రతిబంధాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

సంభోగ సమయములో స్త్రీ పురుషుల శరీరములు (యోని పురుషాంగముతోసహా) పరస్పర సక్తములై ఉండే స్థితి భేదములనే ' సంభోగాసనములు, బంధములు, కరణములు ' మొదలగు పేర్లతో వ్యవహరిస్తూ ఉంటారు. భిన్నజాతి స్త్రీపురుషులు కలిసినపుడు బాధారహితంగా సుఖించుటకు, సమానజాతి స్త్రీపురుషుల రతియందు నవ్యతను కల్పించుట శాస్త్రములయం దీ కరణభేదములు (బంధభేదములు) చెప్పబడ్డాయి. రతివేళ స్త్రీయొక్క శరీరస్థితి ననుసరించి ఈ ఆసన భేదములు ప్రధానంగా ఐదు రకాలుగా ఉన్నాయి. 1. ఉత్తానకరణము 2. తిర్యక్కరణము 3. ఆసీనకరణము (స్థితకరణము) 4. ఉత్థితకరణము 5. వ్యానత కరణము అని వాని పేర్లు.

1. ఉత్తానకరణము:- ఉత్తానమనగా వెలికిల పడియున్నది. భార్య వెలికిలిగా పరుండియున్నపుడు (నడుముని సెజ్జపై ఆన్చి పరుండుట) పురుషుడామెను గూడినచో అది ' ఉత్తానకరనము అనబడుతుంది.

2. తిర్యక్కరణము:- తిర్యక్ అనగా ' ఏటవాలు ' అని అర్ధము. శయ్యపై భార్య ప్రక్కవాలుగా కుడిప్రక్కకునైనను లేక ఎడమప్రక్కకునైనను వ్రాలి పరుండియుండగా పురుషుడామెను కూడి రమించినచో అది ' తిర్యక్కరనము ' అనబడుతుంది.

3. ఆసీనకరణము:- భార్య కూర్చుండియున్నపుడు పురుషుడామెతో గలిసి రతిక్రీడాసక్తుడైనచో ఆస్థితి ఆసీనకరణము అనబడుతుంది.

4. ఉత్థితకరణము:- భార్య నిలచిఉండగా, పురుషుడామె నే గోడకో స్తంభమునకో ఆన్చి రమించుట ' ఉత్థితకరణము ' అనబడుతుంది.

5. వ్యానతకరణము:- ' వ్యానతము ' అనగా మిక్కిలి వంగినది. భార్య తన చేతులను పాదములను క్రింద ఆన్చి యుంచినదై నాలుగుకాళ్ళ జంతువువలె వంగియుండగా పురుషుడామెను వెనుకనుండి కూడి రమించుట ' వ్యానతకరణము ' అనబడుతుంది.

ఇట్లేర్పడిన ఈ కరణ భేదములందు తిరుగ అవాంతరభేదము లెన్నియో ఉన్నాయి. ఆ భేదములకే చౌశీతి బంధములు (84 బంధములు) అని లోకములో వాడుక వచ్చింది. కాని అవి అన్నియును శిష్టజన సమ్మతములు కానందున నాగరిక జనతలో ఆచరణలో ఉన్న బంధభేదములు మాత్రమే (35) ఇందు తెలుపబడుతున్నాయి.

