రాజశేఖరా నీపై మోజు తీరలేదురా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
"రాజశేఖరా నీపై మోజు తీరలేదురా"
("Rajasekhara neepai moju teeraledura")
రచయితసముద్రాల రాఘవాచార్య
సంగీతంఆదినారాయణరావు
సాహిత్యంసముద్రాల రాఘవాచార్య
ప్రచురణఅనార్కలి (1955)
రచింపబడిన ప్రాంతంఆంధ్రప్రదేశ్
భాషతెలుగు
రూపంఖవ్వాలీ
గాయకుడు/గాయనిఘంటసాల వెంకటేశ్వరరావు
జిక్కి కృష్ణవేణి
చిత్రంలో ప్రదర్శించినవారుఅక్కినేని నాగేశ్వరరావు
అంజలీదేవి


రాజశేఖరా నీపై మోజు తీరలేదురా ఒక సంగీతభరితమైన పాట. ఇది అనార్కలి (1955) చిత్రంలోనిది. దీనిని సముద్రాల రాఘవాచార్య రచించారు. దీనిని ఘంటసాల వెంకటేశ్వరరావు, జిక్కి కృష్ణవేణి గానం చేయగా; ఆదినారాయణరావు స్వరసంగీతాన్ని గొప్పగా అందించారు. ఇది తెలుగువారి మదిలో ఒక మరుపురాని మధురగీతం.

పాట నేపథ్యం[మార్చు]

మొఘల్ రాజు అక్బర్ దర్బారులో నర్తకి అనార్కలి అద్భుతంగా నాట్యం చేస్తుంది. ఆశ్చర్య చకితుడైన యువరాజు సలీం ఆమెను ప్రేమిస్తాడు. అనార్కలి సినిమాకు చాలా కీలకమైన పాట కోసం ఖవ్వాలి బాణిలో ఉత్తరహిందుస్తానీ తరహా కథక్ నాట్యంతో చిత్రీకరించారు. అక్బర్ గా యస్వీ రంగారావు నటించగా యువరాజు సలీంగా అక్కినేని నాగేశ్వరరావు, అనార్కలిగా అంజలీదేవి అద్భుతంగా నటించిన ప్రేమ దృశ్యకావ్యంగా ఈ సినిమా నిలిచిపోయింది.

పాటలో కొంతభాగం[మార్చు]

మదన మనోహర సుందర నారి
మధుర ధరస్మిత నయనచకోరి
మందగమన జిత రాజమరాళి
నాట్యమయూరి అనార్కలి

రాజశేఖరా నీపై మోజు తీరలేదురా
రాజసాన ఏలరా
రాజశేఖరా నీపై మోజు తీరలేదురా
రాజసాన ఏలరా రాజశేఖరా
రాజశేఖరా నీపై మోజు తీరలేదురా
రాజసాన ఏలరా రాజశేఖరా

మనసు నిలువ నీదురా
మమత మాసిపోదురా || మనసు నిలువ నీదురా ||
మధురమైన బాధరా
మరపురాదు ఆ ఆ ఆ ఆ || రాజశేఖరా ||

కానిదాన కాదురా కనులనైన కానరా || కానిదాన కాదురా ||
జాగుసేయనేలరా వేగ రావదేలరా || జాగుసేయ నేలరా ||
వేగరార వేగరార వేగరార

రీమిక్స్[మార్చు]

మూలాలు[మార్చు]