యెరెవాన్ లోని ట్రాలీ బస్సులు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
యెరెవాన్ లోని ట్రాలీ బస్సుల వ్యవస్థ
రకంప్రభుత్వ-ప్రైవేటు రంగం (కరెంటు బస్సులు)
స్థాపితం1949
ప్రధానకార్యాలయంయెరెవాన్, ఆర్మేనియా
సేవా ప్రాంతముయెరెవాన్
కీలక వ్యక్తులుయెర్గోట్రాంస్
పరిశ్రమబస్సు సేవలు
ఉత్పత్తులుబస్సు రవాణా, సేవలు

ఆర్మేనియా రాజధాని యెరెవాన్ లోని ప్రజా రవాణా నెట్వర్కులో ట్రాలీ బస్సులు ఎంతో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. 2005లో గ్యుంరీ  ట్రాలీ బస్సులను  మూసివేసిన తరువాత,  ఇవి ఆర్మేనియాలోని  ఏకైక ట్రాలీబస్సుల వ్యవస్థగా మిగిలిపోయాయి.

చరిత్ర[మార్చు]

యెరెవాన్ డౌన్టౌన్ వద్ద ఒక ట్రాలీ బస్సు

16 ఆగస్టు 1949లో ప్రారంభించిన సమయంలో, ఈ వ్యవస్థ మరింత విస్తృతంగా ఉండేది.

అత్యున్నత సమయంలో ఈ వ్యవస్థలో 300 బస్సులు 20 లైన్లలో తిరిగేవి. వాటిలో చెజ్ తయారు చేసిన స్కోడా 9టి.ఆర్,  సోవియంట్  తయారు చేసిన  జి.ఐ.యు-682  మోడళ్లు  ఎక్కువగా ఉండేవి.

ఇటీవలి సంవత్సరాలలో ఈ వ్యవస్థ క్షీణిస్తూ వచ్చింది,,  సోవియట్ శకంలోని అత్యధిక ట్రాలీ బస్సులను కొత్త వాటితో భర్తీ చేశారు.

లైన్లు[మార్చు]

2011వ సంవత్సరానికి ఈ వ్యవస్థలో 1,2,9,10, 15 నెంబరుగల లైన్లు ఉన్నాయి.

ఫ్లీట్[మార్చు]

యెరెవాన్ లో స్కోడా 14టి.ఆ బస్సు

యెరెవాన్ లో ఎక్కువగా స్కోడా 14టి.ఆ ట్రాలీ బస్సులు ఉన్నవి, పాత స్కోడా 9టి.ఆర్, జి.ఐ.యు-682లను తొలగించారు.

రష్యా తయారు చేసిన ఎల్.ఐ.ఏ.జి-5280 బస్సులు ఎక్కువగా యెరెవాన్ లో తిరుగుతున్నాయి, లియోన్ ట్రాలీబస్సు వ్యవస్థలో ఎక్కువగా  సెకండు హ్యాండు  బెర్లీట్ ఇ.ఆర్. 100 బస్సులను వాడుతున్నారు

ప్రమాదాలు[మార్చు]

16 సెప్టెంబరు 1976 న, యెరెవాన్ సరస్సు వద్ద తిరుగుతున్న ఒక ట్రాలీ బస్సు నియంత్రన తప్పి ఆనకట్ట గోడ లోనుంచి సరస్సులో పడిపోయింది. ఈ శబ్దాన్ని  అదే సరస్సులో  తన తమ్మునితో ఫిన్ స్విమ్మింగ్ చేస్తున్న మల్టీ-ఛాంపియన్ షవార్ష్ కారపెత్యాన్ అతని తమ్ముడు కామో విన్నారు.

ఈ బస్సు రిజర్వాయరు ఓడ్డుకు 25 మీటర్ల (80 అడుగులు) దూరంలో, 10 మీటర్లు (33 అడుగులు) లోతులోకి వెళ్ళిపోయింది. కారపెత్యాన్ సరస్సు దిగువ నుండి వెలువడుతున్న సెల్ట్ వలన దాదాపు సున్నా దృష్టి గోచరత ఉన్నా, 92 మంది ప్రయాణికులతో ఎంతో రద్దీగా ఉన్న బస్సు నుండి 30-35 సెకన్లకు ఒకరి చొప్పున 20 మందిని కాపాడారు.

కానీ ఈ ప్రమాదం తన క్రీడా జీవితానికి ముగింపు పలికింది. నదీ అడుగున ఉన్న చల్లని నీరు, బహుళ గాయాలతో అతను 45 రోజులు అపస్మారక స్థితిలోకి వెళ్ళడమేగాక సరస్సులోని మురుగునీటి వలన సెప్సిస్ వ్యాధి భారాన్ పడ్డారు. అతనుకు ఎన్నో ఊపిరితిత్తుల సమస్యలు రావడంతో తన క్రీడా జీవితాన్ని ఆపివేయవలని వచ్చింది.[1]

సూచనలు[మార్చు]

గమనికలు[మార్చు]

  1. "Shavarsh The Saviour" (in Russian). Trud (Russian newspaper). 2006-09-12.CS1 maint: unrecognized language (link)