రామ్‌నాథ్ పార్కర్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

రామ్నాథ్ ధోండు పార్కర్ (31 అక్టోబర్ 1946 - 11 ఆగస్టు 1999) ఒక భారతీయ క్రికెటర్. అతను 31 అక్టోబర్ 1946 న ముంబై లో జన్మించాడు.

అతను 1964-65లో ఇండియన్ స్టార్‌లెట్స్‌పై వజీర్ సుల్తాన్ టొబాకో కోల్ట్స్ XI తరపున మొదటి తరగతి క్రికెట్లో అడుగు పెట్టాడు. అతను రజీందర్ పాల్, చందు బోర్డేతో 6, 30 పరుగులు చేశాడు. ఆ తర్వాత స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగం సంపాదించాడు. 85 ఫస్ట్-క్లాస్ మ్యాచ్‌ల్లో పార్కర్ 8 శతకాలతో 33.75 సగటుతో 4,455 పరుగులు చేశాడు. 64 క్యాచ్‌లు కూడా పట్టాడు.[1]

అతను 1972 - 1973లో భారతదేశంలో పర్యటించిన టోనీ లూయిస్ ఇంగ్లాండ్ జట్టుతో రెండు టెస్ట్ మ్యాచ్

రామ్‌నాథ్ పార్కర్
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
రామ్‌నాథ్ దొండు పార్కర్
పుట్టిన తేదీ(1946-10-31)1946 అక్టోబరు 31
బాంబే, బ్రిటిష్ ఇండియా
మరణించిన తేదీ1999 ఆగస్టు 11(1999-08-11) (వయసు 52)
ముంబై, మహారాష్ట్ర, భారతదేశం
బ్యాటింగుకుడిచేతి వాటం
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి టెస్టు (క్యాప్ 129)1972 20 డిసెంబర్ - ఇంగ్లాండ్ తో
చివరి టెస్టు1972 30 డిసెంబర్ - ఇంగ్లాండ్ తో
కెరీర్ గణాంకాలు
పోటీ Test First-class
మ్యాచ్‌లు 2 85
చేసిన పరుగులు 80 4455
బ్యాటింగు సగటు 20.00 33.75
100లు/50లు 0/0 8/21
అత్యధిక స్కోరు 35 197
వేసిన బంతులు 96
వికెట్లు 1
బౌలింగు సగటు 55.00
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 0
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0
అత్యుత్తమ బౌలింగు 1/4
క్యాచ్‌లు/స్టంపింగులు 0/– 64/–
మూలం: CricInfo, 2022 20 నవంబర్

లు ఆడాడు. అతను రంజీ ట్రోఫీలో బొంబాయికి ప్రాతినిధ్యం వహించాడు. తన కెరీర్లో 85 మొదటి తరగతి క్రికెట్ మ్యాచ్ లు ఆడాడు. అతను చాలా సంవత్సరాలు బొంబాయి జట్టు కోసం ఆడాడు. సునీల్ గవాస్కర్ తో పాటు ఓపెనింగ్ భాగస్వామిగా ఉన్నాడు.

1995 డిసెంబర్లో ముంబైలో తన ద్విచక్ర వాహనాన్ని మరో వాహనం ఢీకొట్టడంతో పార్కర్ అపస్మారక స్థితికి చేరుకున్నాడు. ఆయనను పునరుజ్జీవింపచేయడానికి అనేక శస్త్రచికిత్సలు , చికిత్సలు ప్రయత్నించారు. [2] 43 నెలల పాటు కోమాలో ఉన్న ఆయన 1999 ఆగస్టు 11న ముంబైలోని లోకమాన్య తిలక్ మెమోరియల్ జనరల్ ఆసుపత్రిలో మరణించాడు.

సూచనలు[మార్చు]

  1. Mukherjee, Abhishek (31 October 2016). "Ramnath Parkar: Pint-sized genius who met a cruel end". Cricketcountry. Retrieved 15 November 2023.
  2. "Obituaries in 1999". Wisden. Retrieved 2 December 2020.