చతురశీతి (84) రతిబంధములు

[మార్చు]
  1. ఉత్తానకరణ బంధము
  2. తిర్యక్కరణ బంధము
  3. స్థితకరణ బంధము
  4. ఉద్ధితకరణ బంధము
  5. వ్యాసకరణ బంధము
  6. గ్రామ్యబంధము
  7. నాగరకబంధము
  8. ఉత్ఫుల్లక బంధము
  9. విజృంభక బంధము
  10. ఇంద్రాణికబంధము
  11. ఇంద్రక బంధము
  12. పార్శ్యసంఘటిత బంధము
  13. ఉత్థానసంఘటిత బంధము
  14. పీడితబంధము
  15. వేష్టితబంధము
  16. వాడవాఖ్య బంధము
  17. ఉద్భగ్నబంధము
  18. ఉరస్ఫుటబంధము
  19. అంగార్ధనీపీడిత బంధము
  20. జృంభకబంధము
  21. ప్రసారిత బంధము
  22. వేణువిదారక బంధము
  23. శూలచితబంధము
  24. మార్కటకబంధము
  25. ప్రేంఖాయిత బంధము
  26. పద్మాసనబంధము
  27. అర్ధపద్మాసనబంధము
  28. బంధురిత బంధము
  29. నాగపాశబంధము
  30. సమ్యయన బంధము
  31. కూర్మ బంధము
  32. పరివర్తి బంధము
  33. నిపీడన బంధము
  34. సముపాద బంధము
  35. త్రివిక్రమ బంధము
  36. వ్యోమపద బంధము
  37. స్మరచక్ర బంధము
  38. అవిదారిత బంధము
  39. సౌమ్య బంధము
  40. అజింఖిత బంధము
  41. నౌకా బంధము
  42. ధనుర్భంద బంధము
  43. కరపాద బంధము
  44. సాచీముఖ బంధము
  45. అర్థసంద్ర బంధము
  46. ఉపాంగ బంధము
  47. సముద్గత బంధము
  48. పరివర్తన బంధము
  49. సమాంగక బంధము
  50. అభిత్రిక బంధము
  51. సంపుటిత బంధము
  52. వేణుధారణ బంధము
  53. కుక్కుట బంధము
  54. మానిత బంధము
  55. యుగపద బంధము
  56. విమర్ధిత బంధము
  57. ఘట్టిత బంధము
  58. సన్ముఖ బంధము
  59. ప్రస్ఛుట బంధము
  60. ఉద్గ్రీవ బంధము
  61. జఘన బంధము
  62. జానుపూర్వ బంధము
  63. హరివిక్రమబంధము
  64. కీర్తి బంధము
  65. ద్వితలబంధము
  66. పార్శ్వవేష్టిత బంధము
  67. ధృతి బంధము
  68. నిపీడిత బంధము
  69. నిఘాటక బంధము
  70. చటకవిలసిత బంధము
  71. వరాహఘాతక బంధము
  72. జుప్స బంధము
  73. వృషాభిఘాత బంధము
  74. ధేనుకబంధము
  75. గజబంధము
  76. మార్జాల బంధము
  77. పురుషాయితబంధము
  78. భ్రమర బంధము
  79. ఉద్గత బంధము
  80. సంఘోటక బంధము
  81. ఉపపద బంధము
  82. మందపీడిత బంధము
  83. మందవరాహ బంధము
  84. నాభిషితము

ఉత్తానకరణములో కొన్ని బంధాలు

[మార్చు]

ఉత్తానమనగా వెలికిల పడియున్నది. భార్య వెలికిలిగా పరుండియున్నపుడు (నడుముని సెజ్జపై ఆన్చి పరుండుట) పురుషుడామెను గూడినచో అది ' ఉత్తానకరనము అనబడుతుంది.

