రాఘవాపురం (రెడ్డిగూడెం మండలం)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

రాఘవాపురం కృష్ణా జిల్లా రెడ్డిగూడెం మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.

రాఘవాపురం
—  రెవిన్యూయేతర గ్రామం  —
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా కృష్ణా జిల్లా
మండలం రెడ్డిగూడెం
ప్రభుత్వం
 - సర్పంచి శ్రీమతి అద్దేపల్లి జమలమ్మ
పిన్ కోడ్ 521215
ఎస్.టి.డి కోడ్ 08656

మౌలిక వసతులు[మార్చు]

పాల ఉత్పత్తిదారుల సహకార సంఘం.

దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు[మార్చు]

శ్రీ సత్తిరెడ్డి సమేత పద్దమ్మ తల్లి ఆలయం[మార్చు]

ఈ ఆలయంలో అమ్మవారి నవమ (తొమ్మిదవ) వార్షిక తిరునాళ్ళ మహోత్సవం, 2015,మార్చి-4, బుధవారం నుండి 8వ తేదీ ఆదివారం వరకు నిర్వహించారు. బుధవారం రాత్రి అంకసేవ, గురువారం సాయంత్రం నుండి ముత్యాలమ్మ తల్లికి ప్రసాద నివేదన, శుక్రవారం గ్రామసభ & ఊరేగింపు, శనివారం సాయంత్రం నుండి కుంకుమ బండ్లు, మొక్కుబడి ప్రభలు, ఆఖరి రోజు ఆదివారం నాడు, సిడిబండి మహోత్సవం (సిడిమాను తిప్పుట) మొదలగు కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా దేవాలయం వద్ద కోలాట బృందాల నృత్యాలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమాలకు చుట్టుప్రక్కల గ్రామాల నుండి భక్తులు అధికసంఖ్యలో విచ్చేసి అలయంలోని అమ్మవారి దర్శించుకుని పూజలు చేసారు. [1]

మూలాలు[మార్చు]

వెలుపలి లింకులు[మార్చు]