రాస్సీ వాన్ డెర్ డస్సెన్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
రాస్సీ వాన్ డెర్ డస్సెన్
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
హెండ్రిక్ ఎరాస్మస్ వాన్ డెర్ డస్సెన్
పుట్టిన తేదీ (1989-02-07) 1989 ఫిబ్రవరి 7 (వయసు 35)
ప్రిటోరియా, ట్రాన్స్‌వాల్, దక్షిణాఫ్రికా
బ్యాటింగుకుడిచేతి వాటం
బౌలింగుకుడిచేతి లెగ్ బ్రేక్
పాత్రబ్యాటింగ్
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి టెస్టు (క్యాప్ 342)2019 డిసెంబరు 26 - ఇంగ్లాండ్ తో
చివరి టెస్టు2022 డిసెంబరు 17 - ఆస్ట్రేలియా తో
తొలి వన్‌డే (క్యాప్ 131)2019 జనవరి 19 - పాకిస్తాన్ తో
చివరి వన్‌డే2023 సెప్టెంబరు 15 - ఆస్ట్రేలియా తో
వన్‌డేల్లో చొక్కా సంఖ్య.72
తొలి T20I (క్యాప్ 78)2018 అక్టోబరు 9 - జింబాబ్వే తో
చివరి T20I2023 సెప్టెంబరు 1 - ఆస్ట్రేలియా తో
T20Iల్లో చొక్కా సంఖ్య.72
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
2007/08–2011/12నార్దర్స్న్
2011/12–2016/17North West
2012/13–2020/21ఇంపీరియల్ లయన్స్
2018St Kitts and Nevis Patriots
2018–2019జోజి స్టార్స్
2021/22–presentGauteng
2022రాజస్థాన్ రాయల్స్
2023MI Cape Town
2023Islamabad United
కెరీర్ గణాంకాలు
పోటీ టెస్టులు వన్‌డేలు టి20 ఫక్లా
మ్యాచ్‌లు 18 48 43 138
చేసిన పరుగులు 905 1,844 1,071 8,546
బ్యాటింగు సగటు 30.16 57.62 34.54 41.08
100లు/50లు 0/6 4/12 0/7 17/47
అత్యుత్తమ స్కోరు 98 134 94* 175
క్యాచ్‌లు/స్టంపింగులు 23/– 19/– 15/– 93/-
మూలం: ESPNcricinfo, 7 సెప్టెంబర్ 2023

హెండ్రిక్ ఎరాస్మస్ "రాస్సీ" వాన్ డెర్ డస్సెన్ (జననం 1989 ఫిబ్రవరి 7) దక్షిణాఫ్రికా జాతీయ క్రికెట్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తూ, దేశీయ క్రికెట్‌లో గౌటెంగ్ తరపున ఆడిన దక్షిణాఫ్రికా ప్రొఫెషనల్ క్రికెటరు. [1] 2018 దక్షిణాఫ్రికా క్రికెట్ వార్షికోత్సవంలో, అతను ఐదుగురు క్రికెటర్లలో ఒకరిగా ఎంపికయ్యాడు. [2] [3]

2019 ఆగస్టులో, క్రికెట్ సౌత్ ఆఫ్రికా వార్షిక అవార్డు వేడుకలో వాన్ డెర్ డుస్సెన్ ఆ ఏటి అంతర్జాతీయ కొత్త క్రికెటరుగా ఎంపికయ్యాడు. [4] [5] అదే నెలలో, క్రికెట్ దక్షిణాఫ్రికా అతనికి 2019–20 సీజన్ కోసం సెంట్రల్ కాంట్రాక్ట్‌ను అందజేసింది.[6]

దేశీయ వృత్తి[మార్చు]

2018 జూన్ 3న, గ్లోబల్ T20 కెనడా టోర్నమెంటు ప్రారంభ ఎడిషన్ కోసం వాంకోవర్ నైట్స్ తరపున ఆడేందుకు వాన్ డెర్ డుస్సెన్ ఎంపికయ్యాడు. [7] [8] ఆ టోర్నమెంటులో ఎనిమిది మ్యాచ్‌లలో 255 పరుగులతో వాంకోవర్ నైట్స్ కోసం టోర్నమెంట్‌లో అత్యధిక పరుగుల స్కోరర్‌గా నిలిచాడు. [9] అదే నెలలో, అతను 2018-19 సీజన్ కోసం హైవెల్డ్ లయన్స్ జట్టులో జట్టులో స్థానం పొందాడు. [10]

