రాచూరు (భట్టిప్రోలు)
రాచూరు | |
— రెవిన్యూయేతర గ్రామం — | |
అక్షాంశరేఖాంశాలు: 16°06′09″N 80°46′51″E / 16.1026°N 80.7807°E | |
---|---|
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | బాపట్ల |
మండలం | భట్టిప్రోలు |
రాచూరు బాపట్ల జిల్లా, భట్టిప్రోలు మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం. ఈ గ్రామం మండల కేంద్రం భట్టిప్రోలు నుండి 10 కి.మీ. దూరంలో ఉంది.
గ్రామంలో విద్యా సౌకర్యాలు
[మార్చు]మండల పరిషత్తు ప్రాథమిక పాఠశాల.
గ్రామానికి వ్యవసాయం, సాగునీటి సౌకర్యం
[మార్చు]పంచాయతీ చెరువు.
గ్రామ పంచాయతీ
[మార్చు]- 2013,జూలైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో శ్రీ రాచూరు సిద్ధార్ధబాబు, సర్పంచిగా ఎన్నికైనారు.
- ఈ గ్రామాన్ని కేంద్రప్రభుత్వ నిర్మల్ పురస్కారానికి ఎంపికచేసారు. ఈ పురస్కారం క్రింద రు. 2 లక్షల రూపాయల నగదు మరియూ ఆ గ్రామ ప్రజాప్రతినిధులను ప్రభుత్వం సత్కరించనున్నది. ఈ పురస్కారాన్ని, ఈ గ్రామ పంచాయతీ సర్పంచి, కార్యదర్శి, 2015,ఆగస్టు-22వ తెదీనాడు, విశాఖపట్నంలోని ఆంధ్రా విశ్వవిద్యాలయంలోని వై.వి.ఎస్.మూర్తి ఆడిటోరియంలో, రాష్ట్రమంత్రి శ్రీ చింతకాయల అయ్యన్నపాత్రుడుగారి చేతులమీదుగా ఈ పురస్కారాన్ని అందుకుంటారు.
గ్రామంలోని దర్శనీయప్రదేశములు/దేవాలయాలు
[మార్చు]ఈ గ్రామంలో శ్రీ లక్ష్మీనారాయణస్వామి విగ్రహ ప్రతిష్ఠా కార్యక్రమం, 2014,మార్చి-9న, వేదపండితుల మంత్రోచ్ఛారణల మధ్య, వైభవంగా జరిగింది. 7,8 తేదీలలో విగ్రహాల ఊరేగింపు, అభిషేకాలు చేసారు. తిరుమల తిరుపతి దేవస్థానం వారు, రు. 25 లక్షల ఆర్థిక సాయంతో పునర్నిర్మించిన దేవస్థానం, ధ్వజస్తంభాన్ని ప్రతిష్ఠించారు. ఆ రోజున ఉదయం, యగ్నహోమాలు, పూజా కార్యక్రామాలు నిర్వహించారు. అనంతరం భక్తులకు అన్న సమారాధన ఏర్పాటుచేశారు. గ్రామంలో శాంతి నెలకొనాలన్న ఉద్దేశంతో, శాంతికళ్యాణం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.
గ్రామ విశేషాలు
[మార్చు]కార్తీకమాసాన్ని పురస్కరించుకొని హైదరాబాదులో భక్తి టీ.వీ. ఆధ్వర్యంలో నిర్వహించిన కోటిదీపోత్సవాల సందర్భంగా, రాచూరు గ్రూపు దేవాలయాలలో పనిచేయుచున్న దివి వెంకట అప్పలాచార్యులను, రాష్ట్ర దేవాదాయశాఖా మంత్రి శ్రీ రామచంద్రయ్య, పూలమాలలు, దుశ్శాలువలతో సత్కరించారు.[1]
మూలాలు
[మార్చు]- ↑ గుంటూరు రూరల్/వేమూరు, 13 నవంబరు 2013. 2వ పేజీ.