రావికంటి రామయ్యగుప్త

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
రావికంటి రామయ్యగుప్త
జననంరావికంటి రామయ్యగుప్త
జూన్ 17, 1936
మంథని
మరణంమార్చి 30, 2009
కరీంనగర్ జిల్లా, మంథని
ఇతర పేర్లుకవిరత్న,వరకవి,రెడీమేడ్ పోయెట్
ప్రసిద్ధికవి
బరువు65kgs
మతంహిందూ మతము

రావికంటి రామయ్యగుప్త తెలంగాణకు చెందిన తెలుగు కవి. కరీంనగర్ జిల్లా మంథని ప్రాంతానికి చెందినవాడు. 1936లో జన్మించిన ఇతను 2009లో మరణించాడు.

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం త‌ర్వాత వెలుగులోకి వ‌చ్చిన క‌వులలో  ముఖ్యులు కీ.శే. శ్రీ రావికంటి రామ‌య్య గుప్త గారు. వారు ర‌చించిన న‌గ్న‌స‌త్యాలు శ‌తకంలోని ప‌ద్యం ఏడో త‌ర‌గ‌తి తెలుగు పాఠ్య పుస్త‌కంలో చోటు సంపాదించుకుంది. క‌విరత్న‌, మంత్ర‌కూట వేమ‌న‌, రెడీమేడ్ పోయెట్ గా పేరు గాంచిన ఆయ‌న పూర్వ క‌రీంన‌గ‌ర్‌, ప్ర‌స్తుత పెద్ద‌ప‌ల్లి జిల్లా మంథ‌నికి చెందిన వారు.  అనేక శ‌త‌కాల‌తో పాటు వారు బుర్ర‌క‌థ‌లు, ఏకాంకిక‌లు, గొల్ల‌సుద్దులు, నాట‌కాలు, గేయ‌కావ్యాలు, కీర్త‌న‌లు, పాట‌లు ర‌చించారు. అన్యాయం, అక్ర‌మాల‌పై అక్ష‌రాస్త్రాలు సంధించే వారు. క‌విత్వ‌మే ఊపిరిగా జీవించారు. అస‌లు సిస‌లు ప్ర‌జాక‌విగా పేరుగాంచారు. ఇటీవ‌ల ప్ర‌భుత్వం నిర్వ‌హించిన ప్ర‌పంచ తెలుగు మ‌హాస‌భ‌ల సంద‌ర్భంగా వెలువ‌రించిన పుస్త‌కంలో కూడా ఆయ‌న గురించి ప్ర‌స్తావించారు.   నీతి, నిజాయ‌తీ, నిర్భీతి, నిర్మొహ‌మాటం, నిష్క‌ల్మ‌శం, నిరాడంబ‌రం మూర్తీభ‌వించిన వ్య‌క్తిత్వం ఆయ‌న సొంతం. నాలుగు ద‌శాబ్దాల పాటు ఉపాధ్యాయునిగా సేవ‌లందించి వేలాదిమంది శిష్యుల‌ను తీర్చిదిద్దారు. ఉత్త‌మ ఉపాధ్యాయునిగా గుర్తింపు పొందారు.

ఆయ‌న చివ‌రి క్ష‌ణం వ‌ర‌కూ అక్ష‌ర సేద్యం చేస్తూనే ఉన్నారు. ఉపాధ్యాయ సంఘానికి, ఆర్య‌వైశ్య సంఘానికి ఆస్థాన‌క‌విగా గుర్తింపు పొందారు. న‌గ్న‌స‌త్యాలు, శ్రీ గౌత‌మేశ్వ‌ర శ‌త‌కాల‌తో పాటు వ‌ర‌ద‌గోదావ‌రి ఉయ్యాల పాట‌, క‌న్య‌కా ప‌రమేశ్వ‌రి శ‌త‌కం, వాస‌వీ గీత‌, వ‌ర‌హాల భీమ‌న్న‌గారి జీవిత చ‌రిత్ర బుర్ర‌క‌థ‌, ఇంకా ఎన్నో వేల పాట‌లు, కీర్త‌నలు ర‌చించారు. మ‌హామ‌హుల స‌మ‌క్షంలో క‌వితా గానం చేశారు. మంథ‌ని అంటే అంతులేని అభిమానం.

రచనలు[మార్చు]

  1. గౌతమేశ్వర శతకం[1]
  2. గీతామృతం
  3. వరద గోదావరి

తెలుగుపై...

వీధివీధిన కాన్వెంట్‌ విస్తరించే...

మనదు సంస్కృతి ఏనాడో మంటగలిసే

మమ్మీ, డాడీల చదువులే మనకుయుండే

కరుణజూపించు మంథెన్న కన్యకాంబ


తల్లిభాషను మరిచిన పిల్లలంత

ఎన్ని భాషలు నేర్చిన ఏమి ఫలము

గాలిలోపల మేడలు కట్టినట్లు

కరుణ జూపించు మంథెన్న కన్యకాంబ

మూలాలు[మార్చు]