Jump to content

రవి పరస

వికీపీడియా నుండి
రవి పరస
రవి పరస
జననంరవి పరస
ఆగస్టు 1, 1968
చిడిపి గ్రామం పశ్చిమ గోదావరి
ప్రసిద్ధినఖచిత్రకారుడు, చేతిరాత నిపుణుడు
పిల్లలుఇద్దరు కుమారులు
తండ్రిసత్యనారాయణ రావు,
తల్లిశకుంతల,

రవి పరస ప్రముఖ నఖచిత్ర కళాకారుడు. ఈయన గోటితో చిత్రాలు గీయడంలో దిట్ట. ఎన్నో వేల చిత్రాలు అవలీలగా ఈయన గోటితో గీసారు. ఇంకా గీస్తున్నారు. ఒక్క వినాయకుడి మీదే 999చిత్రాలు గీసి చరిత్ర సృష్టించారు. అంతేకాదు,1,503 గణపతులను గోటితో గీసిన నఖ చిత్రకారునిగా రికార్డు కెక్కారు. చేతిరాత నిపుణుడిగా, వ్యక్తిత్వ వికాశ నిపుణుడిగా,పలు విషయాలపై అవగాహన కల్పించే కౌన్సిలర్ గా రాణిస్తున్నారు. ఎన్నో అవార్డులు,రివార్డులు, బిరుదులు,సత్కారాలు అందుకున్నారు. [1]

జీవిత విశేషాలు

[మార్చు]

ఆయన 1968 ఆగస్టు 1 న పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు మండలం చిడిపి గ్రామంలో పరస సత్యనారాయణ రావు, శకుంతల దంపతులకు జన్మించారు. నలుగురు అన్నదమ్ములు,ఒక సోదరి గల ఈయన ఆఖరి వాడు. టీచర్ గా ఉద్యోగం చేస్తూ రాజీనామా చేసిన ఈయన నఖ చిత్ర కారునిగా,చేతిరాత నిపుణుడుగా, వ్యక్తిత్వ వికాశ నిపుణుడుగా రాణిస్తూ రాజమండ్రి జవహర్ లాల్ నెహ్రు రోడ్ శ్రీ షిరిడి సాయి మార్గ్ లో నివాసం వుంటున్నారు. ఈయనకు భార్య రామ తులసి టీచర్ గా పనిచేస్తున్నారు. కుమరులు పవన్,ఫ్రవీణ్ ఉన్నారు.

చిత్ర కారునిగా ఎంట్రీ

[మార్చు]

