రాటకొండ వసుంధరాదేవి
Appearance
రాటకొండ వసుంధరాదేవి (జ.1931) ప్రముఖ తెలుగు రచయిత్రి.[1]
జీవిత విశేషాలు
[మార్చు]ఆమె తెలుగు భాషలో లఘు కథా రచయిత్రి. ఆమె వ్రాసిన రచనలు అనేక సంపుటాలుగా ప్రచురితమైనాయి. వాటిలో "వసుంధరాదేవి కథలు" అనేది 2004 లో ప్రచురితమైనది. అనేక కవితా సంకలనాలలో ఆమె కథలు కనిపిస్తాయి. వాటిలో కొన్ని యితర భాషలైన హిందీ, ఒరియా, కన్నడ భాషలలోకి అనువదింపబడ్డాయి. ఆంగ్ల అనువాదాలు కూడా బహుళ ప్రాచుర్యం పొందాయి.[2] వాటిలో
- Women Writing in India Today – Volume 2 (New York: Feminist Press),
- The Literary Endeavor, A.P.Times, Literary Supplement,
- Thulika.net (web quarterly, July,2004),
- cerebration.org (web quarterly, sponsored by Drew University, NJ; Issue II, 2005 and Issue III, 2005).
అవార్డులు
[మార్చు]ఆమె తెలుగు భాషలో చేసిన కృషికి గానూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాహిత్య అకాడమీ అవార్డులను పొందారు. గంగాథరం అవార్డు, ప్రతిభా పురస్కాఅరం (ఉత్తమ మహిళా రచయిత్రి-తెలుగు,1992) అందుకున్నారు. ఆమె ప్రస్తుతం న్యూయార్క్ లో నివసిస్తున్నారు.