Jump to content

రిచర్డ్ అటెన్‌బరో

వికీపీడియా నుండి
రిచర్డ్ అటెన్‌బరో
జననం(1923-08-29)1923 ఆగస్టు 29
కేంబ్రిడ్జి, ఇంగ్లండ్
మరణం2014 ఆగస్టు 24(2014-08-24) (వయసు 90)
లండన్, ఇంగ్లండ్
వృత్తినటుడు, దర్శకుడు, నిర్మాత
క్రియాశీల సంవత్సరాలు1942–2007
బిరుదుఅధ్యక్షుడు బ్రిటీస్ అకాడమీ ఆఫ్ టెలివిజన్ అండ్ ఫిల్ం అవార్డ్స్
పదవీ కాలం2001–2010
జీవిత భాగస్వామిషీలా సిమ్
(1945–2014; మరణం వరకు)
పిల్లలు3
(మైకేల్ అటెన్‌బరో తో కలిపి)
బంధువులుడేవిడ్ అటెన్‌బరో
(సోదరుడు)
జాన్ అటెన్‌బరో
(సోదరుడు)
గెరాల్డ్ సిమ్
(బావ మరిది)
జేన్ సీమోర్
(మాజీ కోడలు)

రిచర్డ్ అటెన్‌బరో ఒక హాలీవుడ్ దర్శకుడు.

నేపధ్యము

[మార్చు]

రిచర్డ్ 1923 ఆగస్టు 29న లండన్‌లో జన్మించారు. హాలీవుడ్‌లో నటుడిగా జీవితాన్ని ప్రారంభించిన ఆయన అంచెలంచెలుగా ఎదిగారు. తెల్లని గడ్డం, జట్టుతో ఆయన సరికొత్త ఫ్యాషన్ ట్రెండ్ సెట్ చేశారు. దీంతో ఆయన 'డికీ' అనే పేరుతో ప్రాచుర్యం పొందారు. 'ఓ వాట్ ఎ లవ్లీ వార్', 'చాప్లిన్', 'షాడో లాండ్స్' తదితర ఎన్నో విజయవంతమైన చిత్రాలకు దర్శకత్వం వహించారు. ఆయన తెరకెక్కించిన 'గాంధీ' చిత్రం ఆస్కార్ అవార్డుల పంట పండించింది. ఎనిమిది విభాగాల్లో అవార్డులను కైవసం చేసుకుంది. ఆయన నటించిన 'జురాసిక్ పార్క్', 'మిరాకిల్ ఆన్ 34 స్ట్రీట్' చిత్రాల గురించి ఎంత చెప్పినా తక్కువే. 2002లో 'పకూన్' చిత్రంలో రిచర్డ్ చివరిసారిగా కనిపించగా, ఆయన దర్శకత్వం వహించిన ఆఖరి చిత్రం 'క్లోసింగ్ ద రింగ్'.

మరణము

[మార్చు]

కొంతకాలంగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న రిచర్డ్ 2014 ఆగస్టు 25న తుది శ్వాస విడిచారని ఆయన కుమారుడు మైకెల్ అటెన్‌బరో తెలిపారు.రిచర్డ్ మృతిపై ఇంగ్లాండ్ ప్రధాని డేవిడ్ కామెరూన్ సంతాపం వ్యక్తం చేశారు. 'బ్రైటన్ రాక్' చిత్రంలో ఆయన నటన అద్భుతమని, 'గాంధీ' చిత్రం ఓ గొప్ప చిత్రమని కితాబిచ్చారు. రిచర్డ్ మృతి హాలీవుడ్‌కి తీరని లోటని ఈ సందర్భంగా కామెరూన్ అన్నారు.

బయటి లంకెలు

[మార్చు]