స్వతహాగా చేతిరాత నిపుణుడైన డాక్టర్ రవి పరస నఖ చిత్రకళలో నిష్ణాతులైన శిష్ట్లా రామకృష్ణారావు దగ్గర ఒక్కరోజు శిష్యరికం చేసి, నఖ చిత్రకళలో మెళుకువలు నేర్చుకున్నారు. ఓ తెల్లని కార్డు ముక్కపై తన చేతి గోళ్లతో ఆద్భుత చిత్రాలను గీస్తారు. ఎదుటివారిని మురిపిస్తారు. కెరీర్ ఆనలటిక్స్ ఆంతర్జాతీయ సంస్థలో మార్కెటింగ్ నిపుణులుగా పనిచేస్తున్న రవి వరస ప్రవృత్తి మాత్రం చేతిగోర్లతో తెల్లని చార్డు ముక్కలపై ఆందమైన చిత్రాలను చెక్క డమే ప్రయాణ సమయంలో ఆయనకు పెద్ద కాలక్షేపం నఖచిత్రాలను రూపొందించడమే. పక్షులు, జంతువులు, ప్రకృతి దృశ్యాలు, మనుషుల పేర్లు.. ఇలా పలు రకాలుగా వివిధ కోణాలలో ఆయన తన నఖాలతో చిత్రాలను ఆవలీలగా గీసేస్తారు. తనకంటూ ఓ ప్రత్యేకతను చాటుకోవాలన్న తపనతోనే ఈ కళను సాధన చేసినట్టు ఆయన చెబుతుంటారు. ఆయనకు చిన్నప్పటి నుంచి చిత్రకళ అంటే చాలా ఇష్టం. చిత్రకళా పోటీలలో పలు బహుమతులు కూడా సాధించారు. చిత్రాలు గీసి తమ సృజనను చాటుకోవడం ప్రతి కళాకారునికీ సర్వసాధారణం. అయితే ఆయనకంటూ ఒక ప్రత్యేకతను సాధించాలనే తపన పడేవారు. ఓసారి ఆనుకోకుండా పెరిగిన చేతిగోళ్లతో ఆవలీలగా ఓ చార్డుపై చిన్న బొమ్మ గిసారు. అది చూసి అందరూ అభినందించారు. తన చిత్రకళలో ప్రత్యేకతను చాటుకొవడానికి ఇది మంచి మార్గమనుకున్నారాయన. అప్పటి నుండి చేతి గోళ్ళతో చిత్రాలను గీయడం ప్రారంభించారు. ప్రపంచంలోనే నఖ చిత్రకళలో మూడవ స్థానానికి చేరారు. గణేశ్ బొమ్మలను చిత్రించడంలో ఈయన ఓ రికార్డు నెలకొల్పారు. 22రోజులలో 333 ఓంకార్ గణపతులను చిత్రించారు. మొత్తం 94రోజులలో 254గంటలలో 999గణపతులను తీర్చిదిద్దారు.

గణేష్ చిత్రాలు

[మార్చు]

పలు రకాలుగా గణేశ రూపాలను డాక్టర్ రవి పరస గోటితో చిత్రించారు. పేరును బట్టి ఈయన గణపతిని అందులో ఇముడుస్తూ చిత్రాలు గీయడంలో దిట్ట. మొత్తం 2,850 చిత్రాలు గొటితో గీసారు.

  • 1. వివిధ రూపాల్లో గణేష్ చిత్రాలు 766
  • 2 ఓంకార్ గణేశ చిత్రాలు 602
  • 3 అక్షర గణేశ చిత్రాలు ( హిందీ అక్షర మాల ) 45
  • 4 అక్షర గణేశ చిత్రాలు (తెలుగు అక్షర మాల) 56
  • 5 అక్షర గణేశ చిత్రాలు (కన్నడ అక్షర మాల) 48
  • 6 అక్షర గణేశ చిత్రాలు (మళయాళం అక్షర మాల) 56
  • 7 అక్షర గణేశ చిత్రాలు (ఒరియా అక్షర మాల) 15
  • 8 అక్షర గణేశ చిత్రాలు ( ఇంగ్లీష్ అక్షర మాల) 26
  • 9 అక్షర గణేశ చిత్రాలు (మరాఠీ అక్షర మాల) 42
  • 10 అక్షర గణేశ చిత్రాలు (బెంగాలీ అక్షర మాల) 45
  • ఎక్కువగా నఖ చిత్ర ప్రదర్శనలు (మూడురోజులకన్నా ఎక్కువ) నిర్వహించినవి:9
  • లైవ్ షో మాదిరిగా ఒకరోజు నిర్వహించిన ప్రదర్శనలు : 20
  • ఇక లైవ్ షో లతో కలిపి దాదాపు 63,900 నఖ చిత్రాలు రవి పరస గీశారు.

తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్

[మార్చు]

డా. రవి పరస విభిన్న రీతులలో గణపతులను గోటితో చిత్రీకరించిన నేపథ్యంలో తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ లో 2015మే 5న నమోదయ్యారు. సమన్వయ సరస్వతి,ప్రవచన విరించి సామవేదం షణ్ముఖ శర్మ నుంచి అభినందనలు అందుకున్నారు. నఖచిత్ర కళారత్న" బిరుదు, బంగారు పతకం, తెలుగు రాష్ట్రాల ప్రతిభా పురస్కారాలు " శ్రీ శ్రీ కళావేదిక" నుంచి సత్కారం, "నఖ చిత్ర కళానిధి", " నఖచిత్ర కళాతపస్వి" ఇలా ఎన్నో పురస్కారాలు అందుకున్నారు. ఈనాడు నిర్వహించిన హాయ్ బుజ్జీ చేతిరాత శిక్షణలో ఎందరో చిన్నారులకు శిక్షణ ఇచ్చారు. బ్రాహ్మణ కార్పోరేషన్ చైర్మన్ ఐ.వై.ఆర్ కృష్ణారావు, పలువురు ప్రజా ప్రతినిధులు,ప్రముఖుల నుంచి సత్కారాలు అందుకున్నారు.

అవార్డ్స్

[మార్చు]

డాక్టర్ రవి పరస పలు అవార్డులు అందుకున్నారు

  • తెలుగు బుక్ అఫ్ వరల్డ్ రికార్డ్స్
  • భారత్ బుక్ అఫ్ రికార్డ్స్
  • ఆంధ్ర బుక్ అఫ్ రికార్డ్స్
  • బుక్ అఫ్ స్టేట్ రికార్డ్స్
  • స్టేట్ వరల్డ్ రికార్డ్స్
  • యునైటెడ్ బుక్ అఫ్ రికార్డ్స్
  • వర్మ బుక్ అఫ్ రికార్డ్స్

అందుకున్న సత్కారాలు

[మార్చు]

డాక్టర్ రవి పరస ఎన్నో సత్కారాలు అందుకున్నారు. పలు బిరుదులతో ఈయనను పలు సంస్థలు , వ్యక్తులు సత్కరించారు. వాటివివరాలు

  • బుద్ధవరపు చారిటబుల్ ట్రస్ట్ నుంచి
  • రాజమహేంద్రవరం సిటీ ఎం ఎల్ ఏ డాక్టర్ ఆకుల సత్యనారాయణ నుంచి :
  • బ్రాహ్మణ అసోసియేషన్ నుంచి
  • ప్రజా పత్రిక వార పత్రిక నుంచి
  • మేజిక్ ఫర్ సోషల్ సర్వీస్
  • ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ రిజిస్ట్రార్ నుంచి ఉగాది పురస్కార్
  • కళా గౌతమీ నుండి ఉగాది పురస్కార్
  • శ్రీ జ్ఞాన సరస్వతి పీఠం నుంచి ఉగాది పురస్కార్
  • ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ శ్రీ ఐ .వై. ఆర్. కృష్ణా రావు నుంచి
  • ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ ఎం . ముత్యాల నాయుడు నుంచి
  • దేవాదాయ ధర్మాదాయ శాఖ నుంచి లైఫ్ టైం అచీవ్ మెంట్ అవార్డు
  • ఫిలాంత్రోఫిక్ ట్రస్ట్ నుంచి లైఫ్ టైం అచీవ్ మెంట్ అవార్డు(2016 సర్ ఆర్థర్ కాటన్ అవార్డు )
  • యోగ కాన్షియస్ ట్రస్ట్ నుంచి
  • అఖిల బ్రాహ్మణ అసోసియేషన్ నుంచి
  • రాజమండ్రి శ్రీవిద్యా గణపతి కమిటీ నుంచి
  • ఎన్టీఆర్ ట్రస్ట్
  • లైన్స్ క్లబ్ ఇంటర్నేషనల్
  • శ్రీ త్యాగరాజ నారాయణదాసు సేవా సమితి
  • న్యూ లైఫ్ థియోలాజికల్ యూనివర్సిటీ నుంచి డాక్టరేట్ అవార్డు
  • లైన్స్ క్లబ్ వారినుంచి నఖచిత్ర కళానిధి
  • మేజిక్ ఫర్ సోషల్ సర్వీస్ నుంచి నఖచిత్ర కళాతపస్వి
  • ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి నఖచిత్ర కళారత్న
  • ఫిలాన్తరోపిక్ సొసైటీ నుంచి
  • శ్రీమేధ ఇనిస్టిట్యూషన్స్
  • టీటీడీ దేవస్థానం
  • ఆంధ్రకేసరి యువజన సమితి వ్యవస్థాపకులయిన యాతగిరి శ్రీరామ నరసింహారావు తన పేరిట ఏర్పాటుచేసిన అవార్డుని మొట్టమొదటిసారి రవి పరసకే దక్కింది. 2017ఏప్రియల్30న ఈ అవార్డు అందుకున్నారు.

