రాండోర్ గై
రాండోర్ గై | |
---|---|
జననం | మాడభూషి రంగదొరై 1937 నవంబరు 8 |
మరణం | 2023 ఏప్రిల్ 23 | (వయసు 85)
వృత్తి | న్యాయవాది, కాలమిస్ట్, సినిమా రచయిత |
రాండోర్ గై (1937, నవంబరు 8 - 2023, ఏప్రిల్ 23), తమిళనాడుకు చెందిన న్యాయవాది, కాలమిస్ట్, సినిమా రచయిత,[1] ఆంగ్ల భాషా వార్తాపత్రిక ది హిందూతో అనుబంధమున్న న్యాయ చరిత్రకారుడు.[2][3] ది హిందూలో ప్రచురించబడిన "బ్లాస్ట్ ఫ్రమ్ ది పాస్ట్" అనే వీక్లీ కాలమ్‌కి అధికారిక సంపాదకుడిగా కూడా పనిచేశాడు. ఇతని అసలు పేరు మాడభూషి రంగదొరై,[3][4] రాండోర్ గై అనేది అతని కలం పేరు.[5]
జననం, విద్య
[మార్చు]రాండోర్ గై 1937, నవంబరు 8న జన్మించాడు.[6][7] అతను మద్రాస్ విశ్వవిద్యాలయం[8] నుండి బిఎస్సీ, బిఎల్ లో పట్టభద్రుడయ్యాడు.
తొలి జీవితం
[మార్చు]న్యాయవాదిగా తన వృత్తిని ప్రారంభించాడు.[8][9] కొద్దికాలంపాటు న్యాయవాదిగా ప్రాక్టీస్ చేసిన తర్వాత, తన ఉద్యోగాన్ని విడిచిపెట్టి, ప్యాటర్సన్ అండ్ కో అనే సంస్థలో చేరి, అక్కడ ఐదు సంవత్సరాలు పనిచేశాడు. పూర్తిస్థాయి రచయితగా ఉండడంకోసం 1976లో రాజీనామా చేశాడు.
సినిమాలు
[మార్చు]ప్రారంభంలో కొన్ని డాక్యుమెంటరీలు, సినిమాలకు స్క్రీన్‌ప్లే రాశాడు. కొన్ని ప్రకటనలకు నిర్మాతగా వ్యవహరించాడు.[9] 1999లో హాలీవుడ్ ఫిల్మ్ కంపెనీ కోసం టేల్స్ ఆఫ్ ది కామ సూత్ర: ది పెర్ఫ్యూమ్డ్ గార్డెన్ పేరుతో ఆంగ్లంలో 100 నిమిషాల సినిమాకు స్క్రిప్ట్ రాశాడు, దీనికి జగ్ ముంధ్రా దర్శకత్వం వహించాడు.[8] ఆ తర్వాత ఇది హిందీ, తమిళం, తెలుగు భాషల్లోకి బ్రహ్మచారి పేరుతో డబ్ చేయబడింది.[4][8] తరువాత సినిమాటోగ్రాఫర్ అశోక్ కుమార్‌తో కలిసి తన త్రిభాషా సినిమా కామ (1999)లో పనిచేశాడు. తను వ్రాసిన బెస్ట్ సెల్లింగ్ క్రైమ్ నవల ఆధారంగా ప్యారడైజ్ పీక్ అనే సింహళీస్ సినిమాను రాశాడు.[8] నటి నమిత నటించిన కామసూత్ర నైట్స్: మాయ అనే సినిమాకు రాశాడు.[10] ఇంగ్లీషులో నమిత నటించిన తొలి చిత్రం మాయ. [10]
అవార్డులు, సత్కారాలు
[మార్చు]2007 నవంబరు 12న కళలు, సంస్కృతికి అంకితమైన పత్రిక సముద్ర ఐదవ వార్షికోత్సవం సందర్భంగా జరిగిన కార్యక్రమంలో కళారంగాలకు ఇతను చేసిన సేవలకు గుర్తింపుగా జ్ఞాన సముద్రం అవార్డును ప్రదానం చేశారు.[11]
పుస్తకాలు
[మార్చు]- వైట్ ది బ్రేకర్స్ రోర్డు. 1967. (ఫిక్షన్)
- భారతీయ రిబాల్డ్రీ. C. E. టటిల్ కో. 1970. ISBN 0-8048-0906-2.
