రాహుల్ బోస్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
రాహుల్ బోస్
Rahul Bose Tahaan.jpg
2008 తహాన్ ప్రీమియర్ సందర్భంగా బోస్
జననం 27 జులై 1967 (age 42)
బెంగుళూరు, కర్ణాటక, భారత దేశము
క్రియాశీలక సంవత్సరాలు 1993–ఇప్పటివరకు

రాహుల్ బోస్ (బెంగాళీ: রাহুল বসু; 1967 జూలై 27న జననం) ఒక భారతదేశ నటుడు, రచయిత, దర్శకుడు, సామాజిక కార్యకర్త మరియు రగ్బీ యూనియన్ ఆటగాడు.

ప్యార్ కి సైడ్ ఎఫెక్ట్స్ మరియు ఝాన్‌కార్ బీట్స్ వంటి హిందీ చిత్రాల్లో బోస్ నటించాడు. ఇంగ్లీష్, ఆగస్ట్ మరియు Mr. అండ్ Mrs. అయ్యర్ వంటి కళాత్మక సినిమాలను తీసినందుకు టైమ్ ఆసియా సంచిక అతన్ని "భారతీయ కళాత్మక సినిమా"[1] సూపర్‌స్టార్‌గా ప్రకటించింది. సామాజిక సేవ ద్వారా కూడా అతను సుపరిచితుడు. 2004 బాక్సింక్ డే సునామి సహాయక చర్యల్లోనూ అతను పాల్గొన్నాడు. అంతేకాక వర్ణవివక్ష వ్యతిరేక NGO, ది ఫౌండేషన్ వ్యవస్థాపకుడు కూడా.[2] బోస్ భారత అంతర్జాతీయ రగ్బీ జట్టు జాతీయ ఆరంజ్ ఇండియన్ రగ్బీ టీమ్ మాజీ సభ్యుడు కూడా.

బాల్యం[మార్చు]

రూపెన్ మరియు కుముద్ దంపతులకు 1967 జూలై 27న రాహుల్ బోస్ జన్మించాడు. అతను హిందూ మతంలోని కాయస్త్[ఉల్లేఖన అవసరం] కులానికి చెందినవాడు. అతను తనను తాను "అర్థ బెంగాలీ"గా, నాలుగో వంతు పంజాబీగా అలాగే నాలుగో వంతు మహారాష్ట్రవాసిగానూ అభివర్ణించుకునేవాడు".[3] అతను చిన్నతనంలో పశ్చిమబెంగాల్‌లోని కోల్‌కతాలో ఉండేవాడు. తర్వాత తన కుటుంబంతో కలిసి ముంబైకి మకాం మార్చాడు. ఆరేళ్ల వయసులో ఉన్నప్పుడు అతను తొలిసారిగా పాఠశాలలో ప్రదర్శించిన టామ్, ది పైపర్స్ సన్ అనే ధారావాహికంలో ప్రధాన పాత్ర పోషించాడు. చిన్నతనంలో క్రీడల పట్ల అతనికున్న ఆసక్తిని గుర్తించిన అతని తల్లి అతన్ని బాక్సింగ్ మరియు రగ్బీ యూనియన్‌లో చేర్పించింది.[4] అతను క్రికెట్ కూడా ఆడేవాడు. క్రికెటర్ మన్సూర్ అలీ ఖాన్ పటౌడి అతనికి మెళకువలు నేర్పించేవాడు.[5]

అంతేకాక అతను ముంబైలోని కేథడ్రియల్ అండ్ జాన్ కెనాన్ స్కూల్ పూర్వ విద్యార్థి కూడా. పలు అమెరికా విశ్వవిద్యాలయాల్లో చేరడానికి చేసిన ప్రయత్నాలు ఫలించకపోవడంతో అతను చివరకు సిడెన్‌హామ్ కాలేజ్‌లో ప్రవేశం పొందాడు. కాలేజీలో చదువుతుండగా, అతను పాఠశాల యొక్క రగ్బీ జట్టు తరపున వెస్ట్రన్ ఇండియా ఛాంపియన్‌షిప్స్ పోటీల్లో పాల్గొన్నాడు. తద్వారా బాక్సింగ్‌లో రజత పతకాన్ని సాధించాడు. 1987లో తన తల్లి మరణించిన తర్వాత అతను రెడిఫ్యూజన్‌లో ఉద్యోగిగా చేరాడు. పూర్తిస్థాయి నటుడుగా మారడానికి బోస్ తన తొలి చిత్రం ఇంగ్లీష్, ఆగస్ట్ విడుదలయిన తర్వాత అడ్వర్టైజింగ్ క్రియేటివ్ డైరెక్టర్‌ ఉద్యోగాన్ని వదులుకున్నాడు.[4]

రంగస్థల మరియు చలనచిత్ర వృత్తి[మార్చు]

