Jump to content

రాజ్‍దీప్ సర్దేశాయ్

వికీపీడియా నుండి
రాజ్‍దీప్ సర్దేశాయ్
జననం (1965-05-24) 1965 మే 24 (age 59)
జాతీయతభారతీయుడు
విద్యసెయింట్ జేవియర్ కళాశాల
యూనివర్సిటి కళాశాల, ఆక్స్‍ఫోర్డ్
వృత్తిNews Anchor & ఎడిటర్ of IBN18 Network
క్రియాశీల సంవత్సరాలు1994 – ప్రస్తుతం
Notable credit(s)
India at 9
జీవిత భాగస్వామిసాగరికా ఘొష్
పిల్లలు2

రాజ్‍దీప్ సర్దేశాయి ప్రముఖ టెలివిజన్ ఎడిటర్.

ప్రముఖ క్రికెట్ క్రీడాకారుడు దిలీప్ సర్దేశాయ్ కుమారుడితడు. తండ్రిలాగా క్రికెటర్ కావాలని కలలు కనేవాడు. రంజీట్రోఫీ లలో ఆడినా, తర్వాత కాలంలో జర్నలిజం వైపు ఆకర్షితుడై అనతికాలంలో భారతదేశంలో ప్రముఖ జర్నలిస్టుగా ఎదిగారు.

మొదట టైమ్స్ ఆఫ్ ఇండియా పత్రికలో రిపోర్టర్ గా చేరాడు. ముంబాయి అల్లర్ల సమయంలో వీరు అందించిన వార్తలు అందర్నీ ఆకట్టుకున్నాయి. ఆ తర్వాత 1994లో ఎన్.డి.టి.వి.లో పొలిటికల్ ఎడిటర్ గా చేరాడు. అలా పత్రికా ప్రపంచం నుండి టీవి రంగానికి మారడం ఇతనికి ఒక గొప్ప మలుపు. అక్కడ సుమారు 10 సంవత్సరాలు ప్రముఖ జర్నలిస్టు ప్రణయ్ రాయ్ తో కలిసిపనిచేశారు. ఆ తర్వాత తనకంటూ ఒక కొత్త న్యూస్ ఛానెల్ స్థాపించాలని ఉద్దేశంలో దానిని వీడి 2005లో టీవి 18 గ్రూప్ తో కలిసి గ్లోబల్ బ్రాడ్‍కాస్ట్ నెట్‍వర్క్ ను నెలకొల్పారు. అదే ఏడాది ఈ కంపెనీ సీ.ఎన్.ఎన్.తో జతకట్టి సీ.ఎన్.ఎన్.ఐ.బీ.ఎన్ (ఇండియన్ బ్రాడ్‍కాస్ట్ న్యూస్) ను ప్రారంభించారు.