Jump to content

రాజా విక్రమార్క (2021 సినిమా)

వికీపీడియా నుండి
రాజా విక్రమార్క
దర్శకత్వంశ్రీ సరిపల్లి
రచనశ్రీ సరిపల్లి
నిర్మాతఆదిరెడ్డి, 88 రామారెడ్డి
తారాగణంకార్తికేయ
తాన్యా రవిచంద్రన్
సుధాకర్ కోమాకుల
సాయి కుమార్
తనికెళ్ళ భరణి
ఛాయాగ్రహణంపి .సి. మౌళి
కూర్పుజెస్విన్ ప్రభు
సంగీతంప్రశాంత్ ఆర్ విహారి
నిర్మాణ
సంస్థ
శ్రీ చిత్ర మూవీ మేకర్స్
విడుదల తేదీs
12 నవంబరు 2021 (థియేటర్ రిలీజ్)
14 జనవరి 2022 (సన్ నెక్స్ట్ ఓటీటీ)
దేశం భారతదేశం
భాషతెలుగు

రాజా విక్రమార్క 2021లో విడుదలైన తెలుగు సినిమా. శ్రీ చిత్ర మూవీ మేకర్స్ బ్యానర్ పై ఆదిరెడ్డి. టి సమర్పణలో 88 రామారెడ్డి నిర్మించిన ఈ సినిమాకు శ్రీ సరిపల్లి దర్శకత్వం వహించాడు.[1] కార్తికేయ, తాన్యా రవిచంద్రన్, సుధాకర్ కోమాకుల, సాయి కుమార్, తనికెళ్ళ భరణి, పశుపతి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ను జూలై 21న,[2] టీజర్‌ను సెప్టెంబరు 4న,[3] నవంబరు 1న ట్రైలర్‌ను విడుదల చేసి,[4] నవంబరు 12న సినిమా విడుదలైంది.

విక్రమ్ (కార్తికేయ) నేష‌న‌ల్ ఇన్వెస్టిగేష‌న్ ఏజెన్సీ(ఎన్ఐఏ) ఏజెంట్. రాష్ట్ర హోం మినిస్టర్ చక్రవర్తి (సాయి కుమార్‌) కు న‌క్స‌లైట్ గురునారాయ‌ణ్‌(ప‌శుప‌తి) నుంచి బెదిరింపు ఉండడంతో ఆయనను కాపాడడానికి ఎన్ఐఏ టీమ్ హెడ్ మ‌హేంద్ర‌(త‌నికెళ్ల భ‌ర‌ణి) విక్రమ్ ను స్పెషల్ మిషన్ మీద నియమిస్తాడు. ఈ క్రమంలోనే హోం మినిస్టర్ కూతురు కాంతి (తాన్యా రవిచంద్రన్) తో ప్రేమలో పడతాడు. ఆ సమయంలోనే కాంతిని నక్సలైట్లు కిడ్నాప్ చేస్తారు. అతని కాపాడడానికి వచ్చిన విక్రమ్ ఎలాంటి యాక్షన్ తీసుకుంటాడు.. వీళ్లకు పోలీస్ ఆఫీసర్ గోవింద్ (సుధాకర్ కోమకుల) నుంచి ఎలాంటి సమస్యలు ఎదురవుతాయి అనేది మిగతా సినిమా కథ.[5][6]

నటీనటులు

[మార్చు]

సాంకేతిక నిపుణులు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. Eenadu (2021). "'రాజా విక్రమార్క' విచ్చేశారు". Archived from the original on 2 November 2021. Retrieved 2 November 2021.
  2. Andrajyothy (21 July 2021). "'రాజా విక్రమార్క' కొత్త పోస్టర్ రిలీజ్". Archived from the original on 2 November 2021. Retrieved 2 November 2021.
  3. TV9 Telugu (4 September 2021). "ఎన్ఐఏ‌ ఆఫీసర్‌గా కార్తికేయ...ఆకట్టుకుంటున్న 'రాజా విక్రమార్క' టీజర్." Archived from the original on 2 October 2021. Retrieved 2 November 2021.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  4. Andrajyothy (1 November 2021). "'రాజా విక్రమార్క' ట్రైలర్: దీపావళి గ్రాండ్‌గా ప్లాన్‌ చేశారు". Archived from the original on 2 November 2021. Retrieved 2 November 2021.
  5. NTV (12 November 2021). "రివ్యూ: రాజా విక్రమార్క". Archived from the original on 14 February 2022. Retrieved 14 February 2022.
  6. Eenadu (2021). "Raja Vikramarka Review: రివ్యూ: రాజా విక్రమార్క". Archived from the original on 14 February 2022. Retrieved 14 February 2022.
  7. Andrajyothy (21 July 2021). "రాజా విక్రమార్కగా కార్తికేయ". Archived from the original on 2 November 2021. Retrieved 2 November 2021.
  8. Andrajyothy (5 November 2021). "ఒక్క సినిమా అని చెప్పి మూడు చేశా: తాన్యా రవిచంద్రన్‌". Archived from the original on 5 November 2021. Retrieved 5 November 2021.
  9. Andrajyothy (31 October 2021). "నిర్మాతలు: కార్తికేయ కెరీర్‌ బెస్ట్‌ సినిమా అవుతుంది". Archived from the original on 2 November 2021. Retrieved 2 November 2021.

బయటి లింకులు

[మార్చు]