రాధా మాధవ్ ధామ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
రాధా మాధవ్ ధామ్
బర్సానా ధామ్
కరోల్ ఎం. హైస్మిత్ 2014లో తీసిన రాధా మాధవ్ ధామ్ ఫోటో
భౌగోళికం
దేశంయునైటెడ్ స్టేట్స్
రాష్ట్రంటెక్సాస్‌
స్థలంఆస్టిన్
సంస్కృతి
దైవంరాధా కృష్ణుడు
చరిత్ర, నిర్వహణ
స్థాపితం1990

రాధా మాధవ్ ధామ్ (బర్సానా ధామ్)[1][2][3] అమెరికా, టెక్సాస్‌లోని ఆస్టిన్‌కు దక్షిణంగా ఉన్న హిందూ దేవాలయం. 200 ఎకరాల కంటే ఎక్కువ విస్తీర్ణం కలిగిన ప్రాంగణంలో ఉన్న హిందూ దేవాలయం, ఆశ్రమ సముదాయమిది.[4][5] టెక్సాస్‌లోనే అతి పురాతన ఈ హిందూ దేవాలయం[6] ఉత్తర అమెరికాలోనే అతిపెద్ద దేవాలయం.[7]

రాధా మాధవ్ ధామ్ అనేది లాభాపేక్షలేని, మతపరమైన, విద్యాపరమైన, స్వచ్ఛంద సంస్థ[8] 2014 ఏప్రిల్ లో ఎకనామిక్ గ్రోత్ సొసైటీ ఆఫ్ ఇండియా స్థాపించిన నెల్సన్ మండేలా శాంతి అవార్డును గెలుచుకున్న జెకెపి ఎడ్యుకేషన్‌తో సహా అనేక ధార్మిక విద్యా కార్యక్రమాలలో ఈ దేవాలయం భాగస్వామ్యం పొందింది.[9][10]

చరిత్ర

[మార్చు]

1970లలో స్థాపించబడిన ఇంటర్నేషనల్ సొసైటీ ఆఫ్ డివైన్ లవ్ లో భాగంగా యునైటెడ్ స్టేట్స్ కేంద్రంగా రాధా మాధవ్ ధామ్ (బర్సానా ధామ్) 1990లో స్థాపించబడింది. ఈ ప్రాంతంలో రాధా, కృష్ణులు 5,000 సంవత్సరాల క్రితం కనిపించారని ఇక్కడి హిందువులు నమ్ముతారు.[11][12] [13] ఈ దేవాలయం అమెరికాలో పుణ్యక్షేత్రంగా నిలుస్తోంది.[14] రాధా మాధవ్ ధామ్‌లోని ప్రాంతాలు ధ్యానం చేసుకోవడానికి వీలుగా అభివృద్ధి చేయబడ్డాయి.[13][15] గోవర్ధన్, రాధా కుండ్, ప్రేమ్ సరోవర్, శ్యామ్ కుటీ, ఇతర ప్రాంతాలు రాధా మాధవ్ ధామ్‌లో ప్రాతినిధ్యం వహిస్తాయి. ఈ ప్రాంతంలోని కాళింది అనే సహజ ప్రవాహం బృందాబన్ లోని యమునా నదిని సూచిస్తోంది.[16]

స్వచ్ఛంద కార్యకలాపాలు

[మార్చు]

రాధా మాధవ్ ధామ్ ఆస్టిన్ ఏరియా ఇంటర్‌రిలిజియస్ మినిస్ట్రీస్,[17][18][19] హిందూ-జూయిష్ సాలిడారిటీ డే,[20][21][22] పిబిఎస్ మెనీ వాయిస్‌ల ప్రాజెక్ట్ వంటి అంతర్-మత సేవల్లో పాల్గొంటారు.[23] 1993లో ప్రపంచ మతాల పార్లమెంట్‌లో హిందూ మతానికి ప్రాతినిధ్యంలో[24] భాగంగా సంస్థ ఎంపిక చేయబడింది.

మూలాలు

[మార్చు]
 1. a Dham Blooms in Texas Archived ఆగస్టు 17, 2016 at the Wayback Machine
 2. "Hindu Temple Opens in Texas", October 14, 1995. The Washington Post. Section: METRO
 3. Kurien, P.A. 2007. A Place at the Multicultural Table: The Development of an American Hinduism. NJ: Rutgers University Press.
 4. Ricci, J. Yoga Escapes: A Yoga Journal Guide to the Best Places to Relax, Reflect, and Renew. Celestial Arts.
 5. Walker, J.K. 2007. The Concise Guide to Today's Religions and Spirituality. Harvest House Publishers.
 6. India Today International. Volume 1, Issues 1-8. Living Media International. 2002.
 7. Gaines, David (September 11, 2020). "I Climbed Up Friday Mountain and Down Barsana Hill". The Wall Street Journal. The Wall Street Journal. Retrieved January 12, 2021.
 8. Ludwig, M. March 9, 2002. "Houses of worship". Austin American-Statesman (TX)
 9. Nelson Mandela Peace Award bestowed on the charitable organization supported by Austin based Hindu temple Archived ఏప్రిల్ 27, 2014 at the Wayback Machine. April 24, 2014. Voice of Asia
 10. Austin-based Hindu Temple gets Nelson Mandela Peace Award. April 23, 2014. India Herald.
 11. Harvard Plurism Project Archived మార్చి 4, 2016 at the Wayback Machine
 12. Perks, K.S.L. August 24, 1997. Hindus honor supreme deity with festival. Austin American-Statesman
 13. 13.0 13.1 Prothero, S.R. 2006. A nation of religions: the politics of pluralism in multireligious America. University of North Carolina Press
 14. Kettmann, M. 2009. "The Salt Lick, a Hindu Temple, Disc Golf, The Horseshoe, and Texas Wine" Archived ఆగస్టు 19, 2016 at the Wayback Machine. Santa Barbara Independent
 15. Journal of Vaishnava Studies, Volume 13, Issues 1-2. 2004.
 16. Ciment, J. 2001. Encyclopedia of American Immigration. Michigan: M. E. Sharpe.
 17. "Barsana Dham Hindu Temple" Archived మార్చి 3, 2016 at the Wayback Machine. The Pluralism Project at Harvard University.
 18. "Mayor Watson declares Radha Rani Rath Yatra Day in Austin" Archived జనవరి 26, 2013 at Archive.today, November 17, 2001. India Herald
 19. Maze, H. November 24, 2002. Interreligious organization, volunteers help give thanks" Archived మార్చి 16, 2012 at the Wayback Machine. News 8 Austin
 20. Duke, M.C. January 13, 2011. "Local event promotes Hindu-Jewish solidarity" Archived జూలై 11, 2012 at Archive.today. Jewish Herald-Voice
 21. Giri, Kalyani. January 17, 2011. "Building Bridges Between World Cultures". Indo American-News
 22. "More pictures from the 1st Annual Hindu-Jewish Solidarity Day" Archived మార్చి 3, 2016 at the Wayback Machine. 2011.
 23. "Collecting Many Voices" Archived మే 9, 2016 at the Wayback Machine. 2004.
 24. Nevans-Pederson, M. November 16, 2002. "Seeking Divine unity through Hinduism". The Telegraph-Herald

బయటి లింకులు

[మార్చు]
వికీమీడియా కామన్స్‌లో కి సంబంధించిన మీడియా ఉంది.