Jump to content

రవి కల్పన

వికీపీడియా నుండి
రవి కల్పన
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
రవి వెంకటేశ్వర్లు కల్పన
పుట్టిన తేదీ (1996-05-05) 1996 మే 5 (వయసు 28)
కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్
బ్యాటింగుకుడిచేతి వాటం
బౌలింగుకుడిచేతి ఆఫ్ బ్రేక్
పాత్రవికెట్ కీపర్
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి వన్‌డే (క్యాప్ 115)2015 జూన్ 28 - న్యూజీలాండ్ తో
చివరి వన్‌డే2016 ఫిబ్రవరి 19 - శ్రీలంక తో
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
2010/11–2015/16ఆంధ్రప్రదేశ్
2019ట్రైల్‌బ్లేజర్స్
కెరీర్ గణాంకాలు
పోటీ వన్డే
మ్యాచ్‌లు 7
చేసిన పరుగులు 4
బ్యాటింగు సగటు 2.00
100లు/50లు 0/0
అత్యుత్తమ స్కోరు 3
క్యాచ్‌లు/స్టంపింగులు 4/1
మూలం: Cricinfo, 17 జనవరి 2020

రవి వెంకటేశ్వర్లు కల్పన ఆంధ్రప్రదేశ్కు చెందిన క్రికెట్ క్రీడాకారిణి.[1] భారత మహిళల జాతీయ క్రికెట్ జట్టులో వికెట్ కీపర్‌గా, కుడిచేతి వాటం బ్యాటర్‌గా తన జాతీయ స్థాయి కెరీర్‌ను ప్రారంభించింది.[2]

వ్యక్తిగత జీవితం

[మార్చు]

రవి కల్పన 1996, మే 5న ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణా జిల్లాలో జన్మించింది. తండ్రి ఆటో రిక్షా డ్రైవర్ కాగా, కల్పన తన చిన్న వయస్సులోనే పెళ్ళి చేయకుండా తన తల్లిదండ్రులను ఒప్పించడానికి చాలా కష్టపడింది: "నా కుటుంబాన్ని ఒప్పించి, దాదాపు ఆకస్మికంగా జరిగే నా వివాహాన్ని ఆపడం నా అత్యంత గుర్తుండిపోయే విజయం", అని ఆమె అంది.[3]

కల్పన ఇండియన్ రైల్వేస్‌లో పనిచేస్తూ విజయవాడలో నివసిస్తుంది.[4] విజయవాడలోని నలందా డిగ్రీ కళాశాలలో బి.కాం. డిగ్రీ పూర్తిచేసింది.[1]

క్రికెట్ రంగం

[మార్చు]

ఆంధ్రప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ నుండి 4000 రూపాయల భత్యంతో రాష్ట్ర జట్టుకు ఆడటం ద్వారా ఆమె తన కెరీర్‌ను ప్రారంభించింది.[4][5]

మొదట్లో అండర్ 16 జట్టుకు సౌత్ జోన్ విభాగంలో భాగమైంది. 2011లో అండర్ 19 జట్టుకు, 2012లో ఇండియా గ్రీన్ టీమ్‌కు, 2014లో సీనియర్ సౌత్ జోన్ జట్టుకు ఆడింది. ఆ తర్వాత 2015లో భారత మహిళల క్రికెట్ జట్టుకు ఎంపికైంది. ఆ తర్వాత 2015లో న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో అంతర్జాతీయ క్రికెట్ లోకి అరంగేట్రం చేసింది.[4][5]

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 "Ravi Kalpana". ESPN Cricinfo. Retrieved 2023-08-09.
  2. "Uncapped Kalpana in India squad for NZ ODIs". ESPN cricinfo. 25 June 2015. Retrieved 2023-08-09.
  3. "Indian cricketer Ravi Kalpana reveals how she fought against an early marriage". CricTracker. 2017-12-31. Retrieved 2023-08-09.
  4. 4.0 4.1 4.2 "Indian cricketer Ravi Kalpana reveals how she fought against an early marriage - CricTracker". CricTracker. 2017-12-31. Retrieved 2023-08-09.
  5. 5.0 5.1 "Jhulan Goswami and Sneh Rana shine as India beat New Zealand". www.deccanchronicle.com/ (in ఇంగ్లీష్). 2015-06-29. Retrieved 2023-08-09.

బయటి లింకులు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=రవి_కల్పన&oldid=4215072" నుండి వెలికితీశారు