ప్రారంభ వృత్తి: 1993–2003[మార్చు]

బాంబే వేదికపై రాహుల్ డికున్హ యొక్క టాప్సీ టర్వీ మరియు ఆర్ దేర్ టైగర్స్ ఇన్ ది కాంగో? ద్వారా బోస్ తన నటనాజీవితాన్ని ప్రారంభించాడు. దర్శకుడు దేవ్ బెనెగల్ చిత్రం ఇంగ్లీష్, ఆగస్ట్కు డికున్హ అత్త క్యాస్టింగ్ (కళాకారుల ఎంపిక బాధ్యత) డైరెక్టర్‌గా వ్యవహరించింది. బోస్‌ను ప్రధాన పాత్రధారిగా ఆమే ఎంపికచేసింది. స్క్రీన్ టెస్ట్ ముగిసిన తర్వాత ప్రజా సేవకుడు అగస్త్య సేన్ పాత్రలో అతన్ని నటింపజేయాలని బెనెగల్ నిర్ణయించుకున్నాడు.[6] ఉపమన్యు ఛటర్జీ రాసిన అదే పేరు కలిగిన నవల ఆధారంగా రూపొందిన ఇంగ్లీష్, ఆగస్ట్ మొట్టమొదటి హిందీ-ఆంగ్ల సమ్మిళిత చిత్రాల్లో ఒకటి. అంతర్జాతీయ చలనచిత్రోత్సావాల సందర్భంగా 20th సెంచురీ ఫాక్స్ సంస్థ కొనుగోలు చేసిన తొలి భారతీయ చలనచిత్రంగా అది నిలవడం ద్వారా బోస్‌కు అంతర్జాతీయ గుర్తింపు లభించింది.[7]

ఇంగ్లీష్, ఆగస్ట్ చిత్రం తర్వాత, బుల్లితెర అవకాశాలు బోస్‌కు అందివచ్చాయి. భారతదేశంలో ఆంగ్ల భాషలో రూపొందించిన తొలి బుల్లితెర ధారావాహికం ఎ మౌత్‌ఫుల్ ఆఫ్ స్కైలో ప్రధాన పాత్రధారిగా అతనికి అవకాశం వచ్చింది. అంతేకాక BBC వరల్డ్ యొక్క స్టైల్! కార్యక్రమానికి లైలా రౌయాస్‌తో కలిసి సహ ఆతిథ్యం వహించాడు. 1998లో కైజద్ గస్టడ్ యొక్క బాంబే బాయ్స్లో నజీరుద్దీన్ షాతో కలిసి అతను నటించాడు. అంతేకాక దేవ్ బెనెగల్ రెండో చిత్రం స్ప్లిట్ వైట్ ఓపెన్ లోనూ నటించాడు. నీటి విక్రయదారుడి పాత్ర కోసం బోస్ ముంబైలోని మురికివాడల్లో నివసించాడు. రెండు వారాల పాటు ఒక మాదకద్రవ్య వ్యాపారి కార్యకలాపాలను క్షుణ్ణంగా పరిశీలించాడు.[8] ఈ అనుభవాలను అతను తర్వాత 2002 గుజరాత్ అల్లర్లుతో పాటుగా ఉదహరించాడు. ఒక విధంగా అతనిలో సామాజిక స్పృహ రావడానికి అదే నాంది పలికినట్లయింది.[9] లైంగిక వేధింపుల[10][11] చిత్రీకరణ కారణంగా స్ప్లిట్ వైడ్ ఓపెన్ చిత్రం భారతదేశంలో పెను వివాదాలను సృష్టించినప్పటికీ, 2000 సింగపూర్ అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో బోస్ ఉత్తమ ఆసియా నటుడుగా సిల్వర్ స్క్రీన్ అవార్డును అందుకున్నాడు.[4] అలాగే ఇంగ్లాండ్లోని లీసెస్టర్ హేమార్కెట్‌లో జరిగిన టిమ్ మురారి యొక్క ది స్క్వేర్ సర్కిల్ చిత్రం ఆంగ్ల అనువాదం చిత్రీకరణలోనూ అతను నటించాడు.[12][13]

1997లో సల్మాన్ రష్దీ నవల మిడ్‌నైట్స్ చిల్డ్రన్ యొక్క BBC అనువర్తనంలో సలీమ్ సినై పాత్రకు బోస్‌ ఎంపికయ్యాడు. అయితే భారతదేశం మరియు శ్రీలంక ప్రభుత్వాలు చిత్రీకరణకు అనుమతించకపోవడంతో ఆ ప్రాజెక్టు చివరకు రద్దయింది.[14] ఇంగ్లీష్, ఆగస్ట్ చిత్రంలో బోస్ నటనను చూసిన తర్వాత దర్శకుడు గోవింద్ నిహలాని తక్షక్ చిత్రంలో అజయ్ దేవగాన్ ప్రతినాయకుడి పాత్రకు అతన్ని ఎంపిక చేశాడు. బోస్‌ నటనకు మంచి మార్కులే వచ్చినప్పటికీ, అది వ్యాపార విజయం[15] మాత్రం సాధించలేకపోయింది.[16]

