రవీంద్ర పుష్పకుమార

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

1975, జూలై 21న జన్మించిన రవీంద్ర పుష్పకుమార శ్రీలంక క్రికెట్ జట్టుకు చెందిన క్రీడాకారుడు. ఇతడు 23 టెస్టులు, 31 వన్డేలలో శ్రీలంక జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. 1994 ఆగష్టులో పాకిస్తాన్ పై తొలి టెస్ట్ ఆడి ఆరంగేట్రం చేసిన పుష్పకుమార టెస్టులలో 58 వికెట్లు, 166 పరుగులు సాధించాడు. టెస్టులలో అత్యుత్తమ బౌలింగ్ విశ్లేషణ 116 పరుగులకు 7 వికెట్లు. అత్యధిక వ్యక్తిగత స్కోరు 44 పరుగులు. వన్డేలలో 31 మ్యాచ్‌లకు ప్రాతినిధ్యం వహించి 24 వికెట్లు పడగొట్టినాడు. అత్యుత్తమ బౌలింగ్ విశ్లేషణ 25 పరుగులకు 3 వికెట్లు.