ప్రముఖుల ప్రశంసలు

[మార్చు]

ఆధ్యాత్మిక ఉపన్యాసాలు ఇచ్చే డాక్టర్ మైలవరపు శ్రీనివసరావు, వ్యక్తిత్వ వికాస నిపుణులు డాక్టర్ బి.వి. పట్టాభిరాం, సినీ గేయరచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి, కళా తపస్వి కె.విశ్వవాధ్,సినీ గాయకులు పద్మశ్రీ ఎస్.పి.బాల సుబ్రహ్మణ్యం, సినీ గాయని ఎస్.పి శైలజ, రాజమహెంద్రవరం ఎం.పి.మాగంటి మురళీమోహన్,తదితరుల నుంచి ప్రశంసలు పొందారు. వీరిందరి చిత్రాలతో పాటు సర్ ఆర్దర్ కాటన్, కందుకూరి వీరేశలింగం పంతులు, టంగుటూరి ప్రకాశం పంతులు, డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్, వంటి ప్రముఖుల చిత్రాలను గోటితో గీసారు.తిరుమల తిరుపతి దేవస్థానం ఆస్థాన విద్వాంసులు గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ 2018జనవరి 29న రాజమండ్రి వల్లభ గణపతి వారి బ్రహ్మోత్సవాల సందర్భంలో సామవేదం షణ్ముఖశర్మ చే రచింపబడిన " శివపదం" పాటలను గానంచేసిన వేడుకల, బాలకృష్ణ ప్రసాద్ నఖచిత్రం వేసి,బహూకరించారు.

150రకాకులుగా జీసస్

[మార్చు]

డాక్టర్ రవి పరస ఏ దేవస్థానానికి వెళ్ళినా అక్కడి దేవుడు విగ్రహాన్ని గీయడం అలవాటుగా చేసుకున్నారు. సీంహాచలం,అన్నవరం, అయినవిల్లి,బిక్కవోలు,ఇలా ఎక్కడికి వెళ్ళినా ఆ స్వామి రూపం తన గోటితో అవలీలగా గీసేసి, అక్కడి వారిచేత ఔరా అనిపించుకున్నారు. ఇక 150రకాకులుగా జీసస్ క్రైస్ట్ చిత్రాలను చిత్రించారు.

చేతిరాత నిపుణుడైన డాక్టర్ రవి పరస వివిధ ఇంజనీరింగ్ , మెడికల్ కళాశాలలలో విద్యార్ధులకు తర్ఫీదు నిస్తూ, వేలాదిమంది జీవితాలను ప్రభావితం చేస్తున్నారు.

మూలాలు

[మార్చు]
  1. "Nail artist draws 999 varieties of Ganesha". correspondent. The Hindu. 8 September 2016. Retrieved 25 February 2017.

ఇతర లింకులు

[మార్చు]

[1] [2]

  1. https://photos.google.com/share/AF1QipMsAzxuEhFsdDBZ6DfpRJLEXIES-VPra3efuSqszi64ULmMmDy5fKrNvV_eO7y4GQ?key=TTk5V3pacWZTYjVLV2FYZUFpbkZPM1IyTHkwX2x3
  2. https://www.facebook.com/BramhasriSamavedamShanmukhaSarmaOfficialPage/videos/1297453806968949/
"https://te.wikipedia.org/w/index.php?title=రవి_పరస&oldid=4339613" నుండి వెలికితీశారు