  • స్వస్తికబంధము:- భార్య శయ్యపై వెల్లకిలగా (నడుమును శయ్యపై ఆన్చినదై) శయనించినదై తన కుడితొడను తన ఎడమతొడమీద చేర్చియుండగా భర్త ఆమెను కూడి రమించుటకు స్వస్తికబంధమని పేరు. ఇట్లు ఎడమతొడపై తన కుడితొడను చేర్చియున్నవేళ స్త్రీయొక్క యోనియందు కొంత బిగువు ఏర్పడి, ఆ స్థితిలో చేయబడిన రతిక్రీడా ఆమెకు భర్తకు కూడా ఒక వింత ఆనందాన్ని కలిగిస్తుంది.
  • మాండూకబంధము:- భార్య శయ్యపై వెలకిలగా శయనించినదై తన్ను కలియవచ్చిన భర్తయొక్క తొడలమీద తనతొడలను చేర్చగా భర్త ఆమెనుగూడి రమించుట ' మాండూకబంధము ' అనబడుతుంది. ఈ బంధమున స్త్రీ శయనించియుండగా పురుషుడు కూర్చుండియుండును. ' మాండూకము ' అనగా కప్ప. కప్ప యొక్క రతిక్రీడవంటి దగుటచే దీనికీపేరు వచ్చింది.
  • అనుపాదబంధము:- చెక్కిలి (బుగ్గ) యొక్క మీది భాగమునకే హనువని పేరు. భార్య శయ్యపై వెలికిలగా శయనించి యుండి తనకాళ్లను పైకెత్తి - తన్ను కలియవచ్చి తన యోనియందు సంసక్తమైన పురుషాంగము కలవాండై, శయ్యపై తనకెదురుగా కూర్చుండియున్న భర్తయొక్క భుజముల మీదుగా - పైకెత్తిన తనకాళ్ళను పోనిచ్చి - తన పాదములతో అతని చెక్కెళ్ల మీది భాగములను తాకుచుండగా రమించి స్థితికి " హనుపాదబంధము" అనిపేరు. భర్తయొక్క చెక్కెళ్ళ మీదభాగమునందు భార్యయొక్క పాదముల స్పర్శ ఏర్పడుట వలన ఈ బంధమనబడెను.
  • పద్మాసనబంధము:- భార్య శయ్యపై వెలికిగా శయనించినదై తనకాళ్ళను మోకాళ్ళ దగ్గర మడచి, ఎడమకాలి పిక్కపై కుడికాలి పిక్కకు చేర్చి (బాసికపట్టువేసి కూర్చున్నట్లు) ఉండగా - భర్త ఆమె యొక్క ఈ ఆసనస్థితిని విడదీయకయే ఆమె కాళ్ళను పైకెత్తి ఆమెయొక్క రెండు మోకాళ్ళ యొక్క సందులలో నుండి తన చేతులను పోనిచ్చి - ఆమె కంఠమును గ్రహించినవాడై రమించుట ' పద్మాసనము ' అనబడుతుంది. బాసికపట్టువేసి పరుండియున్న భార్యయొక్క రెండు మోకాళ్ళ సందులలో నుండియు చేతులను పోనిచ్చి కంఠమును గ్రహించుట వలన భార్య యొక్క పాదపీఠము (తొడలతో సహా) సహజముగనే పైకిలేచి పురుషాంగము యోనియందు ప్రవేశించుటకు వీలుకలుగును. ఆ సమయమున భార్య తన మీదకు వ్రాలియున్న భర్తను మడువబడియున్న తనకాళ్ళ యొక్క మధ్యభాగముతో ఇంచుక వెనుకకు నెట్టుచుంఝ్డాగా - చేతులతో గ్రహించిన భార్య కంఠమాధారముగా భర్త ఆమె మీదకు తూగుచుండును.
  • అర్థపద్మాసనము :- వనిత శయ్యపై వెలికిలిగా శయనించి యుండి - తన యొక్క ఒక్కకాలిని మాత్రము మోకాలి దగ్గర మడచి పైకెత్తి యుంచగా - పురుషుడామెను గూడి క్రీడించు స్థితికి ' అర్థపద్మాసనము ' అని పేరు. ఇందు పురుషుని యొక్క ఒక్క చేయి మాత్రము - స్త్రీయొక్క మడచియుంచిన మోకాలి యొక్క సందునుండి ముందుభాగమునకు చొచ్చుకొని వచ్చును. తన మీదకు వ్రాలియున్న భర్తను భార్య తనయొక్క మడచివుంచిన ఒక కాలితోడనే వెనుకకు నెట్టుచుండుట ఇందేర్పడును. పద్మాసనస్థితి పూర్తిగా కాక సగముగా ఏర్పడుటచే దీనికి అర్థపద్మాసనము అని పేరువచ్చెను.
