Jump to content

రామావఝల శేషయ్య

వికీపీడియా నుండి

రామావఝల శేషయ్య నెల్లూరు జిల్లాకు చెందిన రచయిత. అతను ఉద్యోగ విరమణ చేసిన డిప్యూటీ కలెక్టరు.

జీవిత విశేషాలు

[మార్చు]

రామావఝుల శేషయ్య పూర్వులు నెల్లూరు జిల్లా ఆత్మకూరు తాలూకా బొమ్మవరం అగ్రహారం నకు చెందినవారు. అతను నెల్లూరు జిల్లా కోవూరు తాలూకా పెదపుత్తేడు సమీపంలోని ఉప్పలపాడు గ్రామంలో వెంకమ్మ, లక్ష్మీనరసయ్య దంపతులకు జన్మించాడు. తన తండ్రి కొంతకాలం చింతారెడ్డిపాలెంలోని దేవాలయంలో పూజారిగా ఉండేవాడు. అతనూ హై స్కూల్ చదువు, ఇంటర్మీడియేట్ (F.A) వరకు నెల్లూరు వి.ఆర్. కళాశాలలో జరిగనది. 1952లో మద్రాసు ప్రభుత్వం రెవెన్యూ శాఖలో విశాఖ జిల్లా విజయనగరంలో ఉద్యోగమయింది. 1988లో డిప్యూటీ కలెక్టర్ గా పదవీ విరమణ చేసాడు.

రచనలు

[మార్చు]

బాల్యం నుంచి ఈయనకు కవిత్వం రాయడం అలవాటయింది. 14వ ఏట 'రాట్నము' పాట 1944 ఫిబ్రవరి "బాల" మాసపత్రికలో ప్రచురించబడింది. 1976లో ఆటవెలది పద్యాలలో ఈయన రాసిన నీతిశతకం 'శేషశతకం' అచ్చయింది. శ్రీ వెంకటేశ్వర శతకం, శ్రీ యాదగిరి లక్ష్మీనరసింహ శతకం, ఆంజనేయ శతకం, మరికొన్ని ఖండ కావ్యాలు రాసాడు కానీ అచ్చుకాలేదు. శేషయ్య జీవితానంతరం ఆయన శ్రీమతి రామావఝల సుబ్బమ్మ 2020లో బమ్మెరపోతన శతకం ప్రచురించింది.

శేష శతకంలోని మొదటి పద్యం

[మార్చు]

గణపతిని బొమ్మరాణిని
గణుతించుచు సింహపురిని గల దేవతలన్
ప్రణతులు పూజలు సల్పుచు
గుణరంజక కవితనిపుడు కూర్చెద శేషా

మూలాలు

[మార్చు]