రాజ భూషణ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

బ్రిటిషు పాలనాకాలంలో దేశం లోని వివిధ సంస్థానాధీశులు తమ సంస్థానం లోని ప్రజలకు ఇచ్చే పురస్కారం రాజ భూషణ్. ఈ పురస్కారాల్లో ఇది రెండవ అత్యున్నతమైనది. అత్యున్నత పురస్కారాన్ని రాజరత్న అని అంటారు. [1] [2] దీన్ని రాజ్‌భూషణ్ అని రాజ్యభూషణ్ అనీ వివిధ పేర్లతో పిలుస్తారు.

చరిత్ర

[మార్చు]

రాజ భూషణ్ అవార్డులను భారతదేశంలోని హిందూ సంస్థానాల పాలకులు తమ రాజ్యంలోని విశిష్ట పౌరులకు ప్రదానం చేసేవారు. ఈ పురస్కారంతో పాటు ఒక వెండి నాణెంతో కూడిన పతకాన్ని ఇచ్చేవారు. [1] [3] [4] రాజ్ రత్న & రాజ్ భూషణ్ పురస్కారాలు 1949 సంవత్సరం చివరినాటికి ఆపేసారు. సంస్థానాల విలీనం పూర్తై భారత గణతంత్రం ఏర్పాటుతో ఇవి ముగిశాయి. అయితే, ఈ పురస్కారాల వారసత్వం, స్ఫూర్తి, సారాంశం స్వతంత్ర భారతదేశంలో కూడా కొనసాగిస్తూ, స్వతంత్ర భారత ప్రభుత్వం భారతరత్న, పద్మవిభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీ వంటి ప్రతిష్టాత్మక పురస్కారాలను అందిస్తోంది.

రాజ భూషణ్ పురస్కార గ్రహీతలు

[మార్చు]
  • ప్రాణ్‌లాల్ దేవకరణ్ నంజీ - పోర్‌బందర్ సంస్థానం [3]
  • దిన్షా రతన్జీ డాబూ, బరోడా లెజిస్లేటివ్ కౌన్సిల్ సభ్యుడు. 1927 లో బరోడా సంస్థానం ప్రదానం చేసింది. ఇతనికి 1936 లో రాజరత్న పురస్కారం కూడా ఇచ్చారు [1]

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 1.2 Rattanji Daboo, Dinshaw, Raj Ratna, BA, Zamindar; b. 25 September 1835; Representative, Baroda Government at the ... Central Communication Board; Awarded 'Raj Bhusan' and a silver medal 1927; title of 'Raj Ratna* with a gold medal.. All India co-operative review, Volume 8
  2. McClenaghan, Tony (1996). Indian Princely Medals: A Record of the Orders, Decorations, and Medals of the Indian Princely States (in ఇంగ్లీష్). Lancer Publishers. p. 155. ISBN 9781897829196. Retrieved 23 August 2017.
  3. 3.0 3.1 Indian & Pakistan Year Book & Who's who (in ఇంగ్లీష్). Bennett, Coleman & Company. 1950. p. 728. Retrieved 22 August 2017. ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; "c" అనే పేరును విభిన్న కంటెంటుతో అనేక సార్లు నిర్వచించారు
  4. The Indian Year Book (in ఇంగ్లీష్). Bennett, Coleman & Company. 1942. p. 1064. Retrieved 22 August 2017.

 

"https://te.wikipedia.org/w/index.php?title=రాజ_భూషణ్&oldid=3849887" నుండి వెలికితీశారు