రాజ్ భవన్, డెహ్రాడూన్
రాజ్ భవన్, డెహ్రాడూన్ లేదా గవర్నర్స్ హౌస్, డెహ్రాడూన్ ఉత్తరాఖండ్ గవర్నర్ అధికారిక నివాసం.రాజ్ భవన్‌ల రెండు అధికారిక భవనాలను కలిగి ఉన్న కొన్ని భారతీయ రాష్ట్రాలలో ఉత్తరాఖండ్ ఒకటి.మొదటిది డెహ్రాడూన్ రాజధాని నగరంలో ఉంది.ఉత్తరాఖండ్ రెండవ రాజ్ భవన్ నైనిటాల్‌లో ఉంది.ప్రస్తుతం ఉత్తరాఖండ్ గవర్నరుగా గుర్మిత్ సింగ్ అధికారంలోఉన్నారు . [1] [2]
డెహ్రాడూన్‌లోని రాజ్ భవన్
ప్రస్తుత డెహ్రాడూన్ రాజ్ భవన్ 1902లో నిర్మించారు. ఇంతకుముందు దీనిని "కోర్ట్ హౌస్" అని పిలిచేవారు.అప్పటి యునైటెడ్ ప్రావిన్సెస్ గవర్నరు తరచుగా దీనిలో నివసించేవారు.ఉత్తరాఖండ్ రాష్ట్ర ఏర్పాటుతో, డెహ్రాడూన్‌లోని న్యూ కాంట్ రోడ్‌లో ఉన్న బీజాపూర్ హౌస్‌లో రాజ్ భవన్ తాత్కాలికంగా స్థాపించబడింది. తదనంతరం, డెహ్రాడూన్ సర్క్యూట్ హౌస్ రాజ్ భవన్‌గా తిరిగి నిర్ణయించబడింది. ఉత్తరాఖండ్ మొ
దటి గవర్నర్ సుర్జిత్ సింగ్ బర్నాలా 2000 డిసెంబరు 25 అక్కడికి మారారు.
స్వాతంత్య్రానంతర కాలంలో, భారత తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ డెహ్రాడూన్‌కు వచ్చినప్పుడల్లా ఈ భవనంలోనే ఉండేవారు కాలానుగుణంగా, భారతదేశానికి చెందిన వివిధ రాష్ట్రపతులు, దాదాపుగా అందరు భారత ప్రధానులు, ఇప్పటివరకు, ఈ చారిత్రాత్మక భవనంలో బస చేశారు. విశాలమైన పచ్చిక బయళ్ళు, బోన్సాయ్ గార్డెన్, సుసంపన్నమైన పూల జాతులు రాజ్ భవన్ ప్రాంత సౌందర్యాన్ని పెంచుతాయి.రాజ్‌భవన్‌లోని ఆడిటోరియం ఒక ప్రత్యేక వేదిక.ఇందులో ప్రమాణ స్వీకారోత్సవాలు, సెమినార్‌లు, పుస్తక విడుదల కార్యక్రమాలు సాంస్కృతిక కార్యక్రమాలు మొదలైన వివిధ ముఖ్యమైన కార్యక్రమాలు నిర్వహించబడతాయి.[3]
ఇవి కూడా చూడండి
[మార్చు]- రాజ్ భవన్, నైనిటాల్
- బ్రిటిష్ ఇండియన్ ఎంపైర్ ప్రభుత్వ గృహాలు
మూలాలు
[మార్చు]బాహ్య లింకులు
[మార్చు]- రాజ్ భవన్, ఉత్తరాఖండ్ అధికారిక వెబ్సైట్
- రాజ్‌భవన్ నైనిటాల్
- ఉత్తరాఖండ్ ప్రభుత్వం, అధికారిక వెబ్సైట్
- https://web.archive.org/web/20061027143752/http://www.sarkaritel.com/states/governors_state.htm
- ↑ "Our Governor: Raj Bhavan, Uttarakhand, India". governoruk.gov.in. 2012. Retrieved 24 May 2012.
15 May 2012 onwards Governor of Uttarakhand.
- ↑ "Raj Bhavan, Nainital". governoruk.gov.in. 2012. Retrieved 24 May 2014.
15 May 2014 onwards Governor of Uttarakhand.
- ↑ "An Introduction". governoruk.gov.in. Archived from the original on 8 మే 2012. Retrieved 15 February 2015.