రాందాస్ నౌక మునక

వికీపీడియా నుండి
(రాందాస్ నౌక నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search

రాందాస్ నౌక మునక సంఘటన 1947 జులై 17 న ముంబై సమీపంలో తీరం నుంచి 13 కిలోమీటర్ల దూరంలో చోటు చేసుకుంది. భారత నౌకా ప్రయాణ చరిత్రలోనే ఇది అతిపెద్ద ప్రమాదం.

విశేషాలు

[మార్చు]

రాందాస్ నౌకను స్వాన్ అండ్ హంటర్ కంపెనీ నిర్మిచింది. రాందాస్ నౌక పొడువు 179 అడుగులు, వెడల్పు 29 అడుగులు. దాదాపు వెయ్యి మంది ప్రయాణించే సామర్థ్యం కలిగి ఉంది. ప్రమాదం జరిగిన సమయంలో నౌకలో 48 మంది కళాసీలు, 18 మంది సిబ్బంది, 673 మంది ప్రయాణికులు ఉన్నారు. టికెట్ తీసుకోకుండా వచ్చిన 35 మంది ప్రయాణికులు కూడా నౌకలో ఉన్నారు. మొత్తం దాదాపు 778 మంది ప్రయాణిస్తున్నారు.[1] . ఆ ప్రమాదంలో సుమారు 690 మంది ప్రయాణికులు మరణించారు.కొలాబా పాయింట్ కు పది మైళ్ల దూరంలోని గుల్ ఐలాండ్ సమీపంలో మునిగిపోయింది[2].

అవలోకనం

[మార్చు]

జూలై 17 ఉదయం, స్కాట్లాండ్ నిర్మించిన 406 టన్నుల నౌక అసాధారణంగా నిండిపోయింది, ఇందులో 800 మందికి పైగా ప్రయాణికులు ఉన్నారు. అందులో ఉన్న ప్రయాణికులు    శ్రావణ మాసం ప్రారంభం అవుతున్నదని, వారి ఆచారాల కోసం వీరిలో  చాలా మంది 'గటారి' కోసం ఇంటికి రావాలనుకున్నారు.అంతకు  ముందు రోజు రాత్రి భారీ వర్షం కురిసింది. అయితే అధికారికుల ప్రకటించిన ప్రకారం, రాందాస్ నౌక  ఫెర్రీ వార్ఫ్ నుండి బయలుదేరినప్పుడు వాతావరణం అనుకూలంగా ఉంది.  అయితే నౌక తీరం విడిచిన వెంటనే భారీ తుపానులో చిక్కుకోవడం, ఉదయం 8.35 గంటల సమయంలో భారీ అలలు పడవను కుడివైపుకు తాకడం, భయాందోళనకు గురైన ప్రయాణికులంతా పోర్టు లేదా ఎడమ వైపుకు పరిగెత్తగా, ఒక్క నిమిషంలోనే నౌక మునిగిపోయింది. ఈ నౌక వారంలో ఐదు రోజులు  ముంబై నుంచి గోవాకు వెళ్తుంది. అయితే, శనివారాల్లో ఇది ముంబై, రేవాస్ (అలీబాగ్ లో) మధ్య ప్రయాణించి తిరిగి వెళ్తుంది.

ఈ నౌక రేవాస్ చేరుకోవడానికి 1.5 గంటలు పట్టింది,  సమయానికి చేరుకోకపోవడంతో, ఇండియన్ కోఆపరేటివ్ స్టీమ్ నావిగేషన్ అండ్ ట్రేడింగ్ కంపెనీ సిబ్బందిలో ఆందోళన చెందటం జరిగింది. దీనికి కారణం ఆ సమయములో వైర్ లెస్ ట్రాన్స్ మిటర్లు లేకపోవడంతో ఎవరికీ  తెలియదు. రేడియో కమ్యూనికేషన్ లేకపోవడంతో ముంబై హార్బర్ కు కూడా సకాలంలో సమాచారం ఇవ్వలేకపోయారు. కొన్ని గంటల తర్వాత గేట్ వే ఆఫ్ ఇండియా సమీపంలోని జలాల్లో ఓ చిన్నారిని కోస్టల్ పెట్రోలింగ్ బోటు గుర్తించింది. ప్రమాదానికి గురైన ఓడలో ప్రయాణిస్తున్న 12 ఏళ్ల బర్కు ముకదమ్ అదృష్టవశాత్తూ గేట్ వే వైపు  లైఫ్ బోయ్ ను పట్టుకున్నాడు. ఈ ప్రమాదం బర్క్ ముకదమ్  చెప్పిన తర్వాతే ప్రయాణకుల గురించి గాలింపు చర్యలు,సహాయ కార్యక్రమాలు (రెస్క్యూ, సెర్చ్ ఆపరేషన్లు)ప్రారంభం అయ్యాయి. అయితే ఈ సహాయక చర్యలకు వర్షం ఆటంకం కలిగించడంతో గంటల తరబడి వేచి ఉండటం, ఎటువంటి పురోగతి ప్రయాణకుల ఆచూకీతెలియలేదు. ఎలిఫెంటా ద్వీపం, బుచర్స్ ఐలాండ్ వద్ద పలువురు ప్రయాణికుల మృతదేహాలు ఒడ్డుకు కొట్టుకుపోయాయి. ప్రయాణికుల మృతదేహాలు దొరకలేదు, నౌక శిథిలాలు కూడా లభించలేదు.

ప్రాణాలతో బయటపడిన వారిలో రూబిన్ ససూన్ అనే యూదుడు, ఫ్రాన్సిస్ డ్రైయింగ్, ఎంజీ మాల్ అనే ఇద్దరు బ్రిటీషర్లు ఉన్నారు. నౌక కెప్టెన్ షేక్ సులేమాన్ ఇబ్రహీం, ఇతర సిబ్బంది కూడా ప్రాణాలతో బయటపడ్డారని, ప్రయాణికులకు సహాయం చేయడానికి ప్రయత్నించకుండా, లైఫ్ బోయిలను వారు  అడ్డగించారని ఆరోపణలు రావడం జరిగింది[3].

దర్యాప్తు

[మార్చు]

ఈ దుర్ఘటన జరిగిన రెండు నెలల తర్వాత దర్యాప్తు ప్రారంభమైంది. కొంతమంది షిప్పింగ్ కంపెనీ అధికారులను తొలగించి, అన్ని నౌకలకు వైర్లెస్ పరికరాలను అమర్చాలని సిఫార్సు చేశారు. తదుపరి చర్యలలో వర్షాకాలంలో ప్రయాణీకుల పడవలను ప్రయాణికులను తీసుకెళ్లకుండా నిలిపివేశారు. బాధితులకు ఎలాంటి స్మారక చిహ్నం ఏర్పాటు చేయలేదు[3].

ఇవి కూడా చూడండి

[మార్చు]

టైటానిక్ నౌక

మూలాలు

[మార్చు]
  1. బేలేకర్, కిశోర్ పాండురంగ (19 July 2018). "'ముంబయి టైటానిక్': భారత నౌకా చరిత్రలోనే అతి పెద్ద ప్రమాదం ఎలా జరిగింది?". BBC News తెలుగు. Retrieved 21 July 2018.
  2. "1947 Ramdas Ship Disaster". www.spectroom.com. Archived from the original on 2023-03-28. Retrieved 2023-03-28.
  3. 3.0 3.1 "India's forgotten 'Titanic': 1947 Ramdas ship disaster that killed 700 also marks 75 years". The Economic Times. 2022-08-13. ISSN 0013-0389. Retrieved 2023-03-28.