వాన్ డెర్ డస్సెన్ 2017–18 సన్‌ఫోయిల్ సిరీస్‌లో పది మ్యాచ్‌లలో 959 పరుగులతో అత్యధిక పరుగుల స్కోరర్‌గా నిలిచాడు. [11] 2018–19 CSA T20 ఛాలెంజ్ టోర్నమెంట్‌లో పది మ్యాచ్‌లలో 348 పరుగులతో అత్యధిక పరుగులు చేసినవాడిగా నిలిచాడు. [12] 2021 ఏప్రిల్లో, అతను దక్షిణాఫ్రికాలో 2021–22 క్రికెట్ సీజన్‌కు ముందు గౌటెంగ్ జట్టుకు ఎంపికయ్యాడు. [13]

టీ20 ఫ్రాంచైజీ కెరీర్[మార్చు]

2018 అక్టోబరులో, ఎంజాన్సీ సూపర్ లీగ్ T20 టోర్నమెంటు మొదటి ఎడిషన్ కోసం జోజి స్టార్స్ జట్టులో వాన్ డెర్ డస్సెన్ పేరు చేర్చారు. [14] [15] 2019 జూన్లో, అతను 2019 గ్లోబల్ T20 కెనడా టోర్నమెంట్‌లో వాంకోవర్ నైట్స్ ఫ్రాంచైజీ జట్టు తరపున ఆడేందుకు ఎంపికయ్యాడు. [16] 2019 సెప్టెంబరులో, 2019 ఎంజాన్సీ సూపర్ లీగ్ టోర్నమెంటు కోసం జోజి స్టార్స్ జట్టుకు ఎంపికయ్యాడు. [17] 2019 డిసెంబరులో, 2020 పాకిస్తాన్ సూపర్ లీగ్‌లో సప్లిమెంటరీ రౌండ్‌లో ఇస్లామాబాద్ యునైటెడ్ చివరి ఎంపికగా ఎంపికయ్యాడు. [18]

2020 జూలైలో, 2020 కరీబియన్ ప్రీమియర్ లీగ్ కోసం సెయింట్ కిట్స్ & నెవిస్ పేట్రియాట్స్ స్క్వాడ్‌లో వాన్ డెర్ డస్సెన్ పేరు పెట్టారు. [19] [20] అయితే, సరైన సమయంలో ప్రయాణ ఏర్పాట్లు చేసుకోనందున, టోర్నమెంట్‌కు దూరమైన ఐదుగురు దక్షిణాఫ్రికా క్రికెటర్లలో వాన్ డెర్ డస్సెన్ ఒకడు. [21] 2022 ఫిబ్రవరిలో, 2022 ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంటు కోసం వేలంలో రాజస్థాన్ రాయల్స్ అతనిని కొనుగోలు చేసింది. [22]

అంతర్జాతీయ కెరీర్[మార్చు]

2018 సెప్టెంబరులో, జింబాబ్వేతో జరిగిన దక్షిణాఫ్రికా ట్వంటీ 20 ఇంటర్నేషనల్ (T20I) సిరీస్‌ జట్టులో వాన్ డెర్ డస్సెన్ స్థానం పొందాడు. [23] 2018 అక్టోబరు 9న జింబాబ్వేపై దక్షిణాఫ్రికా తరపున తన T20I రంగప్రవేశం చేసాడు [24] 2019 జనవరిలో పాకిస్తాన్‌తో జరిగే సిరీస్ కోసం దక్షిణాఫ్రికా వన్డే ఇంటర్నేషనల్ (వన్‌డే) జట్టులో ఎంపికయ్యాడు. [25] 2019 జనవరి 19న పాకిస్తాన్‌పై దక్షిణాఫ్రికా తరపున తన తొలి వన్‌డే ఆడాడు.[26] వాన్ డెర్ డస్సెన్, తొలి వన్‌డే లోనే శతకం సాధించడానికి కేవలం ఏడు పరుగుల దూరంలో ఔటయ్యాడు.[27] మూడు రోజుల తర్వాత కింగ్స్‌మీడ్ స్టేడియంలో అతను అజేయంగా 80 పరుగులు చేశాడు. అతను ఐదు వన్‌డేలలో 120.5 సగటుతో 241 పరుగులతో ఆ సిరీస్‌ను ముగించాడు. [1]

