Jump to content

రాధమ్మ పెళ్లి

వికీపీడియా నుండి
(రాధమ్మపెళ్లి నుండి దారిమార్పు చెందింది)

'రాధమ్మపెళ్లి' తెలుగు చలన చిత్రం.దాసరి నారాయణరావు దర్శకత్వంలో1974 జూలై 6 న విడుదల.ఈ చిత్రంలో ఘట్టమనేని కృష్ణ, శారద, ప్రధానపాత్రలు పోషించారు . ఈ చిత్రానికి సంగీతం పసుపులేటి రమేష్ నాయుడు సమకూర్చారు .

రాధమ్మ పెళ్లి
(1974 తెలుగు సినిమా)

సినిమా పోస్టర్
దర్శకత్వం దాసరి నారాయణ రావు
తారాగణం ఘట్టమనేని కృష్ణ٫
శ్రీధర్٫
పొట్టి వీరయ్య,
మాగంటి మురళీమోహన్,
శారద٫
పండరీబాయి
సంగీతం రమేష్ నాయుడు
నిర్మాణ సంస్థ లలిత శివ జ్యోతి ఫిల్మ్స్
భాష తెలుగు

ఈ చిత్రంలో ప్రముఖ హాస్య నటుడు పొట్టి వీరయ్య హిజ్రా పాత్రను పోషించి మెప్పించాడు.

తారాగణం

[మార్చు]

ఘట్టమనేని కృష్ణ

శారద

మాగంటి మురళి మోహన్

శ్రీధర్

పొట్టివీరయ్య

పండరీభాయి

నిర్మల

రాజబాబు

రమాప్రభ

సాంకేతిక వర్గం

[మార్చు]

దర్శకుడు: దాసరి నారాయణరావు

కధ, మాటలు, స్క్రీన్ ప్లే: దాసరి నారాయణరావు

సంగీతం: పసుపులేటి రమేష్ నాయుడు

నిర్మాణ సంస్థ: లలితా శివజ్యోతి ఫిలింస్

నిర్వహణ: మావుల్లయ్య,రామతారకం

సాహిత్యం: సింగిరెడ్డి నారాయణరెడ్డి

పాటలు. గానం : ఎస్.పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి, పి రమేష్ నాయుడు,రాజబాబు,రమాప్రభ

విడుదల:06:07:1974 .


పాటల జాబితా

[మార్చు]

1.అయ్యింది రాధమ్మపెళ్లి వెళ్ళింది ఊరూవిడిచి బంగారుతల్లి, గానం.పి.రమేష్ నాయుడు.

2.ఆడది కోరుకొనే వరాలు రెండే రెండు చల్లని సంసారం,(సంతొషం), గానం.శిష్ట్లా జానకి

3.పారే గోదావరిలా పరుగెత్తేదే వయసు పొడిచే తొలిపొద్దులా , గానం.శిష్ట్లా జానకి

4.తాగుబోతు నయంరా తమ్ముడు ఈ దగాకోరు పుండాకోరు, గానం.శ్రీపతి పండితారాద్యుల బాలసుబ్రహ్మణ్యం

5.కాకినాడ రేవుకాడ ఓడెక్కి బొంబాయి రేవుకాడ దిగుదామా, గానం.రాజబాబు, రమాప్రభ

6.సంకురాత్రి అల్లుడు సంకలేగరేసుకొచ్చాడు సందేకాడ,, గానం.ఎస్.జానకి, ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం బృందం

7.ఆడది కోరుకొనే వరాలు రెండే రెండు చల్లని సంసారం(విషాదం), గానం.శిష్ట్లా జానకి .

మూలాలు

[మార్చు]

1.ఘంటసాల గళామృతము, కొల్లూరి భాస్కరరావు బ్లాగ్.