Jump to content

రామస్వామి రెడ్డి గణప

వికీపీడియా నుండి

గణప రామస్వామి రెడ్డి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఒక రాజకీయ నాయకుడు, శాసనసభ సభ్యుడు. అతను 1957. 1962, 1967, 1978 లలో జరిగిన ఆంద్ర ప్రదేశ్ శాసనసభలలో శాసనసభ్యునిగా ప్రాతినిధ్యం వహించాడు.

జీవిత విశేషాలు

[మార్చు]

అతను పెదకూరపాడు శాసనసభ నియోజకవర్గం నుండి శాసనసభ్యునిగా 1962లో గెలిచాడు. అతను భారత జాతీయ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి సిపిపి అభ్యర్థి పుతుంబాక వెంకటపతి పై విజయం సాధించాడు. ఈ ఎన్నికలలో అతను 17720 ఓట్లు సాధించగా, అతని ప్రత్యర్థి వెంకటపతి 15444 ఓట్లు సాధించాడు.[1] అతను ఆంధ్ర రాష్ట్ర మొదటి శాసనసభకు ప్రాతినిధ్యం వహించాడు. అతను పెదకూరపాడు నియోజకవర్గం నుండి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచాడు. 1952 నుంచి 1972 వరకు పెదకూరపాడు ఎమ్మెల్యేగా పనిచేశాడు.

శానసభ్యునిగా

[మార్చు]
సంవత్సరం అసెంబ్లీ నియోజకవర్గం సంఖ్య పేరు నియోజక వర్గం రకం గెలుపొందిన అభ్యర్థి పేరు లింగం పార్టీ ఓట్లు ప్రత్యర్థి పేరు లింగం పార్టీ ఓట్లు
1983 105 పెదకూరపాడు జనరల్ విశేశ్వరరావు అల్లంశెట్టి పు స్వతంత్ర 50700 రామస్వామి రెడ్డి గణప పు కాంగ్రెస్ 29682
1978 105 పెదకూరపాడు జనరల్ రామస్వామి రెడ్డి గణప పు జనతా పార్టీ 45052 మహబూబ్ సయ్యద్ పు కాంగ్రెస్ 41757
1967 112 పెదకూరపాడు జనరల్ రామస్వామి రెడ్డి గణప పు కాంగ్రెస్ 38228 పుతుంబక వేంకటపతి పు సిపిఎం 17709
1962 109 పెదకూరపాడు జనరల్ రామస్వామి రెడ్డి గణప పు కాంగ్రెస్ 17720 పుతుంబక వేంకటపతి పు సిపిఐ 15444
1955 94 పెదకూరపాడు జనరల్ రామస్వామి రెడ్డి గణప పు కృషికర్ లోక్ పార్టీ 24078 దర్శి లక్ష్మయ్య పు సిపిఐ 17879

మూలాలు

[మార్చు]
  1. "Andhra Pradesh Assembly Election Results in 1962". Elections in India. Retrieved 2023-04-11.