Jump to content

రాంలాల్ మార్కండ

వికీపీడియా నుండి

రాంలాల్ మార్కండ భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని స్పితి జిల్లాలోని లాహౌల్ స్పితి నియోజకవర్గం నుండి మూడుసార్లు శాసనసభ సభ్యుడిగా ఎన్నికై మంత్రిగా పని చేశాడు.[1][2]

రాజకీయ జీవితం

[మార్చు]

రామ్ లాల్ మార్కండ 2007లో దివంగత సుఖ్ రామ్ ప్రారంభించిన పార్టీ హిమాచల్ వికాస్ కాంగ్రెస్ (HVC) పార్టీ నుండి 1998 ఎన్నికలలో మొదటిసారిగా లాహౌల్ స్పితి నియోజకవర్గం నుండి పోటీ చేసి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. ఆయన ఆ తరువాత 2003లో ఓడిపోయినా అనంతరం బీజేపీలో చేరి 2007లో ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. రామ్ లాల్ మార్కండ 2012లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి రాజ్ ఠాకూర్‌ చేతిలో ఓడిపోయాడు.

రామ్ లాల్ మార్కండ 2017లో బీజేపీ టికెట్‌పై ఎమ్మెల్యేగా ఎన్నికై వ్యవసాయ, గిరిజనాభివృద్ధి, ఐటీ శాఖ మంత్రిగా పని చేసి[3][4], 2022లో ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి రవి ఠాకూర్ చేతిలో ఓడిపోయాడు. 2024లో జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో హిమాచల్ ప్రదేశ్‌లోని ఆరుగురు కాంగ్రెస్ రెబల్స్ బీజేపీ అభ్యర్థులకు ఓటు వేసి అనంతరం బీజేపీ పార్టీలో చేరారు. ఈ క్రమంలో లాహౌల్ స్పితి నియోజకవర్గం నుండి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఎన్నికైన రవి ఠాకూర్ బీజేపీలో చేరడంతో ఉప ఎన్నికల్లో బీజేపీ రవి ఠాకూర్ కి టికెట్లు ఇవ్వడంతో మనస్థాపం చెందిన ఆయన 26 మార్చి 2024న బారటైయ జనతా పార్టీకి రాజీనామా చేశాడు.[5]

మూలాలు

[మార్చు]
  1. NDTV. "Ex Himachal Minister Quits BJP After Party Gives Ticket To Congress Rebel". Archived from the original on 28 March 2024. Retrieved 28 March 2024.
  2. The Times of India (27 March 2024). "Former min Markanda rebels after Thakur gets BJP ticket". Archived from the original on 28 March 2024. Retrieved 28 March 2024.
  3. "Himachal Pradesh Government". www.himachalpr.gov.in. 27 June 2020. Archived from the original on 28 March 2024. Retrieved 28 March 2024.
  4. Outlook India (14 September 2020). "'Atal Rohtang Tunnel To Bring Economic Revolution, Jobs,' Says Minister" (in ఇంగ్లీష్). Archived from the original on 28 March 2024. Retrieved 28 March 2024.
  5. Sakshi (27 March 2024). "కాంగ్రెస్‌ రెబల్‌కు బీజేపీ టికెట్‌.. మాజీ మంత్రి రాజీనామా". Archived from the original on 28 March 2024. Retrieved 28 March 2024.