  • పిండితబంధము :- వనిత శయ్యపై వెలికిలిగా శయనించియున్నదై తనకాళ్ళను పైకెత్తి - తన్ను కలియవచ్చిన భర్తయొక్క వక్షముపై తన పాదములను రెంటిని ఆన్చియుండగా భర్త ఆమెను కూడి రమించుటకు పిండితబంధమని పేరు. అర్థపిండితబంధము :- ప్రియురాలు తన రెండు పాదములను గాక ఒక పాదమును మాత్రమే ప్రియుని వక్షమునందు ఆన్చియుండగా (అనగా ఒకకాలు పూర్తిగా చాచియుంచబడును) ప్రియుడామెను గలసి రమించుట ' అర్థపిండితమనబడును.
  • జృంభితబంధము :- శయ్యపై వెలికిలిగా శయనించి యున్న యువతి తన తొడలను పైకెత్తి, తన్ను కలియవచ్చి తనకు అభిముఖుడై కూర్చుండియున్న భర్తయొక్క భుజముల మీద చేర్చగా ఏర్పడు కూటమికి ' జృంభితబంధము ' అని పేరు. భార్య తన తొడలను పైకెత్తి, చేతుల సహాయమును గూడ అబలంబించి రెండు తొడలను బాగుగా విడదీసి - రెండు కాళ్ళను రెండు వైపులకు చాచి యుంచగా - ఆవులించిన నోటివలె విడియున్న భార్య యొక్క యోనియందు - భర్త తన పురుషాంగమును సంవిశితముగావించి రమించుట జృంభితబంధమనియు, జృంభ అనగా ఆవులింత, ఇందు యోని ఆవులించిన నోటివలె నుండుటచే దీనికీ పేరు తగియున్నదనియు రతిరహస్యకర్త చెప్పెను.
  • వేణువిదారణబంధము :- జృంభితబంధమునందు వలె భార్య తన రెండు తొడలను పైకెత్తి భర్తయొక్క భుజములపై నుంచుటకు మారుగా - తన ఒక కాలిని శయ్యపై పూర్తిగా చాచి ఉంచినదై - ఒక కాలిని మాత్రము పైకెత్తి తొడను భర్తయొక్క భుజమునందాన్చియుంచి కూడుటకు వేణువిదారణబంధమని పేరు. వేణువనగా వెదురు. విదారణమనగా చీల్చుట. వెదురును చీల్చువేళ ఒక పాయను నేలపై త్రొక్కిపట్టి, ఒక పాయను చేతబట్టి పైకెత్తి చీల్చుట లోకసాధారణము. సరిగా దానిని పోలిన ఆకృతి స్త్రీయొక్క కాళ్ళకు ఈబంధమునం దేర్పడును. అందుచే దీనికి ' వేణువిదారణ ' మను పేరు వచ్చెను.
  • ఇంద్రాణీబంధము :- వనిత శయ్యపై వెలకిలగా శయనించినదై తనకాళ్ళను మోకాళ్ళయొద్ద మడచి - ఆ మడత చెడకుండ తొడలయొద్ద కూడా మడచి - మోకాళ్ళు తనయొక్క స్తనపార్శ్వభాగములను తాకుచున్న స్థితియందుండగా - పురుషుడామె యొక్క మోకాళ్ళకు తన మోకాళ్ళు తాకుచున్న స్థితిలో ఆమెను పైకొని రమించుట ' ఇంద్రాణీబంధము ' అనబడును.
  • సూచీబంధము :- ఇంద్రాణీబంధము నందువలె వనిత తన రెండుకాళ్ళను కాక, ఒకకాలిని మాత్రమే - మోకాలు స్తనపార్శ్వదేశమును తాకునట్లు మడచి - వేరొక కాలిని సరళముగా చాచి యుంచగా - పురుషుడామె కంఠమును కౌగలించుకొని రమించుట ' సూచీబంధము ' అనబడును.
  • నాగరకబంధము :- పురుషుడు శయ్యపై వెలికిలగా శయనించియున్న భార్యయొక్క రెండు తొడలమధ్యకును చేరి, ఆమె తొడలను తన పాదములమీదుగా చేర్చి రమించుటకు నాగరకబంధమని పేరు. ఇందు స్త్రీయొక్క తొడలు పురుషుని కటిభాగమునకు (నడుమునకు) బహిర్భూతములగును. ఈ బంధమునందు స్త్రీ సుకుమారముగా చూడబడుటచే దీనికి నాగరకబంధమని పేరువచ్చెను.