2001లో ఎవిరిబడీ సేస్ అయామ్ ఫైన్! చిత్రం ద్వారా బోస్ దర్శకుడి అవతారమెత్తాడు. రెహన్ ఇంజినీర్ మరియు కోయల్ పూరీతో పాటు బోస్ సహాయక పాత్రను పోషించిన ఎవిరిబడీ చిత్రానికి విమర్శకుల నుంచి మిశ్రమ స్పందన వచ్చింది. అయితే 2003 పామ్ స్ప్రింగ్స్ అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో ఉత్తమ అరంగేట్ర దర్శకుడిగా జాన్ షెలీసింగర్ అవార్డు రన్నరప్‌గా బోస్ నిలిచాడు.[17] 2002లో అపర్ణ సేన్ యొక్క కళా చిత్రం Mr. అండ్ Mrs. అయ్యర్ చిత్రంలో కొంకణ సేన్ శర్మ సరసన బోస్ నటించాడు. మతపరమైన హింసకు దారితీసిందనే విమర్శలను మూటగట్టుకున్న ఈ చిత్రం ఎట్టకేలకు విజయం సాధించింది. అంతేకాక అంతర్జాతీయ చలనచిత్రోత్సవాల్లో వివిధ అవార్డులతో పాటు మూడు జాతీయ చలనచిత్ర అవార్డులు కూడా గెలుచుకుంది.[18][19]

చలనచిత్ర విజయం మరియు ప్రాంతీయ సినిమా: 2003–ఇప్పటివరకు[మార్చు]

2003లో ఝాన్‌కార్ బీట్స్ చిత్రం ద్వారా బోస్ బాలీవుడ్ (హిందీ సినీ పరిశ్రమ)లో అడుగుపెట్టాడు. ఇందులో ఒక సంగీత పోటీలో నెగ్గడానికి కష్టపడే R.D. బుర్మన్ అభిమానులైన ఇద్దరు మిత్రుల్లో ఒకడుగా అతను నటించాడు. ఆడియో ఘనవిజయం సాధించడంతో ఝాన్‌కార్ బీట్స్ చిత్రం పట్టణ ప్రాంతాల్లోని మల్టీప్లెక్స్‌[20][21] లలో దిగ్విజయంగా ప్రదర్శించబడింది. అంతేకాక సంగీతం పరంగా పలు అవార్డులను గెలుచుకుంది.[22] అదే ఏడాదిలో మరో బాలీవుడ్ చిత్రం ముంబై మ్యాట్నీ లోనూ బోస్ నటించాడు. ఈ చిత్రం UKలోనూ విడుదలయింది. అలాగే చమేలి చిత్రంలో కరీనా కపూర్ సరసన కూడా అతను నటించాడు. ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద విజయం సాధించకపోయినప్పటికీ, వివిధ ఫిల్మ్‌ఫేర్ మరియు అంతర్జాతీయ పురస్కారాలను గెలుచుకుంది.

జనవరి, 2006లో విడుదలయిన 15 పార్క్ అవెన్యూ చిత్రంలో కొంకణ సేన్ శర్మతో కలిసి బోస్ రెండోసారి నటించాడు. దర్శకురాలు అపర్ణ సేన్‌చే ఆంగ్లంలో రూపొందించబడిన 15 పార్క్ అవెన్యూ చిత్రం వివిధ అంతర్జాతీయ చలనచిత్రోత్సవాల్లో ప్రదర్శించబడింది. అలాగే భారతదేశంలోనూ హిందీ అనువాదం విడుదలయింది.[23]