2019 మార్చిలో శ్రీలంకతో జరిగిన వన్డే సిరీస్‌కు వాన్ డెర్ డుస్సెన్‌ను కొనసాగించారు. అతను నాలుగు వన్‌డేల్లో 56 సగటుతో ఒక యాభైతో సహా 112 పరుగులు చేసాడు.[1] [28] 2019 ఏప్రిల్లో, అతను 2019 క్రికెట్ ప్రపంచ కప్ కోసం దక్షిణాఫ్రికా జట్టులో ఎంపికయ్యాడు. [29] [30] 2019 డిసెంబరులో, ఇంగ్లండ్‌తో జరిగే సిరీస్‌కు దక్షిణాఫ్రికా టెస్టు జట్టుకు కూడా ఎంపికయ్యాడు. [31] 2019 డిసెంబరు 26న ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా తరపున టెస్టుల్లో రంగప్రవేశం చేశాడు [32] 2020 మార్చిలో, 2020–21 సీజన్‌కు ముందు క్రికెట్ సౌత్ ఆఫ్రికా అతనికి జాతీయ కాంట్రాక్టు ఇచ్చింది.[33] [34]

2021 ఏప్రిల్లో, పాకిస్తాన్‌తో జరిగిన మొదటి మ్యాచ్‌లో, వాన్ డెర్ డస్సెన్ 123 నాటౌట్‌తో వన్‌డేల్లో తన మొదటి సెంచరీ సాధించాడు. [35] 32 సంవత్సరాల 54 రోజుల వయస్సులో, అతను వన్‌డే మ్యాచ్‌లో తన మొదటి సెంచరీ సాధించి, దక్షిణాఫ్రికా తరపున అతి పెద్ద వయసులో అది సాధించిన క్రికెటర్‌గా నిలిచాడు. [36] 2021 సెప్టెంబరులో, వాన్ డెర్ డస్సెన్ 2021 ICC పురుషుల T20 ప్రపంచ కప్ కోసం దక్షిణాఫ్రికా జట్టులో ఎంపికయ్యాడు. [37]

విజయాలు[మార్చు]

  • 2022 జనవరిలో వార్షిక ICC అవార్డులలో, అతను 2021 సంవత్సరానికి ICC పురుషుల వన్‌డే టీమ్ ఆఫ్ ది ఇయర్‌లో ఎంపికయ్యాడు [38]

మూలాలు[మార్చు]