  • గ్రామ్యబంధము :- నాగరకబంధమున వనితయొక్క తొడలు పురుషుని పాదములయందుండునేకాని, పురుషుని మోకాళ్లు వంచబడి ఆమె శరీరమునందానుట జరుగదు. అట్లుకాక పురుషుడు తనపాదములపై భార్యయొక్క తొడలను జేర్చి రమించుచు, తన మోకాళ్ళను ఆమె తొడలమీదుగా వాల్చి ఆమె కటిభాగమును (నడుమును) తన మోకాళ్ళతో పీడించుచు రమించుట గ్రామ్యబంధమనబడును. దీనియందు స్త్రీయెడ పురుషుని వర్తనము నాజూకైనది గాక కొంత మోటదనముతో కూడినదై యున్నందున దీనికి గ్రామ్యబంధమను పేరు వచ్చెను.
  • కార్కటబంధము :- వనిత శయ్యపై వెలికిలగా శయనించి తన పాదములను భర్తయొక్క నాభిదేశమునందు (బొడ్డు) ఉంచగా ఏర్పడు రమణమునకు కార్కటబంధమని పేరు. ఇందు భార్య యొక్క పాదములు భర్తయొక్క నాభీదేశమును తాకుచుండగా - భర్త ఆమెను కూడవలెను గనుక ఆమె తనకాళ్ళను మడచి ఇంచుక పైకెత్తవలసియుండునని గ్రహింపవలెను. కర్కటమనగా పీత. పీతల కలయిక ఇట్టిదగుటచే దీనికి కార్కటబంధమను పేరువచ్చెను.
  • ప్రేంఖణబంధము :- "ప్రేంఖణము" అనగా విసరుట. కార్కటబంధమునందువలెనే భార్యాభర్తలుకూడి రమించుచుండగా - భార్య భర్తయొక్క నాభిదేశమునందుంచిన తన పాదములతో నాతనిని పైకెత్తి విసరుచు కూడినచో ఆ స్థితి ' ప్రేంఖణబంధము ' అనబడును.
  • మార్కటకబంధము :- భార్య శయ్యపై వెలికిలగా శయనించియుండగా - పురుషుడును చాచబడిన కాళ్ళుకలవాడై ఆమె శరీరమును తన శరీరమౌతో నాక్రమించుకొని - తన ఎడమచేతి నామె నడుముక్రిందనుండి పోనిచ్చి - ఆమెను గాఢముగా కౌగలించుకొని - కుడిచేతితో ఆమెయొక్క స్తనమును గ్రహించి కూడగా - భార్య తన చాచబడిన కాళ్ళను భర్తయొక్క కాళ్ళక్రిందనుండి తొలగించి - అతని పిక్కలపై తనపాదములను జేర్చి మెలివేసినట్లు పట్టి యుంచినచో ఆ స్థితి మార్కటకబంధము ఓకే.
  • ఉద్భుగ్నబంధము :- ఉన్నతముగానుండి కొంచెము వంగియుండుటను ఉద్భుగ్నము అంటారు. శయ్యపై వెలికిలగా శయనించియున్న భార్యయొక్క తొడలను భర్త తన చేతులతో పైకెత్తి - క్రిందకు వంచియుంచి - చేతులతో నొక్కుచు రమించుట ఉద్భుగ్నబంధమని పేరు. ఇందు భార్యయొక్క తొడలు పైకెత్తబడి వంచబడును గనుక దీనికీపేరు వచ్చెను.
  • ఆయతబంధము :- భార్య శయ్యపై వెలికిలగా శయనించినదై - భర్తయొక్క శిరస్సుమీద తనకాలి నొకదానిని (కాలిపిక్క శిరమునకు తగునట్లు) చాచి, వేరొకదానిని శయ్యమీదనే చాచి యుంచగా ఏర్పడు కూటమికి ఆయతబంధ మనిపేరు. కొందరు ఈ బంధమును ' శూలచితబంధము ' అను పేరుతో పేర్కొన్నారు.
  • నాగపాశబంధము : యువతి శయ్యపై వెలికిలగా శయనించినదై తనకాళ్ళను మోకాళ్ళదగ్గర మడచి, తిరుగ వానిని తొడలయొద్ద మడచి - తన మోకాళ్లు తన స్తనముల యొక్క పార్శ్వభాగములను తాకుచున్న స్థితిలో తన రెండు చేతులను తన రెండు మోకాళ్ళ సందులలో నుండియు రానిచ్చి - ఆ చేతులను రెంటిని తన యొక్క కంఠము యొక్క దిగువభాగమున ఉగ్గిలిపట్టుగా బంధించి యుంచినపులు పురుషుడామెను కూడుట నాగపాశబంధ మనబడును.

