రాజేంద్ర కుమారి బాజ్‌పేయ్

వికీపీడియా నుండి
(రాజేంద్ర కుమారి బాజ్‌పేయ్‌ నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search

రాజేంద్ర కుమారి బాజ్‌పేయ్‌ (1925 ఫిబ్రవరి 8 – 1999 జూలై 17), కాంగ్రెస్ రాజకీయ నాయకురాలు, మాజీ కేంద్రమంత్రి, పాండిచ్చేరి మాజీ లెఫ్టెనెంట్ గవర్నర్ గా కూడా వ్యవహరించింది. 1980, 1984, 1989 ఎన్నికల్లో సీతాపూర్ నియోజకవర్గం నుంచి లోక్ సభకు మూడుసార్లు ఎంపిగా ఎన్నికయింది. ఆమె మాజీ ప్రధాని ఇందిరాగాంధీ ఆంతరంగికుల్లో  ఒకతె.

తొలినాళ్ళ జీవితం, కుటుంబం[మార్చు]

1925 ఫిబ్రవరి 8న బీహార్లోని భగల్‌పూర్ జిల్లాలో ఉన్న లాలూచక్  గ్రామంలో జన్మించింది. ఆమె తండ్రి పండిట్ ఎ.స్.కె.మిశ్రా. ఆమె తాత  రవి శంకర్ శుక్లా భారత స్వాతంత్ర్య సమర యోధుడు. ఆమె మేనమామ శ్యాం చరణ్ శుక్లా మధ్యప్రదేశ్ కు మూడుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేసాడు.[1] ఆమె అలహాబాద్ విశ్వవిద్యాలయంలో ఎం.ఎ, పి.హెచ్.డి చదువుకుంది.[2]

1947లో డి.ఎన్.బాజ్‌పేయ్‌ను వివాహం చేసుకుంది. ఆమె భర్త ఉపాధ్యాయునిగా పనిచేసేవాడు. అతను 1942లో క్విట్ ఇండియా ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నాడు. వీరికి ఒక కుమారుడు ఒక కుమార్తె ఉన్నారు. కుమారుని పేరు అశోక్ బాజ్‌పేయ్‌.[2]

రాజకీయ జీవితం[మార్చు]

1962 నుంచి 1977వరకు ఉత్తరప్రదేశ్ అసెంబ్లీలో ఆమె శాసనసభ్యురాలిగా వ్యవహరించింది. ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ కమిటీకి ముఖ్యనేతగా కూడా ఉంది. ఆమె ఆప్పటి భారత ప్రధాని ఇందిరాగాంధీ ఆంతరంగికుల్లో ఒకరు.[3] 1970 నుంచి 1977 వరకు ఉత్తరప్రదేశ్ రాష్ట్ర కేబినేట్ లో వివిధ మంత్రిత్వ శాఖలకు మంత్రిగా పనిచేసింది. ఆ తరువాత సీతాపూర్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి 1980, 1984, 1989 ఎన్నికల్లో మూడుసార్లు వరసగా లోక్ సభకు పార్లమెంటు సభ్యురాలిగా ఎన్నికయ్యింది. 1984 నుంచి 86వరకు సాంఘిక సంక్షేమ మంత్రిత్వ శాఖకు కేంద్రమంత్రిగా పనిచేసింది. 1986 నుంచి 87 వరకు కార్మిక శాఖా మంత్రిగానూ, రాజీవ్ గాంధీ ప్రభుత్వంలో సంక్షేమ శాఖా మంత్రిగానూ వ్యవహరించింది.[4] 1995 మే 2 నుంచి 1996 ఏప్రిల్ 22 వరకు పాండిచ్చేరికి లెఫ్టెనెంట్ గవర్నర్ గా కూడా చేసింది.[5]

ఆమె 1999 జూలై 17న అలహాబాద్లో మూత్రపిండాల వ్యాధితో మరణిందింది. రాజేంద్ర కుమారి చాలా కాలం ఆమె భర్త, పిల్లలపైనే ఆధారపడింది.[6] ఆమె చనిపోయేనాటికి కొడుకు అశోక్ జిల్లా కాంగ్రెస్ కమిటీకి అధ్యక్షునిగా వ్యవహరిస్తున్నాడు. ఆమె కోడలు డాక్టర్ రంజనా బాజ్‌పేయ్‌ ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర మహిళా  కాంగ్రెస్ కు అధ్యక్షురాలిగా పనిచేసింది.[7]

మూలాలు[మార్చు]

  1. "Rajendra Kumari Bajpai" Archived 2013-11-05 at the Wayback Machine.
  2. 2.0 2.1 "9th Lok Sabha: Members Bioprofile" Archived 2013-11-03 at the Wayback Machine.
  3. "It's family first for UP parties in poll battle".
  4. "Worldwide Guide to Women in Leadership". guide2womenleaders.
  5. Pondicherry Legislative Assembly
  6. "Bajpai dead" Archived 2004-12-22 at the Wayback Machine. 18 July 1999.
  7. "Rajendra Kumari Bajpai is dead".