రాహు (సినిమా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
రాహు
దర్శకత్వంసుబ్బు వేదుల
నిర్మాతఏ వి ఆర్ స్వామీ, శ్రీ శక్తి బాబ్జి, రాజా దేవరకొండ, సుబ్బు వేదుల
తారాగణంఅభిరామ్ వర్మ,కృతి గార్గ్
ఛాయాగ్రహణంఈశ్వర్ యల్లు మహాంతి, సురేష్ రఘుతు
సంగీతంప్రవీణ్ లక్కరాజు
విడుదల తేదీ
28–2–2020
సినిమా నిడివి
122.42 నిమిషాలు
దేశంభారతదేశం
భాషతెలుగు

తారాగణం

[మార్చు]
  • అభిరామ్ వర్మ
  • కృతి గార్గ్
  • కాలకేయ ప్రభాకర్
  • చలాకీ చంటి
  • గిరిధర్
  • సత్యం రాజేష్
  • స్వప్నిక తదితరులు

ఆరేళ్ళ వయసులో తల్లిని కోల్పోయి బాధలో ఉన్న బాను (కృతి గార్గ్)కి చిన్నతనంలోనే కన్వర్షన్ డిజార్డర్ కూడా వస్తోంది. అంటే రక్తం చూస్తే ఆమెకు కళ్ళు కనిపించవు. అయితే ఆమెలో ఆమె తండ్రి పోలీస్ కమీషనర్ (సుబ్బు వేదుల) ధైర్యం నింపే ప్రయత్నం చేస్తాడు. ఈ క్రమంలో కమీషనర్ క్రిమినల్ నాగరాజు (కాలకేయ ప్రభాకర్) ను అరెస్ట్ చేస్తాడు. దాంతో నాగరాజు ఎలాగైనా భానును చంపుతానని శపథం చేస్తాడు. అలా పదేళ్లు గడిచాక పెరిగి పెద్ద అయిన భాను, శేష్ (అభిరామ్ వర్మ,)తో ప్రేమలో పడుతుంది. వాళ్ళ ప్రేమను భాను తండ్రి అంగీకరించినప్పటికీ, వారి పెళ్ళికి ఒక సమస్య వస్తోంది. అలాగే భానును ఎవరో కిడ్నాప్ చేయించి చంపుదామని ప్రయత్నం చేస్తారు? ఆ క్రమంలో నాగాజు (కాలకేయ ప్రభాకర్) భానుకి ఎలాంటి సాయం చేశాడు .అసలు భాను పెళ్ళికి వచ్చిన సమస్య ఏమిటి ? ఇంతకీ భానుని చంపుదామనుకుంటున్న వ్యక్తి ఎవరు ? భాను తనకి జరిగిన అన్యాయాన్ని ఎలా ఎదుర్కొంది ? చివరికి తనను తాను ఎలా కాపాడుకుంది ? లాంటి విషయాలు తెలియాలంటే ఈ సినిమాని వెండితెరపై చూడాల్సిందే.[1][2]

మూలాలు

[మార్చు]
  1. "Raahu Movie Review in Telugu |" (in అమెరికన్ ఇంగ్లీష్). 2020-02-28. Archived from the original on 2020-02-28. Retrieved 2020-02-28.
  2. "'రాహు' మూవీ రివ్యూ". Sakshi. 2020-02-28. Archived from the original on 2020-02-28. Retrieved 2020-02-28.