ఇతను యూత్ ఒలింపిక్స్‌లో అద్భుత ప్రదర్శన చేశాడు. ప్రతిష్ఠాత్మక 2014 టోర్నీలో భారత్‌కు తొలి పతకాన్ని అందించాడు. ఈ పతకం యూత్ ఒలింపిక్స్ చరిత్రలో భారతదేశానికి తొలి వెయిట్ లిఫ్టింగ్ పతకం. 2014లో చైనాలోని నాన్‌జింగ్‌లో జరిగిన యూత్ ఒలింపిక్స్‌లో వెయిట్ లిఫ్టింగ్ 77 కిలోల విభాగంలో బరిలోకి దిగిన రాహుల్ తన అత్యుత్తమ వ్యక్తిగత ప్రదర్శనతో రజత పతకాన్ని సాధించాడు. స్నాచ్‌లో 141 కిలోలు, క్లీన్ అండ్ జర్క్‌లో 175 కిలోలు మోసిన ఇతను మొత్తంగా 316 కిలోల మోతతో రెండో స్థానంలో నిలిచాడు. (ఈ విభాగంలో ఆర్మేనియాకు చెందిన హకోబ్ క్రిచియన్ (319 కిలోలు) స్వర్ణ పతకాన్ని గెలుచుకోగా, కజకిస్థాన్‌కు చెందిన జస్లాన్ కలియెవ్ (310 కిలోలు) కాంస్య పతకాన్ని గెలుచుకున్నాడు).

2014 మార్చిలో జరిగిన ఆసియా యూత్ లిఫ్టింగ్‌లో రాహుల్ రెండు స్వర్ణ పతకాలు సాధించాడు. ఆసియా యూత్ లిఫ్టింగ్‌ టోర్నీలో స్నాచ్‌లో 133 కిలోలు, క్లీన్ అండ్ జర్క్‌లో 163 కిలోలు మోసిన ఇతను యూత్ ఒలింపిక్స్‌లో తన ప్రదర్శనను గణనీయంగా మెరుగుపరుచుకున్నాడు.

2018 కామన్ వెల్త్ పోటిలలో రాహుల్ భారతదేశం తరుపున 85 కేజీల వెయిట్ లిఫ్టింగ్ విభాగం నందు స్వర్ణ పతాకాన్ని సాదించారు. [1]

మూలాలు[మార్చు]

  1. "కామన్వెల్త్‌ గేమ్స్‌: భారత్‌కు మరో స్వర్ణం". సాక్షి. April 7, 2018.
  • సాక్షి దినపత్రిక - 22-08-2014 - (రజత రాహుల్ - వెయిట్ లిఫ్టింగ్‌లో మెరిసిన తెలుగు కుర్రాడు)
  • ఈనాడు దినపత్రిక - 22-08-2014 - (రజత రాహుల్ - యూత్ ఒలింపిక్స్‌లో భారత్ తొలి పతకం వెంకట్‌దే)

బయటి లంకెలు[మార్చు]