తర్వాత ప్రయత్నంగా శృంగార హాస్యకథా చిత్రం ప్యార్ కి సైడ్ ఎఫెక్ట్స్లో నటించడం ద్వారా బోస్ బాలీవుడ్‌లో తన స్థానాన్ని మరింత సుస్థిరం చేసుకున్నాడు. ఈ చిత్రం ముంబై DJ సిద్ మరియు త్రిష పాత్రలో అతని పంజాబీ ప్రేయసిగా నటించిన మల్లికా షెరావత్ మధ్య ప్రేమబంధం గురించి. బోస్ రచనా శైలి యొక్క తాజాదనం వల్ల భారతీయ చలనచిత్రాల్లో సాధారణంగా ఉపయోగించని సాధనం, ఊహాజనిత సరిహద్దు చెరిగిపోయింది అని విమర్శకులు వ్యాఖ్యానించారు.[24] ఈ చిత్రానికి మల్టీప్లెక్స్‌[25] లల్లో చక్కటి ఆదరణ లభించినప్పటికీ, పరిమిత విజయం మాత్రమే సాధించింది. అయితే చివరకు 2006లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల్లో ఒకటిగా నిలవడం గమనార్హం.[26] బోస్ మరియు షెరావత్ ఇద్దరూ తమ నటనకు మంచి మార్కులు సంపాదించారు. ఈ చిత్రం విజయం నేపథ్యంలో షాదీ కి సైడ్ ఎఫెక్ట్స్ పేరుతో కొనసాగింపు (సీక్వెల్)కు కూడా ప్రయత్నాలు మొదలయ్యాయి. 2010లో చిత్రీకరణ మొదలవుతుంది.[27] మరో బాలీవుడ్ హాస్యకథా చిత్రం మన్ గయే మొఘల్-ఇ-ఆజామ్ లోనూ షెరావత్ మరియు బోస్ నటించారు. అయితే అది విజయం సాధించలేదు.[28]

2006లో మూడు బెంగాలీ చిత్రాల్లో ఒకటైన అనిరుద్ధ రాయ్ చౌదరి యొక్క అనురణన్లో బోస్ నటించాడు. పండుగల సీజన్ సందర్భంగా అనురణన్కు చక్కటి ఆదరణ లభించింది. బెంగాల్లో సుమారు మూడు నెలల పాటు విజయవంతంగా ప్రదర్శించబడింది. దానిని తర్వాత హిందీలో అనువదించి, దేశవ్యాప్తంగా విడుదల చేశారు.[29] బోస్ రెండో బెంగాలీ చిత్రం కాల్‌పురుష్ ఏప్రిల్, 2008లో విడుదలయింది. కాల్‌పురుష్ చిత్రం తండ్రి-తనయుడి మధ్య అనుబంధం గురించి. ఈ చిత్రం రచయిత-దర్శకుడు బుద్దదేవ్ దాస్‌గుప్తాకు ఉత్తమ చిత్రంగా జాతీయ చలనచిత్ర అవార్డును సాధించిపెట్టింది. 2009లో అంతహీన్ చిత్రం కోసం బోస్ మళ్లీ చౌదరితో కలిసి పనిచేశాడు. ఈ చిత్రం ఆన్‌లైన్ సంబంధాల గురించి. అనురణన్ మాదిరిగాన్ అంతహీన్ చిత్రాన్ని కూడా పశ్చిమబెంగాల్‌లో అట్టహాసంగా విడుదల చేశారు. ఈ చిత్రాన్ని మహీంద్రా ఇండో-అమెరికన్ ఆర్ట్స్ కౌన్సిల్ ఫిల్మ్ ఫెస్టివల్ (MIACC) మరియు భారత అంతర్జాతీయ చలనచిత్రోత్సవం (IFFI) సహా వివిధ చలనచిత్రోత్సవాల్లోనూ ప్రదర్శించారు.[30][31]

2008లో ఆంగ్ల భాషా చిత్రం బిఫోర్ ది రెయిన్స్ ద్వారా బోస్ ప్రధాన మరియు చిత్రకళా సినిమాలు రెండింటిలోనూ నటించసాగాడు. బిఫోర్ ది రెయిన్స్ చిత్రం US మరియు UKలోనూ విడుదలయింది. ఈ చిత్రానికి మిశ్రమ స్పందన వచ్చినప్పటికీ, అందులో నటనకు బోస్‌ను పలువురు విమర్శకులు మెచ్చుకున్నారు. అలాగే ఎ ఫ్యూ గుడ్ మెన్ అనే అమెరికా చిత్రం ఆధారంగా రూపొందించిన శౌర్య అనే మిలిటరీ కోర్డ్ రూమ్ నాటికలోనూ బోస్ నటించాడు.

బోస్ నటనకు మంచి మార్కులు పడ్డాయి. విమర్శకుడు తరణ్ ఆదర్శ్ మాట్లాడుతూ, అతని "నటన అతని అత్యుత్తమ ప్రదర్శనల్లో ఒకటిగా చెప్పుకోవచ్చు" అని అన్నాడు.[32] దిల్ కబడ్డీ చిత్రం ద్వారా కొంకణ సేన్ శర్మతో కలిసి అతను మూడోసారి నటించాడు. ఈసారి వారిద్దరూ వైవాహిక ఇబ్బందులు ఎదుర్కొనే భార్యాభర్తలుగా నటించారు.[33]

2010 మొదట్లో[34] ప్రారంభంకానున్న మోషిన్ హమీద్ నవల మోత్ స్మోక్ అనువర్తనం చిత్రీకరణలో అతను పాల్గొనాల్సి ఉంది. అయితే ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఆ ప్రాజెక్టు రద్దయింది.[35] అతను నటించిన అపర్ణ సేన్ మూడో చిత్రం ది జపనీస్ వైఫ్ ఏప్రిల్, 2010లో విడుదలకానుంది.[36][37][38] భయానక చిత్రం ఫైర్డ్, ముంబై చకాచక్, ఐ యామ్ మరియు కుచ్ లవ్ జైసా వంటివి బోస్ ఇతర భవిష్యత్ ప్రాజెక్టులు.

