Jump to content

రాణి అబ్బక్క

వికీపీడియా నుండి
రాణి అబ్బక్క

రాణి అబ్బక్క చౌతా ఉళ్ళాల రాజ్యానికి రాణి. 16వ శతాబ్దంలో  పోర్చుగల్ వాళ్ళతో పోరాడారు ఆమె. చౌతా వంశానికి చెందిన అబ్బక్క  కర్ణాటకలోని  మంగళూరు ప్రాంతాన్ని పరిపాలించారు. ఆమె వంశస్థులు  ఈ ప్రాంతాన్ని చాలా ఏళ్ళ నుంచీ పాలిస్తున్నారు. వీరి రాజధాని పుట్టిగె. ఉళ్ళాల రాజ్యంలో ఉన్న రేవు పట్టణం దానికి ఇంకో రాజధానిగా ఉండేది. ఈ ప్రాంతం భౌగోళికంగా ప్రాముఖ్యత ఉండటంతో ఎన్నోసార్లు ఈ రాజ్యాన్ని ఆక్రమించేందుకు పోర్చుగీస్ వాళ్ళు ప్రయత్నించారు. కానీ అబ్బక్క  ఆ ప్రయత్నాలన్నిటినీ తిప్పికొట్టారు. దాదాపు నాలుగు దశాబ్దాల పాటు  వాళ్ళను నిలవరించారు ఆమె. నిర్భయంగా ఆమె చేసిన ఈ పోరాటానికి గుర్తుగా ఆమెను అభయ రాణిగా పిలిచేవారు.[1][2] వలస పరిపాలకులపై పోరాటం చేసిన భారతీయుల్లో ఈమే మొదటివారు కావడం విశేషం. అంతేకాక అబ్బక్క మొట్టమొదటి మహిళా స్వతంత్ర పోరాట యోధురాలు కూడా.[3][4] కిత్తూరు చెన్నమ్మకేళడి చెన్నమ్మ, ఒనకె ఒబవ్వ, అబ్బక్క చౌతా తొలినాళ్ళ మహిళా యోధులుగా చరిత్రలో నిలిచారు.[5]

  1. "Queen Abbakka's triumph over western colonisers". Press Information Bureau, Govt., of India. Retrieved 2007-07-25.
  2. "The Intrepid Queen-Rani Abbakka Devi of Ullal". Archived from the original on 2007-08-07. Retrieved 2007-07-25.
  3. "Include Tulu in Eighth Schedule: Fernandes". Rediff.com. Retrieved 2007-07-25.
  4. "Blend past and present to benefit future". Times of India. Retrieved 2007-07-25.
  5. Freedom fighters of India, Volume 4. Delhi: ISHA Books. 2008. p. 192. ISBN 81-8205-468-0.