- ఛాయా. 1980. (ఫిక్షన్ – తెలుగు)
- కాశీ. 1981. (ఫిక్షన్ – తెలుగు)
- మాధురి ఓరు మాదిరి. 1982. (ట్రూ క్రైమ్-తమిళం)
- బి.ఎన్. రెడ్డి: ఒక మోనోగ్రాఫ్. నేషనల్ ఫిల్మ్ ఆర్కైవ్ ఆఫ్ ఇండియా. 1985. ISBN 81-201-0003-4.
- ఎ హిస్టరీ ఆఫ్ తమిళ సినిమా. 1991. (సినిమా చరిత్ర – తమిళనాడు ప్రభుత్వం)
- స్టార్‌లైట్, స్టార్‌బ్రైట్: ది ఎర్లీ తమిళ సినిమా. ఆమ్రా పబ్లిషర్స్. 1997.
- మర్డర్ ఫర్ ప్లెజర్. 1972. (ఫిక్షన్)[15]
- చితాలే (జీవిత చరిత్ర)
- మాన్సూన్. 1997.(భారతదేశంలో చిత్రీకరించబడిన హాలీవుడ్ సినిమా నవలీకరణ)
మరణం
[మార్చు]అతడు తన 85 సంవత్సరాల వయస్సులో 2023, ఏప్రిల్ 23న మరణించాడు.[12][13][14]
మూలాలు
[మార్చు]- ↑ Vasudev, A. (1988). Cinemaya: the Asian film magazine. p. 61.
- ↑ "Silk Route". Mint (newspaper. 30 September 2011.
- ↑ 3.0 3.1 "Romancing the reel". The Hindu. 25 November 2009. Retrieved 2023-07-19.
- ↑ 4.0 4.1 Varma, Shreekumar (13 November 2007). "Remembrance of things past". The Old Indian Express:Sunday Headlines. Retrieved 2023-07-19.
- ↑ "Randor Guy remembers it all « Madras Musings - We Care for Madras that is Chennai". www.madrasmusings.com. Retrieved 2023-07-19.
- ↑ Bhushan, Ravi (2007). Reference India. Rifacimento International. p. 106.
- ↑ Dutt, K. C.; S. Balu Rao; Sahitya Akademi (2001). Who's who of German Writers, 1999: A-M Vol 1. Sahitya Akademi. p. 439. ISBN 81-260-0873-3.
- ↑ 8.0 8.1 8.2 8.3 8.4 "The GUY called RANDOR". Sify. Archived from the original on 7 February 2008. Retrieved 2023-07-19.
- ↑ 9.0 9.1 Randor Guy#Fernandez, p 164
- ↑ 10.0 10.1 "Sensuous Namitha sizzles in Maya". yahoo.com. Retrieved 2023-07-19.
- ↑ "'Gnana Samudhra' award for Randor Guy". The Hindu. 13 November 2007. Archived from the original on 16 November 2007. Retrieved 2023-07-19.
- ↑ "Veteran columnist, author and film historian Randor Guy no more". The Hindu. 24 April 2023. Retrieved 2023-07-19.
- ↑ "Chronicler of Madras Randor Guy passes away". Times of India. 24 April 2023. Retrieved 25 April 2023.
- ↑ "Popular historian Randor Guy dies at 86". DT Next. 25 April 2023. Retrieved 2023-07-19.
బయటి లింకులు
[మార్చు]- Fernandez, Joseph (2004). Corporate Communications: A 21st Century Primer. SAGE. ISBN 0-7619-9746-6.