క్రీడా జీవితం[మార్చు]

1998లో ఆసియన్ రగ్బీ ఫుట్‍‌బాల్ యూనియన్ ఛాంపియన్‌షిప్ అనే అంతర్జాతీయ పోటీలో తలపడేందుకు ఎంపికైన మొట్టమొదటి భారత జాతీయ రగ్బీ జట్టులో బోస్ కూడా సభ్యుడు.[39] స్క్రమ్-హాఫ్ మరియు రైట్-వింగర్ స్థానాలు రెండింటిలోనూ అతను ఆడాడు.[40] 2009 సీజన్‌లో తాను జట్టుకు అందుబాటులోకి రాలేనని డైలీ న్యూస్ & ఎనాలిసిస్కు ఇచ్చిన ఇంటర్వూ సందర్భంగా బోస్ ప్రకటించాడు.[41]

సేవాగుణం[మార్చు]

2004 బాక్సింగ్ డే సునామి నేపథ్యంలో అండమాన్ మరియు నికోబార్ దీవులలో చేపట్టిన సహాయక చర్యలకు బోస్ తన వంతు సేవలు అందించాడు. అంతేకాక బోస్ తన NGO ది ఫౌండేషన్ ద్వారా అండమాన్ మరియు నికోబార్ ఉపకారవేత పథకాన్ని ప్రారంభించాడు. ఈ ఉపకారవేతన పథకం అండమాన్ మరియు నికోబార్ దీవులలోని పేద పిల్లల చదువుకు ఉద్దేశించింది.[42]

అక్షర సెంటర్, బ్రేక్‌త్రూ, సిటిజన్స్ ఫర్ జస్టిస్ అండ్ పీస్ మరియు స్పస్టిక్స్ సొసైటీ ఆఫ్ ఇండియా వంటి వివిధ సేవా సంస్థలతోనూ బోస్ కలిసి పనిచేశాడు. అంతేకాక అతను 2007లో మొట్టమొదటి భారత ఆక్స్‌ఫామ్ అంతర్జాతీయ ప్రచారకర్తగా అవతరించాడు.[43] అతను 51 ముంబై సేవా సంస్థలు మరియు NGOల గుత్తాధిపత్య సంస్థ ది గ్రూప్ ఆఫ్ గ్రూప్స్ యొక్క వ్యవస్థాపకుడు మరియు ఛైర్మన్ కూడా.[44] అంతేకాక అతను అమెరికన్ ఇండియా ఫౌండేషన్, వరల్డ్ యూత్ పీస్ మూమెంట్[45] మరియు ప్లానెట్ అలెర్ట్ ప్రచారకర్త.[46] నర్మదా బచావో ఆందోళన్ మరియు నర్మద ఆనకట్ట నిర్మాణాన్ని అడ్డుకోవడానికి అది చేసిన ప్రయత్నాలకు అతను గట్టి మద్దతు పలికాడు.[47][48] టెరీ డెస్ హోమ్స్ సంస్థ యొక్క ఆడియో పుస్తకం గుడ్‌గూడి కర్ణ, గలే లగేనా; స్పార్ష్ కి నియామ్ సిఖియే (ఆంగ్లం: టికిల్ అండ్ హగ్స్: లెర్నింగ్ ది టచింగ్ రూల్స్ )ను అతను రికార్డు చేశాడు. లైంగిక వేధింపులకు గురికాకుండా పిల్లలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో అందులో వివరించడం జరిగింది.[49]

లింగ సమానత్వం మరియు మానవ హక్కులపై ఆక్స్‌ఫర్డ్ మరియు 2004 ప్రపంచ యువ శాంతి సదస్సులో బోస్ ఉపన్యసించాడు.[1] 2009లో క్లయిమేట్ యాక్షన్ నెట్‌వర్క్[50] ఆధ్వర్యంలో పర్యావరణ మార్పుపై ప్రసంగించడానికి అతను కెనడా వెళ్లాడు. అక్కడ కొపెన్హాగెన్ పర్యావరణ మార్పు సదస్సులో నిరసనకారుల ప్రదర్శనలోనూ పాల్గొన్నాడు.[51]

వ్యక్తిగత జీవితం[మార్చు]

