రాతి గుండెలో నీళ్ళు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

రాతి గుండెలో నీళ్ళు అనే కథాసంపుటి నవంబర్ 2022వ సంవత్సరంలో మార్కెట్లోకి విడుదలైంది. దీన్ని రచించినది కొత్త రేమల్లె గ్రామానికి చెందిన యువ రచయిత దొండపాటి కృష్ణ. ఇది అతని మొదటి పుస్తకం. తన 33 ఏళ్ళ వయసులో దీన్ని వెలువరించాడు. ఈ పుస్తకంలో మొత్తం పదహారు కథలున్నాయి. ఈ కథలన్నీ వివిధ ప్రముఖ దిన, వార, మాస పత్రికల్లో ప్రచురితమైనవే. 2020 - 2022 మధ్యకాలంలో ప్రచురితమైన కథలు ఇందులో చోటుచేసుకున్నాయి. కొన్ని కథలు బహుమతులు కూడా పొందాయి.

పుస్తకం ముందుమాటలు:[మార్చు]

రాతి గుండెలో నీళ్ళు పుస్తకానికి మొదటి ముందుమాట "క్రొత్త పైరు" పేరుతో కాకినాడకు చెందిన ప్రముఖ నాటక రచయిత శ్రీ సి.యస్ గా పిలవబడే చెరకువాడ సత్యనారాయణ రాశారు. రెండవ ముందుమాట "రాతి గుండెల్లో ఉబికిన చైతన్య ధారలు" పేరుతో నూజివీడు ఏపిఐఐఐటికు చెందిన తెలుగు అధ్యాపకులు, ప్రముఖ కథకులు శ్రీ డా జడా సుబ్బారావు. ఇక చివరిదైన మూడో ముందుమాట "అభ్యుదయ దృక్పథం" పేరుతో గుంటూరు ఆంధ్రప్రదేశ్ అభ్యుదయ రచయితల సంఘం (అరసం) ప్రధాన కార్యదర్శి అయిన శ్రీ వల్లూరు శివప్రసాద్.

అంకితం:[మార్చు]

రాతి గుండెలో నీళ్ళు పుస్తకాన్ని కాకినాడకు చెందిన శ్రీ & శ్రీమతి మంత్రిప్రగడ సుబ్బరాయ బోస్, లక్ష్మి దంపతులకు అంకితం ఇచ్చారు.

ISBN No: 978-93-5777-092-7

పుస్తకంలో చోటుచేసుకున్న కథల పేర్లు:[మార్చు]

01. మళ్ళీ చిగురించారు (సాహిత్య ప్రస్థానం ప్రచురణ)

02. స్వర్గసీమ (ప్రజాశక్తి స్నేహ ప్రచురణ)

03. మైత్రీవనం (నవతెలంగాణ సోపతి ప్రచురణ)

04. చైతన్య కిరణం (ప్రజాశక్తి స్నేహ ప్రచురణ)

05. రాతి గుండెలో నీళ్ళు (ఈనాడు గ్రూప్ తెలుగు వెలుగు ప్రచురణ)

06. కొత్త స్వరం (సాక్షి ఫన్ డే ప్రచురణ)

07. ఇది కదా సంతోషం! (నమస్తే తెలంగాణ బతుకమ్మ ప్రచురణ)

08. దిష్టి (సాక్షి ఫన్ డే ప్రచురణ)

09. యాచకురాలు (V6 వెలుగు దర్వాజ ప్రచురణ)

10. గుంటనక్కలు (సాహిత్య ప్రస్థానం ప్రచురణ)

11. రాముడు - భీముడు (సాక్షి ఫన్ డే ప్రచురణ)

12. ఊహల రెక్కలతో ఎగరనీయ్ (V6 వెలుగు దర్వాజ ప్రచురణ)

13. వెలుగు సూరీడు (ప్రజాశక్తి స్నేహ ప్రచురణ)

14. డబ్బులెవరికీ రావు (వార్త ప్రచురణ)

15. ఉరేసుకున్న మౌనం (విశాలాంధ్ర ప్రచురణ)

16. ఉందిలే మంచికాలం ముందుముందునా! (సాక్షి ఫన్ డే ప్రచురణ)

పుస్తకానికొచ్చిన సమీక్షలు:[మార్చు]

01. ఆంధ్రప్రభ దినపత్రిక సాహితీగవాక్షం (26-12-2022)

02. జాగృతి వార పత్రిక (30-01-2023)

03. సాహిత్య ప్రస్థానం మాసపత్రిక (February 2023)

04. విశాఖ సంస్కృతి మాసపత్రిక (February 2023)

05. సాక్షి ఫన్ డే (05-03-2023)

06. వార్త ఆదివారం అనుబంధం (05-03-2023)

07. విశాలాంధ్ర సాహితి (13-03-2023)

08. నమస్తే తెలంగాణ బతుకమ్మ (26-03-2023)

09. ప్రజాశక్తి స్నేహ (23-04-2023)

వివరాలు:[మార్చు]

కథాసంపుటి: రాతిగుండెలో నీళ్ళు

రచయిత: దొండపాటి కృష్ణ

పేజీలు : 152

ధర: 150/-

ప్రతులకు: రచయిత సెల్ నెంబర్ - 9052326864

-లేదా-

అ] ఇయర్ హుక్ షాప్

ఆ] నవోదయ బుక్ హౌస్

ఇ] లోగిలి బుక్ హౌస్

మూలాలు:[మార్చు]

  1. ఆంధ్రప్రభ దినపత్రిక 26-12-2022 "కొత్త గాలి"
  2. జాగృతి వార పత్రిక 30-01-2023 "రాతి గుండె తడిని పట్టిచ్చే కథలు"
  3. సాక్షి ఫన్ డే 05-03-2023 "భావ పరిమళాల కథాకుసుమాలు"
  4. వార్త ఆదివారం అనుబంధం 05-03-2023 "సాంఘిక ప్రయోజనాన్ని ఆశించే కథలు"
  5. విశాలాంధ్ర సాహితి 13-03-20223 "పాఠకుల ఆర్తిని తీర్చే రాతి గుండెలో నీళ్ళు"
  6. నమస్తే తెలంగాణ బతుకమ్మ 26-03-2023 "మంచి కథల సమాహారం"
  7. ప్రజాశక్తి స్నేహ 23-04-2023 "సమాజాన్ని ప్రతిబింబిస్తాయి... ఆలోచింపజేస్తాయి..." Archived 2023-06-11 at the Wayback Machine