రఘునాథ నాయకుడు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

రఘునాథ నాయకుడు తంజావూరును ఏలిన తంజావూరు నాయక వంశపు మూడవ రాజు. తంజావూరు నాయక వంశపు రాజుల్లో అత్యంత ప్రసిద్ధుడు రఘునాథ నాయకుడు. ఇతడు 1600 నుండి 1634 వరకు పాలించాడు. కృష్ణదేవరాయల అనంతరం అంతటివాడేకాక, అంతకుమించినవాడని ఎన్నదగిన ఆంధ్రభోజుడు. ఈయన రాజేకాకుండా సంస్కృతం, తెలుగు ఉభయభాషలలోనూ కవిత్వం చెప్పగలవాడు. అంతేకాకుండా నూతన రాగాలను, తాళాలను కనిపెట్టి వీణల మేళవింపును సంస్కరించిన సంగీతశాస్త్ర నిపుణుడు. పారిజాతా హరణం అను గ్రంథమును చిరుత ప్రాయంలోనే సంస్కృతంలో రచించాడు. ఇప్పుడు లభిస్తున్న వీరి గ్రంథములు వాల్మీకి చరిత్ర, రామాయణము అను పద్య కావ్యములు, నల చరిత్ర అను ద్విపద కావ్యము, జానకీ కల్యాణం అను చాటు కావ్యం, రుక్మిణీ కల్యాణం అను యక్ష గానం లు. ఈయన పాలనలో తంజావూరు సాహిత్యానికి, కళలకు, కర్ణాటక సంగీతము నకు ప్రధాన కేంద్రమైనది.[1]

ప్రారంభ జీవితం[మార్చు]

రఘునాథ నాయకుడు, అచ్యుతప్ప నాయకుని పెద్ద కుమారుడు. తండ్రి ఘోర తపస్సు చేసిన తర్వాత కలిగిన సంతానము. The రఘునాథాభ్యుదయము, సాహిత్యనాట్యకారలో ఈయన బాల్య వివరాలు వివరంగా ఇవ్వబడినవి. బాలునిగా ఉన్నప్పుడే రఘునాథునికి శాస్త్రాలు, యుద్ధవిద్యలు, పాలనవ్యవహారాలలో మంచి శిక్షణ పొందాడు. రఘునాథ నాయకునికి అనేకమంది భార్యలు ఉండేవారు. ఈయన భార్యలలో ప్రముఖురాలైన కళావతి, "రఘునాథాభ్యుదయం"లో పట్టపురాణిగా వర్ణించబడింది. తంజావూరు నాయక వంశ చరిత్ర వ్రాసిన రామభద్రమ్మ రఘునాథుని భోగపత్ని[1]

తొలిరోజుల్లో రఘునాథ నాయకుడు గోల్కొండ రాజ్యంతో పోరాడి అందరి ప్రశంసలు అందుకొన్నాడు.[1] రఘునాథుడు1600లో రాజ్యపాలన బాధ్యతలను చేపట్టాడు. 1600 నుండి 1614 వరకు తండ్రితో సహపాలకునిగా పాలించాడు. 1614లో తండ్రి మరణం తర్వాత పట్టాభిషిక్తుడై, 1634లో మరణించేవరకు రాజ్యాన్ని పాలించాడు.

కళా పోషణ[మార్చు]

రఘునాథ నాయకుడు సంస్కృతము, ఆంధ్రము లలో తొమ్మిది రచనలు చేసినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం 4 మాత్రమే లభ్యం.. వీనిలో 3 ప్రబంధాలు. అవి

  • 1. వాల్మీకి చరిత్ర[2] : వాల్మీకి గాథ కావ్యంగా రచించబడింది.
  • 2. రఘునాథ రామాయణము: కొంతమాత్రమే లభిస్తోంది. శ్రీ రామచంద్రునికే అంకితమీయబడింది.
  • 3. శృంగార సావిత్రి: ఇది శృంగారప్రబంధం. దీని మరో పేరు ' సావిత్రీ కల్యాణం '. దీనిని 1928లో జి.ఎన్.శాస్త్రి అండ్ కో వారు గంటి సూర్యనారాయణ శాస్త్రి గారి సంపాదత్వంలో ముద్రించారు.[3]

ఈయన ఆస్థానంలోని కవులలో ప్రముఖులు :

  1. చేమకూర వేంకటకవి
  2. గోవింద దీక్షితులు
  3. యజ్ఞనారాయణ దీక్షితులు
  4. కృష్ణాధ్వరి
  5. రామభద్రాంబ
  6. మధురవాణి

బయటి లింకులు[మార్చు]

మూలాలు[మార్చు]