రావి కోటేశ్వరరావు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

రావి కోటేశ్వరరావు కమ్యూనిస్టు నాయకుడు, భారత స్వాతంత్ర్య సమరయోధుడు[1].

జీవిత విశేషాలు[మార్చు]

అతను గుంటూరు జిల్లా చెరుకుపల్లి మండలం గూడవల్లికి చెందినవాడు. విద్యార్థి దశ నుంచి వామపక్ష భావాలకు ఆకర్షితులై రేపల్లె తాలూకా ఉమ్మడి కమ్యూనిస్టు పార్టీలో క్రియాశీలక పాత్ర పోషించాడు. బాలబాలికల విద్యకు సహకారం అందించాలనే సంకల్పంతో మెదక్‌ జిల్లా నర్సపూర్‌లో జిల్లాపరిషత్‌ ఉన్నత పాఠశాలకు తన పొలాన్ని దానం చేశాడు. క్విట్‌ఇండియా ఉద్యమ కాలంలో పాల్గొని బళ్లారి జైల్లో శిక్ష అనుభవించాడు.[2] అతను శ్వాసకోశ సంబంధిత వ్యాధితో బాధపడుతూ 2018 డిసెంబరు 4న హైదరాబాద్‌లో మృతి చెందాడు[3].

వ్యక్తిగత జీవితం[మార్చు]

అతని వివాహం కమ్యూనిస్టు పార్టీ సంప్రదాయంలో రావి కామాక్షమ్మతో జరిగింది. ఈ వివాహాన్ని మోటూరి హనుమంతరావు జరిపించాడు. వారికి ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. వీరిలో ముగ్గురు డాక్టర్లు, ఒక అమ్మాయి ఇంజనీరింగ్‌ చేశారు. అతనికుమారుడు డాక్టర్ భుజంగరావు[1].

మూలాలు[మార్చు]

  1. 1.0 1.1 "సిఆర్‌ ఫౌండేషన్‌లో కామ్రేడ్‌ రావి దంపతుల వివాహ వార్షికోత్సవం". Archived from the original on 2019-08-05. Retrieved 2019-08-05.
  2. "స్వాతంత్ర్య సమరయోధుడు రావి కోటేశ్వరరావు అస్తమయం".
  3. "స్వాతంత్ర్య సమరయోధుడు రావి కోటేశ్వరరావు మృతి".[permanent dead link]