  1. 1.0 1.1 1.2 "Rassie van der Dussen". ESPN Cricinfo. Retrieved 7 November 2015.
  2. "Markram, Ngidi named among SA Cricket Annual's Top Five". Cricket South Africa. Archived from the original on 27 మార్చి 2019. Retrieved 29 November 2018.
  3. "Markram, Ngidi among SA Cricket Annual's Cricketers of the Year". ESPN Cricinfo. Retrieved 29 November 2018.
  4. "Du Plessis and Van Niekerk honoured with CSA's top awards". Cricket South Africa. Archived from the original on 4 ఆగస్టు 2019. Retrieved 4 August 2019.
  5. "Du Plessis, van Niekerk named CSA Cricketers of the Year". ESPN Cricinfo. Retrieved 4 August 2019.
  6. "Rassie van der Dussen earns Cricket South Africa central contract". ESPN Cricinfo. Retrieved 12 August 2019.
  7. "Global T20 Canada: Complete Squads". SportsKeeda. Retrieved 4 June 2018.
  8. "Global T20 Canada League – Full Squads announced". CricTracker. Retrieved 4 June 2018.
  9. "Global T20 Canada 2018, Vancouver Knights: Batting and Bowling Averages". ESPN Cricinfo. Retrieved 16 July 2018.
  10. "bizhub Highveld Lions' Squad Boasts Full Arsenal of Players". Highveld Lions. Archived from the original on 16 జూన్ 2018. Retrieved 16 June 2018.
  11. "Sunfoil Series, 2017/18: Most Runs". ESPN Cricinfo. Retrieved 25 March 2018.
  12. "CSA T20 Challenge, 2018/19: Most runs". ESPN Cricinfo. Retrieved 5 May 2019.
  13. "CSA reveals Division One squads for 2021/22". Cricket South Africa. Archived from the original on 20 ఏప్రిల్ 2021. Retrieved 20 April 2021.
  14. "Mzansi Super League - full squad lists". Sport24. Retrieved 17 October 2018.
  15. "Mzansi Super League Player Draft: The story so far". Independent Online. Retrieved 17 October 2018.
  16. "Global T20 draft streamed live". Canada Cricket Online. Archived from the original on 8 జూలై 2019. Retrieved 20 June 2019.
  17. "MSL 2.0 announces its T20 squads". Cricket South Africa. Archived from the original on 4 సెప్టెంబర్ 2019. Retrieved 4 September 2019. {{cite web}}: Check date values in: |archive-date= (help)
  18. "PSL 2020: What the six teams look like". ESPN Cricinfo. Retrieved 7 December 2019.
  19. "Mohammad Nabi, Sandeep Lamichhane, Ben Dunk earn big in CPL 2020 draft". ESPN Cricinfo. Retrieved 6 July 2020.
  20. "Teams Selected for Hero CPL 2020". Cricket West Indies. Retrieved 6 July 2020.
  21. "Five South Africans to miss CPL after failing to confirm travel arrangements". ESPN Cricinfo. Retrieved 28 July 2020.
  22. "IPL 2022 auction: The list of sold and unsold players". ESPN Cricinfo. Retrieved 13 February 2022.
  23. "Jonker new cap in Proteas ODI squad; Steyn and Imran Tahir return". Cricket South Africa. Archived from the original on 14 సెప్టెంబర్ 2018. Retrieved 14 September 2018. {{cite web}}: Check date values in: |archive-date= (help)
  24. "1st T20I (N), Zimbabwe tour of South Africa at East London, Oct 9 2018". ESPN Cricinfo. Retrieved 9 October 2018.
  25. "Van der Dussen called up to South Africa's ODI squad". ESPN Cricinfo. Retrieved 10 January 2019.
  26. "1st ODI (D/N), Pakistan tour of South Africa at Port Elizabeth, Jan 19 2019". ESPN Cricinfo. Retrieved 19 January 2017.
  27. "Full Scorecard of South Africa vs Pakistan 1st ODI 2019 - Score Report | ESPNcricinfo.com". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 27 April 2019.
  28. "'Form first, reputation next' - Ottis Gibson on South Africa's World Cup squad selection". ESPNcricinfo (in ఇంగ్లీష్). 18 March 2019. Retrieved 27 April 2019.
  29. "Hashim Amla in World Cup squad; Reeza Hendricks, Chris Morris miss out". ESPN Cricinfo. Retrieved 18 April 2019.
  30. "Amla edges out Hendricks to make South Africa's World Cup squad". International Cricket Council. Retrieved 18 April 2019.
  31. "South Africa call up van der Dussen, Pretorius among six uncapped players for England Tests". ESPN Cricinfo. Retrieved 16 December 2019.
  32. "1st Test, ICC World Test Championship at Centurion, Dec 26-30 2019". ESPN Cricinfo. Retrieved 26 December 2019.
  33. "Beuran Hendricks earns CSA national contract, Dale Steyn left out". ESPN Cricinfo. Retrieved 23 March 2020.
  34. "CSA announces Proteas contract squads for 2020/21". Cricket South Africa. Retrieved 23 March 2020.
  35. "Rassie van der Dussen's century heroics resurrect Proteas at Centurion". News 24. Retrieved 2 April 2021.
  36. "Babar quickest to 13 ODI tons, van der Dussen oldest South African to maiden ODI century". ESPN Cricinfo. Retrieved 3 April 2021.
  37. "T20 World Cup: South Africa leave out Faf du Plessis, Imran Tahir and Chris Morris". ESPN Cricinfo. Retrieved 9 September 2021.
  38. "ICC Men's ODI Team of the Year revealed". International Cricket Council. Retrieved 21 January 2022.