రాహుల్ బోస్ తొలుత కోయల్ పూరీతో కలిసి ప్రేమ కార్యకలాపాలు సాగించాడు. అతను దర్శకత్వం వహించిన ఎవిరిబడీ సేస్ అయామ్ ఫైన్! చిత్రంలో ఆమె నటించింది. 2004 చిత్రం వైట్ నాయిస్ లోనూ ఈ జంట దర్శనమిచ్చింది.[52][53]

నటజీవితం[మార్చు]

ఫిల్మోగ్రఫీ[మార్చు]

సంవత్సరం చలనచిత్రం పాత్ర ఇతర గమనికలు
1994 ఇంగ్లీష్, ఆగస్ట్ అగస్త్య సేన్
1995 ఎ మౌత్‌ఫుల్ ఆఫ్ స్కై సర్కార్, పవన్ TV
1996 బామ్‌గే ది లెఫ్టీ
1998 బాంబే బాయ్స్ రికార్డో ఫెర్నాండెజ్
1999 స్ప్లిట్ వైడ్ ఓపెన్ కట్ ప్రైస్
తక్షక్ సన్నీ
2001 ఎవిరిబడీ సేస్ అయామ్ ఫైన్! రేజ్
2002 Mr. అండ్ Mrs. అయ్యర్ రాజా
2003 ఝాన్‌కార్ బీట్స్ రిషి
ఏక్ దిన్ 24 ఘంటే వీరేంద్ర
ముంబై మ్యాట్నీ దేవాశిష్ "దేవు" ఛటర్జీ
చమేలి అమాన్ కపూర్
2004 వైట్ నాయిస్ కరన్ డియోల్
2005 ది ఫాల్ లఘు చిత్రం
స్క్రమ్ ఇన్ ది మడ్ విత్ రాహుల్ బోస్ రాహుల్ బోస్ TV లఘు చిత్రం (డాక్యుమెంటరీ)
సిల్‌సిలే నీల్
15 పార్క్ అవెన్యూ జయ్‌దీప్ "జోజో" రాయ్
Ctrl+Alt+Del కబీర్
2006 అనురణన్ రాహుల్ ఛటర్జీ
ప్యార్ కి సైడ్ ఎఫెక్ట్స్ సిద్దార్థ్ "సిద్" బోస్
ది అదర్ సైడ్ ఆఫ్ బాలీవుడ్ రాహుల్ బోస్ లఘు చిత్రం
2007 చైన్ కులిల్ కి మై కులిల్ వరుణ్
2008 బిఫోర్ ది రెయిన్స్ T. K. నీలన్
శౌర్య మేజర్ సిద్దాంత్ చౌదరి
మన్ గయే మొఘల్-ఇ-ఆజాం అర్జున్
దిల్ కబడ్డీ రిషి
తహాన్ జాఫర్
కాల్‌పురుష్ తనయుడి పాత్ర
2009 అంతహీన్ అభిక్ చౌదరి
ది విష్పరర్స్ సిద్
2010 ఫైర్డ్
ముంబై చకాచక్ చిత్రీకరణ పూర్తి
ఘోస్ట్ ఘోస్ట్ న రహా చిత్రీకరణ దశలో ఉంది
అయామ్ జయ్ చిత్రీకరణ పూర్తి
ది జపనీస్ వైఫ్ స్నేహమయ్ ఛటర్జీ 2010 ఏప్రిల్ 9[36] న విడుదలకానుంది
కుచ్ లవ్ జైసా చిత్రీకరణ పూర్తి
బిట్స్ అండ్ పీసెస్ అరిందమ్ చిత్రీకరణ పూర్తి
క్లిక్ అండ్ మేరీ ప్రకటించారు

నేపథ్య గానం[మార్చు]

సంవత్సరం చలనచిత్రం పాట
2006 అనురణన్ "ఆకాషే ఛరానో మేఘర్"

రచయిత/దర్శకుడు[మార్చు]

సంవత్సరం చలనచిత్రం గమనికలు
2001 ఎవిరిబడీ సేస్ అయామ్ ఫైన్!
2009 ది విష్పరర్స్ కథ

రంగస్థలం[మార్చు]

సంవత్సరం పేరు పాత్ర
1989 టాప్సీ టర్వీ
1993 ఆర్ దేర్ టైగర్స్ ఇన్ ది కాంగో?
1996 ఆర్ట్ మార్క్
1999 ది స్క్వేర్ సర్కిల్ లక్ష్మీ/లక్ష్మణ్
సీస్కేప్ విత్ షార్క్స్ అండ్ డాన్సర్

అవార్డులు[మార్చు]

!'

