రంజన్‌గావ్
రంజన్‌గావ్ | |
---|---|
పట్టణం | |
Coordinates: 18°45′N 74°14′E / 18.750°N 74.233°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | మహారాష్ట్ర |
భాషలు | |
• అధికారిక | మరాఠి |
Time zone | UTC+5:30 (భారత ప్రామాణిక కాలమానం) |
పిన్ కోడ్ | 412220 |
Vehicle registration | ఎంహెచ్-12 |
సమీప నగరం | శిరూర్ |
రంజన్‌గావ్ అనేది మహారాష్ట్రలోని ఒక పట్టణం. పూణే నగరానికి 50 కి.మీ.ల దూరంలో ఈ గ్రామం ఉంది. ఇది ఒక పారిశ్రామిక ప్రాంతం. ఈ ప్రాంతంలో మహారాష్ట్ర ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్, మహాగణపతి దేవాలయం విగ్రహం ఉంది.
పారిశ్రామిక ప్రాంతం
[మార్చు]ఐదు నక్షత్రాల పారిశ్రామిక ప్రాంతంగా ఉన్న రంజన్‌గావ్ ఎల్.జి., వర్ల్‌పూల్, కారరో, ఫియట్, బాంబే డైయింగ్, మక్కాఫెర్రీ, బీకేర్ట్ మొదలైన అనేక ఉత్పాదక సంస్థల పరిశ్రమలు ఉన్నాయి.[1] [2]
దేవాలయం
[మార్చు]ఇక్కడి మహాగణపతి దేవాలయం మహారాష్ట్రలోని అష్టవినాయక పుణ్యక్షేత్రాలలో ఒకటిగా పరిగణించబడుతోంది. వినాయకుడికి సంబంధించిన ఎనిమిది పురాణాలను ఇక్కడ జరుపుకుంటారు.[3]
రంజన్‌గావ్‌లోని మహాగణపతి రాక్షసుడు త్రిపురాసురుని కోటలను నాశనం చేయడంలో శివునికి సహాయంగా వచ్చాడని ఇక్కడ భక్తులు నమ్ముతారు. ఈ దేవాలయం 9వ & 10వ శతాబ్దాల మధ్య నిర్మించబడిందని చరిత్ర ఆధారంగా తెలుస్తోంది. మాధవరావు పేష్వా గణేష్ విగ్రహాన్ని ఉంచడానికి దేవాలయంలోని నేలమాళిగలో ఒక గదిని తయారు చేశాడు. రంజన్‌గావ్ పూణే అహ్మద్‌నగర్ హైవేలో ఉంది కాబట్టి చాలామంది ప్రజలు మహాగణపతిని దర్శిస్తుంటారు.
మూలాలు
[మార్చు]- ↑ Ranjangaon - MIDC Archived 2010-09-02 at the Wayback Machine
- ↑ Ranjangaon - MIDC Archived 2013-12-31 at the Wayback Machine
- ↑ "Ranjangaon - Mahaganapati". Archived from the original on 2022-05-21. Retrieved 2022-11-07.