తిర్యక్కరణములో కొన్ని బంధాలు

[మార్చు]

భర్య శయ్యపై ప్రక్కవాటుగా శయనించియుండగా పురుషుడామెను కూడి రమించుట తిర్యక్కరణమనని చెప్పబడింది. ఈ స్థితియందేర్పడే కొన్ని భేదములు:

  • సంపుటబంధము : భార్య శయ్యపై ప్రక్కవాటుగా శయనించియుండగా భర్త ఆమె కభిముఖముగా ఆమెవలెనే ప్రక్కవాటుగా శయనించినవాడై ఆమెనుకూడి రమించుటకు ' సంపుటక బంధము ' అని పేరు. ఇందు ఆలుమగల శరీరములు ప్రక్కవాటుగా నున్నను సరళముగా చాచబడి యుండును.
  • పీడితబంధము : ఆలుమగలు సంపుటబంధమునందు వలెనే ప్రక్కవాటుగా శయనించినవారై రమించుచుండగా - భార్య తన తొడలతో భర్తయొక్క తొడలను నొక్కి పీడించుట జరిగినచో - ఆ స్థితి ' పీడితబంధము ' అనబడుతుంది.
  • ముద్గకబంధము : భార్య శయ్యపై ప్రక్కవాటుగా శయనించి - తన తొడలను దగ్గరగాచేర్చి - యోని ద్వారమును బిగించియుంచగా - పురుషుడామె కభిముఖుడై ప్రక్కవాటుగా శయనించి రమించు స్థితికి ముద్గకబంధమని పేరు. సంపుటకబంధమున యోని ముఖము బిగింపబడి యుండదు. దీనియందు బిగింపబడి యుండును - అని గ్రహింపవలెను.
  • పరావృత్తకబంధము : యువతి శయ్యపై భర్తకు అభిముఖముగా కాక పెడమొగమై ప్రక్కవాటుగా శయనించి తన తొడలను దగ్గరగాజేర్చి యోనిముఖమును బిగించియుంచగా భర్త ఆమెను వెనుకనుండియే కూడి రమించుటకు పరావృత్తకమని పేరు.
  • వేష్టితకబంధము : భార్య శయ్యపై ప్రక్కవాటుగా శయనించియున్నదై - ఆ స్థితియందు తనకభిముఖుడై శయనించి తన్ను గూడిన భర్త యొక్క పిక్కలతో తన పిక్కలను మెలివేయుట జరిగినచో అది ' వేష్టితకబంధము ' అనబడుతుంది. ' వేష్టనము ' అనగా చుట్టుట. పిక్కలను పిక్కలతో చుట్టుట యిందేర్పడును గాన దీనికి వేష్టితబంధమను పేరేర్పడెను.
  • బాడబకబంధము : ఆలుమగలు ప్రక్కవాటుగా శయనించినవారై రమించుచుండగా - స్త్రీ తన యోనిముఖముచే పురుషాంగమును బిగియ నొక్కినచో ఆ స్థితి ' బాడబికము ' అనబడుతుంది. బడబ అనగా ఆడగుర్రము (ఆడగుర్రము రతివేళ ఇట్లా చరిస్తుంది) అందుచే దీనికీ పేరు వచ్చింది.
  • యుగ్మపాదము : ఆలుమగలు శయ్యపై ప్రక్కవాటుగా శయనించి రమించుచుండగా - వనిత తన యొక్క తొడనొక దానిని భర్తయొక్క కటిభాగమునకు క్రిందుగా పోవనిచ్చి - వేరొక దానిని ఆతని కటిభాగమునకు పైనుండి పోవనిచ్చి తన పాదములను రెండింటిని భర్తయొక్క వెన్నుపూస చివర కలిపియుంచినదై రమించుచో ఆ స్థితి ' యుగ్మపాదము ' అనబడుతుంది. యుగ్మము అనగా జంట. పాదముల జంట ఇందేర్పడుచున్నది. అందుచే దీనికీ పేరు వచ్చింది.

ఆసీకరణములోని బంధాలు

[మార్చు]

భార్య శయ్యపై కూర్చుండియుండగా భర్త ఆమెను కూడి రమించుట ఆసీనకరణము. ఈ కరణమునందు భార్య నెమలి మున్నగువాని వలె కూర్చుండగా పురుషుడామెను ముందునుండియే కాక వెనుకనుండి కలిసి రమించుట కూడా లోకమందున్నది. ఇక్కడ ఆశీనకరణభేదములందు ' లలితబంధము ' అను ఒక్క బంధము మాత్రమే తెలుపబడుచున్నది.

  • లలితము :- యువతి శయ్యపై కూర్చుండియున్నది. పురుషుడామె కెదురుగా తానును కూర్చుండియే ఆమెను కలియుటకు సంసిద్ధుడయ్యెను. అప్పుడా యువతి తన తొడలను విడదీసియుంచి భర్తకు తావిచ్చుటయేకాక భర్తయొక్క వెన్నుపూస తుదిభాగమున తన యొక్క అందెలతో మెరసే పాదములను జేర్చి, ఆతనిని తనకు మిక్కిలి సమీపముగా లాగుకొనెను. భర్తయు ఆమె కంఠమును గాఢముగా కౌగలించుకొని రతిక్రీడకు ఉపక్రమించెను. ఇదుగో ఇట్టి ఆసీనబంధము ' లలితము ' అనబడుతుంది. ఆశీనకరణము లన్నింటియందును ఇది ఉత్తమమైనది.

చిత్రమాలిక

[మార్చు]