 • 2005 - మహేష్ భట్ స్పోక్స్‌పర్శన్ అవార్డు
 • 2007 - "ఆర్టిస్ట్ ఫర్ ఛేంజ్" కర్మవీర్ పురస్కార్ అవార్డు[54]
 • 2008 - IBN సిటిజన్ జర్నలిస్ట్ అవార్డు[55]
 • 2009 - ఐడియా అంతర్జాతీయ భారత చలనచిత్ర అకాడెమీ గ్రీన్ అవార్డు[56]
 • సామాజిక న్యాయం మరియు సంక్షేమానికి 2009 - యూత్ ఐకాన్ అవార్డు[57]
 • ప్రముఖ వ్యక్తిగా అసాధారణ సేవకు 2010 - గ్రీన్ గ్లోబ్ ఫౌండేషన్ అవార్డు[58]

సూచనలు[మార్చు]

 1. 1.0 1.1 World Youth Peace Summit (2003), Rahul Bose: Actor/Producer/Humanitarian, retrieved 2008-08-05
 2. Ayaz, Shaikh (23 November 2006), Rapid fire with Rahul Bose, retrieved 2008-08-05
 3. Vivek Fernandes (25 July 2002). "'ESIF is deep, dark, sexual, funny...'". Rediff. Retrieved 2 December 2009. Cite web requires |website= (help)
 4. 4.0 4.1 4.2 "Rahul Bose: Split wide open". Times of India. Asia Africa Intelligence Wire. 31 August 2003. మూలం నుండి 5 December 2012 న ఆర్కైవు చేసారు. Retrieved 16 December 2008.
 5. Gupta, Richa (21 June 2007). "Bose, up close". The Indian Express. Retrieved 16 December 2008.
 6. "Hard work is never enough". Times of India. 13 September 2003. Retrieved 11 September 2009.
 7. Chatterjee, Saibal (29 November 1995). "On With The Offbeat". Outlook. Retrieved 2 December 2009.
 8. Bhattacharya, Roshmila (26 September 2003). "Like a Virgin". Screen Weekly. Retrieved 11 September 2009.
 9. Anuradha Sengupta (21 October 2007). "http://ibnlive.in.com/news/being-rahul-bose-nothing-runofthemill-please/50884-8-p1.html". IBN. Retrieved 31 December 2009. External link in |title= (help)
 10. Peer, Basharat (31 March 2001). "'Not for me a process that is illegal!'". Rediff. Retrieved 11 September 2009. Cite web requires |website= (help)
 11. Desai, Jigna (2004). "Sex in the Global City: The Sexual and Gender Politics of the New Urban, Transnational and Cosmopolitan Cinema in English". Beyond Bollywood: the cultural politics of South Asian diasporic film. Routledge. pp. 197–8. ISBN 0415966841. Retrieved 10 September 2009.
 12. Chris Arnot (10 November 2009). "Bollywood it ain't". Guardian. Retrieved 7 December 2009.
 13. "Going Solo". Indian Express. 16 February 2000. Retrieved 7 December 2009.
 14. Rushdie, Salman (2002). Step across this line: collected nonfiction 1992-2002. Random House. p. 77. ISBN 0679463348.
 15. "Second coming". Indian Express. 6 April 2000. Retrieved 5 December 2009.
 16. Bella Jaisinghani (9 December 1999). "Dark horse". Indian Express. Retrieved 2 December 2009.
 17. Uma DaCunha (27 February 2003). "Mani, Madhuri and Rahul Bose..." Screen Weekly. Retrieved 2 December 2009.
 18. Patrick Frater (11 September 2002). "India's Madhu takes international rights on Mr And Mrs Iyer". Screen Daily. Retrieved 2 December 2009.
 19. "Devgan, Konkona bag National Film Awards". Rediff. 26 July 2003. Retrieved 2 December 2009. Cite web requires |website= (help)
 20. Roshmila Bhattacharya (4 July 2003). "Small Wonders". Screen Weekly. Retrieved 7 December 2009.
 21. Sushmita Biswas (10 December 2005). "The new melody moguls". Calcutta Telegraph. Retrieved 7 December 2009.
 22. "Cinema unplugged, music unleashed". Indian Express. 17 January 2008. Retrieved 7 December 2009.
 23. Subhash K. Jha (5 January 2006). "15 Park Avenue to be dubbed in Hindi". Sify. Retrieved 7 December 2009. Cite web requires |website= (help)
 24. Raja Sen (15 September 2006). "Mallika's hot in Pyaar Ke Side Effects". Rediff. Retrieved 7 December 2009. Cite web requires |website= (help)
 25. Taran Adarsh (22 September 2006). "Tough competition!". Bollywood Hungama. Retrieved 7 December 2009. Cite web requires |website= (help)
 26. "Box Office 2006". BoxOffice India. మూలం నుండి 25 May 2012 న ఆర్కైవు చేసారు. Retrieved 7 December 2009. Cite web requires |website= (help)
 27. Taran Adarsh (15 September 2006). "Pyaaar Ke Side Effects - Movie Review". IndiaFM. Retrieved 7 December 2009. Cite web requires |website= (help)
 28. "Rahul's going great!". Times of India. 28 August 2008. Retrieved 7 Novmeber 2009. Check date values in: |accessdate= (help)
