యోగితా బిహానీ
యోగితా బిహానీ | |
---|---|
జననం | |
వృత్తి | నటి |
క్రియాశీల సంవత్సరాలు | 2017 – ప్రస్తుతం |
పురస్కారాలు | మిస్ ఇండియా రాజస్థాన్ (టాప్ 3) |
యోగితా బిహానీ భారతీయ నటి. ఆమె 2018లో ఏక్తా కపూర్ రొమాంటిక్ సోప్ ఒపెరా దిల్ హి తో హైలో పాలక్ శర్మగా టెలివిజన్‌లోకి ప్రవేశించింది.[1]
మే 2023లో విడుదలై విజయవంతమైన ది కేరళ స్టోరీ సినిమాలో ప్రధానపాత్ర పోషించింది.[2]
బాల్యం, విద్యాభ్యాసం
[మార్చు]యోగిత 1995 ఆగస్ట్ 7న న్యూ ఢిల్లీలో జన్మించింది. ఆమె సుమెర్మల్ జైన్ పబ్లిక్ స్కూల్ నుండి 2012లో తన ఉన్నత పాఠశాల విద్యను పూర్తి చేసింది. ఆ తరువాత ఆమె కంప్యూటర్ సైన్స్‌లో గ్రాడ్యుయేషన్ ఢిల్లీ విశ్వవిద్యాలయంలో పూర్తి చేసింది.
కెరీర్
[మార్చు]ఆమె ఫరీదాబాద్‌లోని రెడ్‌ఫుడీ స్టార్టప్ ఢిల్లీ ఎన్.సీ.ఆర్ లో చేరి 2016 వరకు వివిధ స్థానాల్లో పనిచేసింది.[3]
ఆ తరువాత ఆమె ముంబైకి చేరుకుని ప్రథమ్ ఎడ్యుకేషన్ ఫౌండేషన్‌లో సేల్స్ అండ్ మార్కెటింగ్ కోఆర్డినేటర్‌గా పనిచేసింది. ఆమె 2018 వరకు ట్రిలియోలో మేనేజర్ - సేల్స్ లండ్ ఆపరేషన్స్ గా వ్యవహరించింది.
ఇక గ్లామర్ ప్రపంచంలో ఆమె కెరీర్ 2018లో ఫెమినా మిస్ ఇండియా రాజస్థాన్ 2018లో టాప్ 3 కంటెస్టెంట్స్‌లో ఎంపికైనప్పుడు ప్రారంభమైంది. ఏప్రిల్ 2018లో సల్మాన్ ఖాన్‌తో కలిసి నటించిన సోనీ టీవీ గేమ్‌షో దస్ కా దమ్ ప్రోమోతో ఆమెకు అతిపెద్ద బ్రేక్ వచ్చింది.[4] దీంతో ఆమె ప్రముఖ సినిమా, టెలివిజన్ నిర్మాత ఏక్తా కపూర్ దృష్టిలో పడింది. ఆమె సోనీ టీవీలో ఏక్తా కపూర్ ఇండియన్ సోప్ ఒపెరా, దిల్ హాయ్ తోహ్ హైలో పాలక్ శర్మ పాత్రలో నటించింది.[5] అలాగే కొన్ని వాణిజ్య ప్రకటనలలో ఆమె నటించింది. అంతేకాకుండా ఏక్తా కపూర్ అతీంద్రియ ప్రదర్శన కవచ్ లో అతిధి పాత్రలో నటించి మెప్పించింది.[6] ఆమె నెట్‌ఫ్లిక్స్ చిత్రం Ak vs Ak లో కూడా సహాయక పాత్రలో నటించింది.
ఆమె విక్రమ్ వేద (2022 చిత్రం)లో చందా పాత్రలో ఆలరించింది.
మూలాలు
[మార్చు]- ↑ "Yogita Bihani selected to play the lead role in Ekta Kapoor's Dil Hi Toh Hai". Times of India. 15 May 2018. Retrieved 30 June 2018.
{{cite news}}
:|archive-date=
requires|archive-url=
(help) - ↑ "The Kerala Story Exclusive! Yogita Bihani Overwhelmed With Response To The Film: I Wanted To Do My Part..." Zoom TV (in ఇంగ్లీష్). Retrieved 2023-05-09.
- ↑ "Yogita Bihani on her early life and education". Free Press Journal. Retrieved 30 June 2018.
{{cite web}}
:|archive-date=
requires|archive-url=
(help) - ↑ "Yogita Bihani on shooting with Salman Khan". Times of India. 30 May 2018. Retrieved 30 June 2018.
- ↑ "Yogita Bihani will play the lead in 'Dil Hi To Hain' - Times of India ►". The Times of India (in ఇంగ్లీష్). 15 May 2018. Retrieved 2019-09-05.
- ↑ "Ekta Kapoor's next with Yogita Bihani as lead to go on air soon". Bollywood Life. 29 May 2018.