Jump to content

రాబిన్ శర్మ

వికీపీడియా నుండి
రాబిన్ శర్మ
వృత్తిరచయిత, వక్త
భాషఆంగ్లం
జాతీయతCanadian
పౌరసత్వంకెనడా దేశస్తుడు
పూర్వవిద్యార్థిSchulich School of Law at Dalhousie University[1]
రచనా రంగంస్వీయ సహాయం/స్ఫూర్తి
గుర్తింపునిచ్చిన రచనలుద మాంక్ హు సోల్డ్ హిజ్ ఫెరారి, ద సెయింట్, ద సర్ఫర్, అండ్ ద సియిఓ, హు విల్ క్రై వెన్ యు డై,ద 5am క్లబ్

రాబిన్ శర్మ కెనడాకు చెందిన రచయిత. ఈయన ద మాంక్ హు సోల్డ్ హిజ్ ఫెరారి అనే పుస్తకాల రచయితగా పేరు గాంచాడు.[2] ఈయన 25 సంవత్సరాల వయసుదాకా ఒక లిటిగేషన్ న్యాయవాదిగా పనిచేశాడు.[3] ఆ తర్వాత పూర్తి స్థాయి రచయిత, వక్తగా మారాడు. 1994 లో మొదటిసారిగా ఒత్తిడిని జయించడం, ఆధ్యాత్మికత ప్రధాన అంశాలుగా మెగాలివింగ్ అనే పుస్తకాన్ని స్వీయ ప్రచురణ చేశాడు.[4] తర్వాత ద మాంక్ హు సోల్డ్ హిజ్ ఫెరారి అనే పుస్తకాన్ని కూడా స్వయంగా ప్రచురించాడు. ఇదే పుస్తకాన్ని హార్పర్ కోలిన్స్ సంస్థ విస్తృతంగా పంపిణీ చేసింది. ఇవి కాకుండా ఈయన మరో 12 పుస్తకాలు రాసి ప్రచురించాడు. శర్మ లీడర్‌షిప్ ఇంటర్నేషనల్ అనే సంస్థను స్థాపించాడు.[5]

జీవితం

[మార్చు]

రాబిన్ శర్మ భారతీయ మూలాలున్న కుటుంబంలో జన్మించాడు. ఈయనను న్యాయశాస్త్రంలో మాస్టర్స్ డిగ్రీ ఉంది. మొదట్లో కొద్ది రోజులు న్యాయవాదిగా పనిచేశాడు. అందులో ఆయనకు తృప్తి లభించలేదు. 25 సంవత్సరాల వయసులో రచనా వృత్తిని ప్రారంభించాడు. ఆయన రాసిన రెండో పుస్తకం ద మాంక్ హు సోల్డ్ హిజ్ ఫెరారి మంచి ప్రజాదరణ పొందింది. దీని తర్వాత ఆయన పూర్తి స్థాయి రచయితగా మారాడు. తర్వాత వక్తగా బహిరంగ ఉపన్యాసాలు చేయడం కూడా ప్రారంభించాడు.


మూలాలు

[మార్చు]
  1. "Schulich School of Law Notable Alumni", Dalhousie University, మూస:Retrieved
  2. "Why millions go to this man for advice; Robin Sharma offers simple rules to live by. The hard part is living up to them every day". Victoria Times-Colonist, November 29, 2011.
  3. "Spiritual fable sheds light on life's big questions; Sharma's Seven Secrets". Edmonton Journal, September 23, 1997.
  4. "Toward a healthy lifestyle East Meets West: Meditation and yoga can be used by anyone". The Globe and Mail, March 3, 1995.
  5. "Sharma shows the way: Novel maps out road to happiness". Toronto Star, November 5, 2011.