 29. Alaka Sahani (23 January 2008). "Rumblings of success". Indian Express. Retrieved 7 December 2009.
 30. "I want to do an action film, says Rahul Bose". Press Trust of India. 28 November 2009. మూలం నుండి 21 March 2012 న ఆర్కైవు చేసారు. Retrieved 7 December 2009. Cite web requires |website= (help)
 31. "'Bombay Summer' rules New York film fest, bags three awards". Deccan Herald. 20 November 2009. Retrieved 7 December 2009.
 32. Taran Adarsh (4 April 2008). "Shaurya". Bollywood Hungama. Retrieved 7 December 2009. Cite web requires |website= (help)
 33. Sneha Mahadevan (21 November 2008). "The game of life!". Screen. Retrieved 7 December 2009.
 34. Sharma, Ritesh (26 June 2009). "Interview: Rahul Bose". Glamsham.com. Retrieved 7 December 2009. Cite web requires |website= (help)
 35. Jha, Subhash K. (4 August 2009). "Rahul Bose puts direction plans on hold". Times of India. Retrieved 7 December 2009.
 36. 36.0 36.1 "Aparna Sen's 'The Japanese Wife' to be released on April 9". Outlook India. 24 February 2010. Retrieved 25 February 2010.
 37. "'The Japanese Wife' most splendid film of my life: Rahul Bose". Press Trust of India. Yahoo! News. 21 April 2009. Retrieved 7 December 2009.
 38. Joginder Tuteja (29 October 2009). "Horror, thriller, romance, drama - It's a new beginning for Rahul Bose". Bollywood Hungama. Retrieved 7 December 2009. Cite web requires |website= (help)
 39. Natarajan, H (17 November 1998). "Bose leads Bombay Boys to Singapore". The Indian Express. Retrieved 16 December 2008.
 40. "Rage for RUGBY". The Hindu. 10 May 2004. Retrieved 16 December 2008.
 41. Bhowmik, Aveek (9 June 2008). "Rahul Bose's rage for Rugby". Daily News & Analysis. Retrieved 16 December 2008.
 42. Rahul Bose launches scholarship scheme, 22 November 2006, retrieved 8 May 2008
 43. Rahul Bose appointed Oxfam's global ambassador, 31 July 2007, retrieved 5 August 2008
 44. "Citizens' groups, NGOs chalk out action plan for elections". Express News Service. 20 March 2009. Retrieved 7 April 2009. Cite web requires |website= (help)
 45. Singh, Shalini (20 January 2007), 'Being outraged isn’t enough', retrieved 5 August 2008
 46. "India's Swades Movement to Combat Climate Change, "Planet Alert" Launches with an 18 Hour Radio-thon across 45 Cities on June 5th, World Environment Day". Radio and Music.com. 6 June 2009. Retrieved 10 June 2009. Cite web requires |website= (help)
 47. "Take a break!". Times of India. 10 August 2005. Retrieved 16 December 2008.
 48. Mukherjee, Amrita (5 June 2006). "Aamir is 25 times more famous than me: Rahul". Times of India. Retrieved 16 December 2008.
 49. "When to shun that tickle, hug". Times of India. 24 September 2009. Retrieved 28 September 2009.
 50. Urvashi Sarka (8 November 2009). "Ace player, actor and activist". The Hindu. Retrieved 7 November 2009.
 51. "Rahul Bose and Danish model join hands". Indiatimes. 13 December 2009. Retrieved 14 December 2009.
 52. "No hot moments with Sameera: Rahul Bose". 2004. Retrieved 16 December 2008. Cite web requires |website= (help)
 53. "Short and sexy bollywood heroes". Times of India. 21 August 2007-09-21. Retrieved 16 December 2008. Check date values in: |date= (help)
 54. "The Changing Climate". Businessworld. ABP Group. 30 November 2007. Retrieved 1 December 2008.
 55. "IBN network gives away citizen journalist awards". Thaindian News. 17 October 2008. Retrieved 4 November 2008. Cite web requires |website= (help); Italic or bold markup not allowed in: |publisher= (help)
 56. "Jodhaa Akbar bags top honours at Indian 'Oscars'". Asian News. 18 June 2009. Retrieved 19 June 2009. Cite web requires |website= (help)
 57. "Rahul, Priyanka, Hrithik bag youth icon awards". Times of India. 27 September 2009. Retrieved 28 September 2009.
 58. "Akshay's son wins Green Globe Foundation Award". NDTV. 6 February 2010. Retrieved 8 February 2010. Cite web requires |website= (help)

బయటి లింకులు[మార్చు]

Wikiquote-logo-en.svg
వికీవ్యాఖ్యలో ఈ విషయానికి సంబంధించిన వ్యాఖ్యలు చూడండి.