రామ్ కదమ్
రామ్ కదమ్ | |||
| |||
ప్రస్తుత పదవిలో | |||
అధికార కాలం 2009 | |||
ముందు | నియోజకవర్గం సృష్టించారు | ||
---|---|---|---|
నియోజకవర్గం | ఘట్కోపర్ పశ్చిమ | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | బోరివలి , ముంబై సబర్బన్ జిల్లా | 1972 జనవరి 24||
జాతీయత | భారతీయుడు | ||
రాజకీయ పార్టీ | భారతీయ జనతా పార్టీ (2014–ప్రస్తుతం) | ||
ఇతర రాజకీయ పార్టీలు | మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన
(2014 వరకు) | ||
వృత్తి | రాజకీయ నాయకుడు |
రామ్ కదమ్ మహారాష్ట్రకు చెందిన రాజకీయ నాయకుడు. ఆయన ఘట్కోపర్ పశ్చిమ శాసనసభ నియోజకవర్గం నుండి నాలుగుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై మంత్రిగా పని చేశాడు.
రాజకీయ జీవితం
[మార్చు]రామ్ కదమ్ మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 2009 మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలలో ఘట్కోపర్ పశ్చిమ శాసనసభ నియోజకవర్గం నుండి ఎంఎన్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి పూనమ్ మహాజన్ రావుపై 26,228 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[1] ఆయన అనంతరం భారతీయ జనతా పార్టీలో చేరి 2014 మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలలో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి శివసేన అభ్యర్థి సుధీర్ మోర్‌పై 41,916 ఓట్ల మెజారిటీతో గెలిచి రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[2]
రామ్ కదమ్ 2019 మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలలో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి స్వతంత్ర అభ్యర్థి సంజయ్ భలేరావుపై 28,788 ఓట్ల మెజారిటీతో గెలిచి మూడోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[3] ఆయన 2024 మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలలో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి శివసేన (యుబిటి) అభ్యర్థి సంజయ్ దత్తాత్రే భలేరావుపై 12,971 ఓట్ల మెజారిటీతో గెలిచి వరుసగా నాల్గొవసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[4][5]
మూలాలు
[మార్చు]- ↑ "Maharashtra Assembly Election 2009 -Results" (PDF). Chief Electoral Officer, Maharashtra website. Archived from the original (PDF) on 22 November 2009. Retrieved 11 February 2010.
- ↑ India Today (19 October 2014). "Results of Maharashtra Assembly polls 2014" (in ఇంగ్లీష్). Archived from the original on 20 November 2022. Retrieved 20 November 2022.
- ↑ "Ram Kadam Seeks Fourth Consecutive Win From Ghatkopar West" (in ఇంగ్లీష్). TimelineDaily. 23 October 2024. Archived from the original on 28 December 2024. Retrieved 28 December 2024.
- ↑ "Ghatkopar West Constituency Election Results 2024" (in ఇంగ్లీష్). The Times of India. 23 November 2024. Archived from the original on 28 December 2024. Retrieved 28 December 2024.
- ↑ "Maharastra Assembly Election Results 2024 - Ghatkopar West" (in ఇంగ్లీష్). Election Commission of India. 23 November 2024. Archived from the original on 28 December 2024. Retrieved 28 December 2024.